• English
  • Login / Register

MG Windsor EV vs Wuling Cloud EV: టాప్ 5 వ్యత్యాసాలు

ఎంజి విండ్సర్ ఈవి కోసం shreyash ద్వారా సెప్టెంబర్ 30, 2024 06:23 pm ప్రచురించబడింది

  • 225 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

విండ్సర్ EV మరియు క్లౌడ్ EV రెండిటిలో ఒకేలాంటి డిజైన్ మరియు ఫీచర్‌లు ఉంటాయి, కానీ, క్లౌడ్ EV పెద్ద బ్యాటరీ ప్యాక్ మరియు ADASని పొందుతుంది.

MG Windsor EV vs Wuling Cloud EV


 

MG విండ్సర్ EV ఇటీవల భారతదేశంలో విడుదల చేయబడింది. ఇది క్రాస్ఓవర్ ఎలక్ట్రిక్ కారు, ఇది అంతర్జాతీయ మార్కెట్లో 'వులింగ్' బ్రాండ్ బ్యానర్‌పై క్లౌడ్ EVగా విక్రయించబడింది. విండ్సర్ EV యొక్క డిజైన్ మరియు ఫీచర్లు దాని అంతర్జాతీయ వెర్షన్‌ను పోలి ఉంటాయి, అయితే ఇది స్పెసిఫికేషన్ మరియు ఎక్విప్‌మెంట్ పరంగా భిన్నంగా ఉంటుంది. విండ్సర్ EV మరియు క్లౌడ్ EV మధ్య వ్యత్యాసం ఏమిటి? మరింత తెలుసుకోండి:

కొలతలు

మోడల్

MG విండ్సర్ EV

వులింగ్ క్లౌడ్ EV

వ్యత్యాసం

పొడవు

4295 మి.మీ

4295 మి.మీ

మార్పు లేదు

వెడల్పు (అద్దాలు మినహాయించి)

1850 మి.మీ

1850 మి.మీ

మార్పు లేదు

ఎత్తు

1677 మి.మీ

1652 మి.మీ

+ 25 మి.మీ

వీల్ బేస్

2700 మి.మీ.

2700 మి.మీ.

మార్పు లేదు

విండ్సర్ EV మరియు క్లౌడ్ EV పరిమాణం దాదాపు ఒకే విధంగా ఉంటుంది కానీ ఇండియన్ విండ్సర్ EV క్లౌడ్ EV కంటే 25 మిమీ పొడవుగా ఉంది.

కలర్ ఎంపికలు

MG విండ్సర్ EV మరియు వులింగ్ క్లౌడ్ EV రెండూ వైట్, బ్లాక్ మరియు బీజ కలర్ ఎక్స్‌టీరియర్ ఎంపికలను కలిగి ఉన్నాయి, కానీ రెండింటికీ ప్రత్యేకమైన ఎంపికలు కూడా ఉన్నాయి. ఇండియన్ విండ్సర్ EVలో టర్కోయిస్ గ్రీన్ షేడ‌లో లభిస్తుంది, అయితే క్లౌడ్ EVలో మాల్టీస్ బ్లూ ఎంపికను అందిస్తుంది.

విండ్సర్ EV టర్కోయిస్ గ్రీన్

MG Windsor EV

క్లౌడ్ EV మాల్టేస్ బ్లూ

ఫీచర్‌లు

విండ్సర్ EVలోని అనేక ఫీచర్లు దాని అంతర్జాతీయ వెర్షన్ క్లౌడ్ EV నుండి తీసుకోబడ్డాయి. రెండు ఎలక్ట్రిక్ కార్లు 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్, 8.8-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 6-వే పవర్డ్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ మరియు 135 డిగ్రీల వరకు రిక్లైన్ యాంగిల్‌తో రేర్ సీట్లు వంటి సౌకర్యాలతో నిండి ఉన్నాయి.

కానీ, విండ్సర్ EVలో పనోరమిక్ ఫిక్స్‌డ్ గ్లాస్‌రూఫ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు కూడా ఉన్నాయి. మరోవైపు, క్లౌడ్ EVలో 4-వే పవర్డ్ కో-డ్రైవర్ సీటు ఉంది, ఇది విండ్సర్ EVలో లేదు.

భద్రత

భద్రత పరంగా, రెండు ఎలక్ట్రిక్ కార్లు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ హోల్డ్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా మరియు ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి భద్రతా ఫీచర్లను కలిగి ఉన్నాయి. విండ్సర్ EVలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నప్పటికీ, క్లౌడ్ EVలో 4 ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే అందించబడ్డాయి.

క్లౌడ్ EV అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ మరియు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) వంటి ఫీచర్‌లతో వస్తుంది, ఇవన్నీ విండ్సర్ EVలో లభించవు.

పవర్‌ట్రైన్

విండ్సర్ EVతో పోలిస్తే, వులింగ్ క్లౌడ్ EV పెద్ద బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంది మరియు దాని స్పెసిఫికేషన్‌లు క్రింది విధంగా ఉన్నాయి:

స్పెసిఫికేషన్‌లు

MG విండ్సర్ EV

MG క్లౌడ్ EV

బ్యాటరీ ప్యాక్

38 kWh

50.6 kWh

ఎలక్ట్రిక్ మోటార్ యొక్క సంఖ్య

1

1

పవర్

136 PS

136 PS

టార్క్

200 Nm

200 Nm

పరిధి

332 (MIDC)

460 km (CLTC)

MIDC - మోడిఫైడ్ ఇండియన్ డ్రైవ్ సైకిల్

CLTC - చైనా లైట్ డ్యూటీ వెహికల్ టెస్ట్ సైకిల్

ధర శ్రేణి & ప్రత్యర్థులు

MG విండ్సర్ EV ధర రూ. 13.50 లక్షల నుండి రూ. 15.50 లక్షల (ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా) మధ్య ఉంది, అయితే మీరు బ్యాటరీ రెంటల్ ఓనర్షిప్ ప్రోగ్రామ్ కోసం ప్రత్యేకంగా కిలోమీటరుకు రూ. 3.5 చెల్లించాలి. మీరు బ్యాటరీతో సహా పూర్తి కారును కొనుగోలు చేయాలనుకుంటే, విండ్సర్ EV ధర రూ. 9.99 లక్షల నుండి ఉంటుంది. విండ్సర్ EVని టాటా నెక్సాన్ EV మరియు మహీంద్రా XUV400 EVలకు క్రాస్ఓవర్ ప్రత్యామ్నాయంగా పరిగణించవచ్చు మరియు దాని ధర మరియు స్పెసిఫికేషన్‌లను పరిగణనలోకి తీసుకుంటే, దీనిని టాటా పంచ్ EVకి ప్రత్యామ్నాయంగా పరిగణించవచ్చు.

ఆటోమొబైల్ ప్రపంచం నుండి తక్షణ అప్‌డేట్‌లను పొందడానికి కార్దెకో వాట్సప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి.

మరింత చదవండి: MG విండ్సర్ EV ఆటోమేటిక్

was this article helpful ?

Write your Comment on M జి విండ్సర్ ఈవి

explore మరిన్ని on ఎంజి విండ్సర్ ఈవి

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
×
We need your సిటీ to customize your experience