ధరల సవరణ తరువాత, MG Hector, Hector Plus ధరలు ఇప్పుడు రూ.13.99 లక్షల నుండి ప్రారంభం

ఎంజి హెక్టర్ కోసం shreyash ద్వారా మార్చి 06, 2024 07:17 pm ప్రచురించబడింది

 • 164 Views
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

గత ఆరు నెలల్లో MG హెక్టర్ SUV ధరలను సవరించడం ఇది మూడోసారి.

MG Hector

ఈ నెలలో జరిగిన ధరల సవరణ తరువాత MG హెక్టార్ మరియు MG హెక్టార్ ప్లస్ ఇప్పుడు మరింత సరసమైనవిగా మారాయి. ఈ రెండు SUV కార్ల ధరలు ఫిబ్రవరి 2024లో తగ్గాయి, నవంబర్ 2023లో కూడా వీటి ధరలు సవరించారు. ఈసారి ధర తగ్గింపుకు MG ఎటువంటి కారణాలను వెల్లడించనప్పటికీ, హెక్టార్ SUV ప్రత్యర్థులతో పోటీ పడేందుకు దీని ధరను సవరించినట్లు తెలుస్తోంది. హెక్టర్ పాత షైన్ మరియు స్మార్ట్ వేరియంట్లకు బదులుగా, కొత్త షైన్ ప్రో మరియు సెలెక్ట్ ప్రో వేరియంట్లను ప్రవేశపెట్టారు.

ఈ రెండు SUVల వేరియంట్ల వారీగా కొత్త ధరల జాబితా ఇలా ఉంది:

MG హెక్టర్

పెట్రోల్

వేరియంట్

పాత ధర

కొత్త ధర

వ్యత్యాసం

మాన్యువల్

స్టైల్

రూ.14.95 లక్షలు

రూ.13.99 లక్షలు

(-) రూ.96,000

షైన్

రూ.16.24 లక్షలు

N.A.

N.A.

షైన్ ప్రో (కొత్త)

N.A.

రూ.16 లక్షలు

N.A.

స్మార్ట్

రూ.17.05 లక్షలు

N.A.

N.A.

సెలెక్ట్ ప్రో (కొత్త)

N.A.

రూ.17.30 లక్షలు

N.A.

స్మార్ట్ ప్రో

రూ.18.24 లక్షలు

రూ.18.24 లక్షలు

వ్యత్యాసం లేదు

షార్ప్ ప్రో

రూ.19.70 లక్షలు

రూ.19.70 లక్షలు

వ్యత్యాసం లేదు

ఆటోమేటిక్

షైన్ CVT

రూ.17.44 లక్షలు

N.A.

N.A.

షైన్ ప్రో CVT (కొత్త)

N.A.

రూ.17 లక్షలు

N.A.

స్మార్ట్ CVT

రూ.18.24 లక్షలు

N.A.

N.A.

సెలెక్ట్ ప్రో CVT (కొత్త)

N.A.

రూ.18.49 లక్షలు

N.A.

షార్ప్ ప్రో CVT

రూ.21 లక్షలు

రూ.21 లక్షలు

వ్యత్యాసం లేదు

సావీ ప్రో CVT

రూ.21.95 లక్షలు

రూ.21.95 లక్షలు

వ్యత్యాసం లేదు

 • MG హెక్టార్ పెట్రోల్ యొక్క బేస్-స్పెక్ స్టైల్ వేరియంట్ ఇప్పుడు రూ.96,000 మరింత సరసమైనది.

 • హెక్టర్ పెట్రోల్ స్మార్ట్ ప్రో, సావీ ప్రో వేరియంట్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

 • MG హెక్టార్ యొక్క ఈ వేరియంట్లు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉన్నాయి, ఇది 143 PS శక్తిని మరియు 250 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఇది కూడా చదవండి: టాటా నెక్సాన్ డార్క్ vs హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్: డిజైన్ వ్యత్యాసాలు వివరించబడ్డాయి

2023 MG Hector side

డీజిల్

వేరియంట్

పాత ధర

కొత్త ధర

వ్యత్యాసం

షైన్

రూ.17.50 లక్షలు

N.A.

N.A.

షైన్ ప్రో (కొత్త)

N.A.

రూ.17.70 లక్షలు

N.A.

స్మార్ట్

రూ.18.50 లక్షలు

N.A.

N.A.

సెలెక్ట్ ప్రో (కొత్త)

N.A.

రూ.18.70 లక్షలు

N.A.

స్మార్ట్ ప్రో

రూ.20 లక్షలు

రూ.20 లక్షలు

వ్యత్యాసం లేదు

షార్ప్ ప్రో

రూ.21.70 లక్షలు

రూ.21.70 లక్షలు

వ్యత్యాసం లేదు

 • MG హెక్టార్ డీజిల్తో, మీరు పెట్రోల్ ఆధారిత మోడళ్ల మాదిరిగా మరింత సరసమైన బేస్ వేరియంట్ యొక్క ప్రయోజనాలను పొందలేరు. గతంలో అందుబాటులో ఉన్న షైన్ వేరియంట్ కంటే కొత్తగా ప్రవేశపెట్టిన షైన్ ప్రో వేరియంట్ ధర రూ.20,000 ఎక్కువ.

 • అదేవిధంగా, కొత్త మిడ్-స్పెక్ ప్రో వేరియంట్ ధర స్మార్ట్ వేరియంట్ కంటే రూ.20,000 ఎక్కువ.

 • టాప్ లైన్ వేరియంట్లు స్మార్ట్ ప్రో మరియు షార్ప్ ప్రో ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

 • ఈ వేరియంట్లలో 2-లీటర్ డీజల్ ఇంజన్ ఉంది, ఇది 170 PS శక్తిని మరియు 350 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ఎంపికతో మాత్రమే అందించబడుతుంది.

MG హెక్టర్ ప్లస్

పెట్రోల్

వేరియంట్

పాత ధర

కొత్త ధర

వ్యత్యాసం

మాన్యువల్

స్మార్ట్ 7-సీటర్

రూ.17.75 లక్షలు

N.A.

N.A.

సెలెక్ట్ ప్రో 7-సీటర్

N.A.

రూ.18 లక్షలు

N.A.

షార్ప్ ప్రో 7-సీటర్

రూ.20.40 లక్షలు

రూ.20.40 లక్షలు

వ్యత్యాసం లేదు

షార్ప్ ప్రో 6-సీటర్

రూ.20.40 లక్షలు

రూ.20.40 లక్షలు

వ్యత్యాసం లేదు

ఆటోమేటిక్

షార్ప్ ప్రో 7-సీటర్ CVT

రూ.21.73 లక్షలు

రూ.21.73 లక్షలు

వ్యత్యాసం లేదు

షార్ప్ ప్రో 6-సీటర్ CVT

రూ.21.73 లక్షలు

రూ.21.73 లక్షలు

వ్యత్యాసం లేదు

సావీ ప్రో CVT 7-సీటర్

రూ.22.68 లక్షలు

రూ.22.68 లక్షలు

వ్యత్యాసం లేదు

సావీ ప్రో CVT 6-సీటర్

రూ.22.68 లక్షలు

రూ.22.68 లక్షలు

వ్యత్యాసం లేదు

 • హెక్టార్ యొక్క 3-రో వెర్షన్ అయిన MG హెక్టర్ ప్లస్ కూడా ధరల సవరణ మరియు వేరియంట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉంది.

 • దీని బేస్-స్పెక్ స్మార్ట్ 7-సీటర్ వేరియంట్ ఇప్పుడు నిలిపివేయబడింది. దీనితో, హెక్టర్ ప్లస్ పెట్రోల్ ధర ఇప్పుడు రూ.18 లక్షల నుండి ప్రారంభమవుతుంది, ఇది మునుపటి కంటే రూ.25,000 ఎక్కువ.

 • హెక్టర్ ప్లస్ పెట్రోల్ యొక్క ఇతర అన్ని వేరియంట్ల ధరలో ఎటువంటి మార్పు లేదు.

2023 MG Hector

డీజిల్

వేరియంట్

పాత ధర

కొత్త ధర

వ్యత్యాసం

స్టైల్ 7-సీటర్

N.A.

రూ.17 లక్షలు

N.A.

స్టైల్ 6-సీటర్

N.A.

రూ.17 లక్షలు

N.A.

స్మార్ట్ 7-సీటర్

రూ.19.40 లక్షలు

N.A.

N.A.

సెలెక్ట్ ప్రో 7-సీటర్ (కొత్త)

N.A.

రూ.19.60 లక్షలు

N.A.

స్మార్ట్ ప్రో 6-సీటర్

రూ.21 లక్షలు

రూ.21 లక్షలు

వ్యత్యాసం లేదు

షార్ప్ ప్రో 7-సీటర్

రూ.22.51 లక్షలు

రూ.22.30 లక్షలు

(-) రూ.21 వేలు

షార్ప్ ప్రో 6-సీటర్

రూ.22.51 లక్షలు

రూ.22.51 లక్షలు

వ్యత్యాసం లేదు

 • మీరు MG హెక్టార్ డీజిల్ కొనుగోలు చేయాలి అని ఆలోచిస్తుంటే, మీరు బదులుగా ఇప్పుడు హెక్టర్ ప్లస్ను ఎంచుకోవచ్చు. కొత్త బేస్ స్టైల్ వేరియంట్ 6- మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది, దీనితో ఇప్పుడు డీజిల్ ఎంపిక ధర రూ.2.4 లక్షలు సరసమైనదిగా మారింది. అదే సమయంలో, 5-సీటర్ హెక్టార్ డీజిల్ కంటే ఇది మరింత అందుబాటులో ఉంది.

 • హెక్టర్ ప్లస్ డీజిల్ కొత్త మిడ్ వేరియంట్ సెలెక్ట్ ప్రో 7 సీటర్ ప్రవేశపెట్టబడింది.

 • స్మార్ట్ ప్రో మరియు షార్ప్ ప్రో 6 సీటర్ వేరియంట్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే 7 సీటర్ షార్ప్ ప్రో వేరియంట్ ధర రూ.21,000 వరకు తగ్గింది.

ఇది కూడా చదవండి: ఈ 5 చిత్రాలలో కొత్త మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ చూడండి

షైన్ ప్రో & సెలెక్ట్ ప్రోలో కొత్తగా ఏమి ఉన్నాయి?

2023 MG Hector touchscreen

రెండు వేరియంట్లలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 14-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లభిస్తుంది. రెండు వేరియంట్లలో పుష్-బటన్ ఇంజిన్ స్టార్ట్-స్టాప్ ఫీచర్‌తో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్బాక్స్ ఎంపికలు కూడా లభిస్తాయి. మొదటి షైన్ వేరియంట్లో, ఈ ఫీచర్ CVT ఆటోమేటిక్ వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది.

షైన్ ప్రో వేరియంట్‌లో కనెక్ట్ చేయబడిన LED టెయిల్ ల్యాంప్లు అందించబడతాయి, ఇది గతంలో రెగ్యులర్ షైన్ వేరియంట్లో అందుబాటులో లేదు. షైన్ ప్రోకు సింగిల్-ప్యాన్ సన్ రూఫ్ మాత్రమే లభిస్తుంది, సెలెక్ట్ ప్రోకు పనోరమిక్ సన్ రూఫ్ లభిస్తుంది.

ప్రత్యర్థులు

MG హెక్టర్ టాటా హారియర్ మరియు మహీంద్రా XUV700 యొక్క 5-సీటర్ వేరియంట్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. మరోవైపు, MG హెక్టర్ ప్లస్ టాటా సఫారీ, XUV700 యొక్క 6/7-సీటర్ వేరియంట్లు మరియు హ్యుందాయ్ అల్కాజార్తో పోటీపడుతుంది.

మరింత చదవండి: హెక్టర్ ఆటోమేటిక్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఎంజి హెక్టర్

Read Full News

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

 • లేటెస్ట్
 • రాబోయేవి
 • పాపులర్
×
We need your సిటీ to customize your experience