• English
  • Login / Register

కొత్త బ్లాక్ స్టోర్మ్ ఎడిషన్ؚను పొందిన MG గ్లోస్టర్, 8-సీటర్‌ల వేరియెంట్ؚలను కూడా పొందుతుంది

ఎంజి గ్లోస్టర్ కోసం rohit ద్వారా మే 30, 2023 05:21 pm ప్రచురించబడింది

  • 115 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

గ్లోస్టర్ ప్రత్యేక ఎడిషన్ మొత్తం నాలుగు వేరియెంట్ؚలలో, 6- మరియు 7-సీటర్‌ల లేఅవుట్ؚలలో అందించబడుతుంది

MG Gloster Black Storm

  • MG గ్లోస్టర్ బ్లాక్ స్టోర్మ్ ధరను రూ.40.30 లక్షల నుండి రూ.43.08 లక్షల వరకు నిర్ణయించింది.

  • ఇది టాప్-స్పెక్ؚ గ్లోస్టర్ ప్రామాణిక వేరియెంట్‌పై ఆధారపడింది.

  • ఎక్స్ؚటీరియర్ మార్పులలో చాలా చోట్ల ఎరుపు రంగు యాక్సెంట్ؚలు మరియు రీడిజైన్ చేసిన గ్రిల్ ఉన్నాయి.

  • లోపల వైపు, రెడ్ యంబియెంట్ లైటింగ్ మరియు హైలైట్ؚలు కలిగిన పూర్తిగా నలుపు రంగు క్యాబిన్ؚతో వస్తుంది.

  • ఫీచర్‌లలో 12.3-అంగుళాల టచ్ؚస్క్రీన్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు ADAS ఉన్నాయి. 

  • 2WD మరియు 4WD ఎంపికలతో సాధారణ 2-లీటర్ టర్బో మరియు ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్ؚల నుండి శక్తిని పొందుతుంది. 

  • ప్రామాణిక గ్లోస్టర్ 6-సీటర్ వేరియెంట్ؚల స్థానంలో 8-సీటర్ వేరియెంట్ؚలను MG ప్రవేశపెట్టింది. 

  • కొత్త ధరలు రూ.32.60 లక్షల నుండి రూ.41.78 లక్షల వరకు ఉన్నాయి (ప్రామాణిక వర్షన్ؚకు)

MG గ్లోస్టర్, ప్రత్యేక ఎడిషన్ؚలను అందిస్తున్న బ్రాండ్‌ల జాబితాలో చేరింది, ప్రస్తుతం బ్లాక్ స్టోర్మ్ؚను ప్రవేశపెట్టింది. ఇది పూర్తిగా నలుపు రంగులో ఉన్న ప్రత్యేక ఎడిషన్. ప్రామాణిక మోడల్ؚతో పోలిస్తే కొన్ని లుక్ పరమైన మార్పులను పొందింది. ఇది సాధారణ మోడల్ టాప్-స్పెక్ؚ సావీ వేరియెంట్‌పై ఆధారపడుతుంది. 

ఎంత వెచ్చించాలి?

ఫుల్-సైజ్ SUV బ్లాక్ స్టోర్మ్ ఎడిషన్ؚను MG క్రింది ధరలలో పూర్తిగా నాలుగు వేరియెంట్ؚలలో అందిస్తుంది:

వేరియెంట్

బ్లాక్ ఎడిషన్ ధర (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

బ్లాక్ స్టోర్మ్ 6- మరియు 7-సీటర్ (2WD)    

రూ. 40.30 లక్షలు   

బ్లాక్ స్టోర్మ్ 6- మరియు 7- సీటర్ (4WD) 

రూ. 43.08 లక్షలు 

బ్లాక్ స్టోర్మ్ؚకు లుక్ పరంగా సరికొత్త మెరుగులు

బ్లాక్ స్టోర్మ్ ఎడిషన్ؚలో హెడ్ؚలైట్ క్లస్టర్‌లలో రెడ్ ఇన్సర్ట్లు, ORVM హౌసింగ్ؚలు, బ్రేక్ క్యాలిపర్‌లపై, డోర్ క్లాడింగ్ మరియు బంపర్‌లపై ఏరుపు రంగు హైలైట్‌లు వంటి అత్యంత ముఖ్యమైన అప్ؚడేట్లను గమనించవచ్చు. MG గ్రిల్ؚను కూడా రీడిజైన్ చేసింది, ప్రస్తుతం ఇందులో సమాంతర క్రోమ్ స్లాట్స్ స్థానంలో హనీకోంబ్ మెష్ వంటి నమునాతో వస్తుంది. గ్లోస్టర్ ప్రత్యేక వేరియెంట్ؚను గుర్తించేలా కొత్త “బ్లాక్ స్టోర్మ్” బ్యాడ్జ్ కూడా ఉంది. SUV ఎక్స్ؚటీరియర్ పైన పూర్తి క్రోమ్ బిట్ؚలను ఫాగ్ ల్యాంప్ గార్నిష్ మరియు విండో సరౌండ్ؚతో బ్లాక్ ఫినిష్ؚకు మార్చబడింది. 

దీని క్యాబిన్ ఫీచర్‌లలో కూడా కొత్త హైలైట్ؚలు ఉన్నాయి, ఇందులో డ్యాష్‌బోర్డ్ మరియు డోర్ ప్యాడ్‌లలో ఎరుపు రంగు యంబియెంట్ లైటింగ్, లెదర్ అప్ؚహోల్ؚస్ట్రీకి ఎరుపు కాంట్రాస్ట్ స్టీచింగ్ మరియు స్టీరింగ్ వీల్‌పై ఎరుపు రంగు యాక్సెంట్ؚలు ఉన్నాయి.

ఏవైనా కొత్త ఫీచర్‌లు ఉన్నాయా?

MG Gloster cabin

ప్రత్యేక ఎడిషన్ గ్లోస్టర్‌కు కేవలం లుక్ పరంగా మార్పులను అందించారు మరియు ఇప్పటికే అనేక ఫీచర్‌ల జాబితాను కలిగి ఉన్న ఈ SUVకి ఎటువంటి కొత్త ఫీచర్‌లను జోడించలేదు. MG గ్లోస్టర్ 12.3 అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్ؚరూఫ్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు 12-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ؚలను ఇప్పటికే కలిగి ఉన్నాయి. స్నో, మడ్, స్యాండ్, ఎకో, స్పోర్ట్, నార్మల్ మరియు రాక్ అనే ఏడు డ్రైవ్ మోడ్ؚలతో ఆల్-టెర్రైన్ సిస్టమ్ؚను పొందుతుంది.

దీని భద్రత ఫీచర్‌లలో అడ్వాన్సెడ్ డ్రైవర్ ఆసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), ఆరు ఎయిర్ؚబ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి.

ఇది కూడా చదవండి: భారతదేశంలో 10,000 వినియోగదారుల చెంతకు చేరుకున్న MG ZS EV 

ధర మరియు వేరియెంట్ؚల అప్ؚడేట్

MG Gloster Black Storm

ప్రత్యేక ఎడిషన్ మాత్రమే కాకుండా, MG ప్రామాణిక గ్లోస్టర్ 8-సీటర్ కొత్త వేరియెంట్ؚలను కూడా ప్రవేశపెట్టింది, 6-సీటర్ వేరియెంట్ؚలను నిలిపివేసింది. అంతే కాకుండా, ఈ కారు తయారీదారు పూర్తి శ్రేణిలో ఈ SUV ధరలను భారీగా తగ్గించింది.

సవరించిన వేరియెంట్-వారీ ధరలను ఇప్పుడు చూద్దాం:

వేరియెంట్ 

ధర

సూపర్ 7-సీటర్ (2WD)

రూ. 32.60 లక్షలు

షార్ప్ 7-సీటర్ (2WD)

రూ. 32.60 లక్షలు

సావీ 7-సీటర్ (2WD)

రూ. 39 లక్షలు

సావీ 8-సీటర్ (2WD)

రూ. 39 లక్షలు

సావీ 7-సీటర్ (4WD)

రూ. 41.78 లక్షలు

సావీ 8-సీటర్ (4WD)

రూ. 41.78 లక్షలు

పవర్ؚట్రెయిన్ؚలో ఎటువంటి మార్పు లేదు

సాధారణ మోడల్ؚలోని 4-వీల్ డ్రైవ్ؚట్రెయిన్ؚతో (4WD) 2-లీటర్‌ల ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్‌ను (216PS/479Nm) గ్లోస్టర్ బ్లాక్ స్టోర్మ్ ఎడిషన్‌తో అందించారు. రేర్-వీల్ డ్రైవ్ؚట్రెయిన్ؚతో (RWD) 2-లీటర్ డీజిల్ ఇంజన్ (161PS/374Nm) సెట్అప్ కూడా అందుబాటులో ఉంది. రెండు ఇంజన్‌లు 8-స్పీడ్‌ల ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించబడతాయి.

పోటీదారులు

MG Gloster rear

ఈ SUV గ్లోస్టర్ ప్రత్యేక ఎడిషన్ؚకు నేరుగా ప్రత్యర్ధులు లేకపోయినా టయోటా ఫార్ఛూనర్, జీప్ మెరిడియన్ మరియు స్కోడా కోడియాక్ؚల నుండి పోటీని ఎదుర్కొంటుంది.

MG గ్లోస్టర్ బ్లాక్ స్టోర్మ్‌ను “మై MG షీల్డ్” యాజమాన్య కార్యక్రమంతో, 180 కంటే ఎక్కువ ఆఫ్టర్-సేల్స్ సర్వీస్ ఎంపికలను అందిస్తుంది. దీని కస్టమర్‌లు 3+3+3 ప్యాకేజీని కూడా పొందగలరు, ఇందులో 3-సంవత్సరాల/అన్ లిమిటెడ్ km వారెంటీ, 3-సంవత్సరాల రోడ్ సైడ్ అసిస్టెన్స్, మరియు 3 లేబర్-ఫ్రీ పీరియాడిక్ సర్వీసులు ఉంటాయి.

ఇక్కడ మరింత చదవండి: గ్లోస్టర్ డీజిల్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on M జి గ్లోస్టర్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience