ఎస్ ఎల్ సి రోడ్స్టర్ ను బహిర్గతం చేసిన మెర్సిడెస్ బెంజ్

మెర్సిడెస్ బెంజ్ 2017-2021 కోసం sumit ద్వారా డిసెంబర్ 21, 2015 06:31 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Mercedes-Benz SLC

జైపూర్:మెర్సిడెస్ బెంజ్, 2016 డెట్రాయిట్ ఆటో షోలో ఎస్ ఎల్ సి రోడ్స్టర్ యొక్క ప్రదర్శనను వెల్లడించింది. అంతేకాకుండా దీనిని, 'ఎస్ ఎల్ కె ఫేస్లిఫ్ట్' అని పిలుస్తారు. ఈ కారు ముందు అలాగే వెనుక అనేక మార్పులు కలిగి ఉంది.

మెర్సిడెస్ బెంజ్ నుండి విడుదల కాబోతున్న ఈ వాహనం, దాని ముందు ఎస్ ఎల్ కె వాహనం వ్లే గుండ్రటి డిజైన్ ను కలిగి ఉంది అలాగే ఈ వాహనం యొక్క ముందు భాగంలో ఒక కొత్త బంపర్ ను కూడా కలిగి ఉంది. పునః రూపొందించబడిన హెడ్ లైట్ల తో పాటు ఒక కొత్త డైమండ్ గ్రిల్ తో ఈ వాహనం యొక్క ముందు భాగం చూడటానికి మరింత అద్భుతంగా ఉంది. ఈ జర్మన్ కార్ల తయారీదారుడు ఈ వాహనానికి ఒక కొత్త స్పోర్టీ లుక్ ను ఇవ్వడం కోసం వెనుక భాగానికి ఒక కొత్త బంపర్ ను అలాగే పునః రూపకల్పన చేయబడిన టైల్ లైట్లు అందించబడ్డాయి. అంతేకాకుండా ముఖ్యంగా, ద్వంద్వ ఎగ్జాస్ట్ వ్యవస్థ మరీ అద్భుతంగా ఉంది.

Mercedes-Benz SLC interiors

అంతర్గత భాగాల విషయానికి వస్తే, ఈ ఎస్ ఎల్ సి వాహనం మునుపటి వెర్షన్ మాదిరిగానే ఉంటుంది. ఈ వాహనం యొక్క అంతర్గత భాగంలో ఉండే, స్పోర్టియర్ స్టీరింగ్ వీల్, పునః రూపకల్పన చేయబడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు అన్ని కొత్త కమాండ్ సమాచార వ్యవస్థ వంటి వాటిలో మార్పులను గమనించవచ్చు.

ఈ మెర్సిడెస్ సంస్థ, ఈ ఎస్ ఎల్ సి వాహనం యొక్క ఎస్ ఎల్ సి300 మరియు ఎస్ ఎల్ సి43 వంటి రెండు వాహనాలకు డైనమిక్ సెలెక్ట్ వ్యవస్థ ను ప్రామాణికంగా అందించించి. ఈ వ్యవస్థ, కంఫోర్ట్, స్పోర్ట్, స్పోర్ట్+, ఈకో మరియు ఇండివిడ్యూల్ వంటి అనేక మోడ్ లను కలిగి ఉంది. అంతేకాకుండా ఈ వ్యవస్థ ఆధారంగా, ఇంజన్, ట్రాన్స్మిషన్, స్టీరింగ్ మరియు సస్పెన్షన్ ల మోడ్ లను ఎంపిక చేసుకోవచ్చు.

Mercedes-Benz SLC convertible

ఈ వాహనం యునైటెడ్ స్టేట్స్ లో, రెండు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. ఈ మోడల్ సిరీస్ యొక్క ఎస్ ఎల్ సి300 వాహనం, ఒక టర్బోచార్జర్ 2.0 లీటర్ నాలుగు సిలండర్ల ఇంజన్ తో జత చేయబడి ఉంది. అదే ఏఎంజి ఎస్ ఎల్ సి43 వాహనం విషయానికి వస్తే, ట్విన్ టర్బో చార్జర్ అత్యంత శక్తివంతమైన 3.0 లీటర్ వి6 పెట్రోల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ముందుగా 2.0 లీటర్ ఇంజన్ విషయానికి వస్తే, అత్యధికంగా 237 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 369 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు అత్యంత శక్తివంతమైన 3.0 లీటర్ ఇంజన్ విషయానికి వస్తే, అత్యధికంగా 357 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 520 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ఈ వాహనం యొక్క త్వరణం విషయానికి వస్తే, తక్కువ శక్తివంతమైన 2.0 లీటర్ ఇంజన్ ను కలిగి ఉన్న ఎస్ ఎల్ సి 300 వాహనం 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 5.7 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే వాహనం, 209 కె ఎం పి హెచ్ గల అధిక వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు అత్యంత శక్తివంతమైన 3.0 లీటర్ ఇంజన్, 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరుకోవడానికి 4.6 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు ఇదే వాహనం, 250 కె ఎం పి హెచ్ గల అధిక వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ఎస్ ఎల్ సి వాహనంలో, వాహనం ఢీకొన్న వెంటనే డ్రైవర్ ప్రతిస్పందన విఫలమై ఉంటే కారు స్వయంచాలకంగా బ్రేక్లు పనిచేయడానికి ఉపయోగపడే యాక్టివ్ బ్రేక్ విధానం అసిస్ట్ అందించబడింది. ఇదే కాక, వాహనం 40 కె ఎం పి హెచ్ లేదా తక్కువ వేగంతో వెళుతున్నప్పుడు, రిట్రాక్టబుల్ హార్డ్ టాప్ ను ఒపెన్ చేయవచ్చు లేదా మూసివేయవచ్చు.

కంపెనీ 2015 వ సంవత్సరంలో, 15 ఉత్పత్తులను భారతదేశం లో బలమైన దృడంతో ప్రారంభించింది 15 లో 15 వాహనాలను ప్రవేశపెడతాను అని ఈ సంస్థ వాగ్దానం ఇచ్చింది.

ఇది కూడా చదవండి:

తదుపరి తరం మెర్సిడెస్ బెంజ్ ఈ- క్లాస్ ఇంటీరియర్స్ బహిర్గతం

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మెర్సిడెస్ బెంజ్ 2017-2021

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience