• English
  • Login / Register

బహిర్గతం చేయబడిన మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ కూప్: బయటపడిన నిర్దేశాలు

మెర్సిడెస్ కొత్త సి-క్లాస్ 1997-2022 కోసం అభిజీత్ ద్వారా ఆగష్టు 17, 2015 03:20 pm ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: 2016 మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ కూప్ ను రెండు రోజుల క్రితం షో కేజ్ లో ప్రదర్శించారు మరియు ఇప్పుడు ఈ యూరోపియన్ తయారీ లక్షణాలు కలిగిన కారు మరిన్ని వివరాలతో బయటకు వచ్చింది. సి-క్లాస్ సెడాన్, ఎస్-క్లాస్ కి మరో రూపంగా కనిపిస్తోంది. ఈ సి-క్లాస్ లోని అంశాలు ఎస్-క్లాస్ నుండి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ కారు యూరోపియన్ ఆటో రంగంలో డిసెంబర్ లో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు కాగా దీనిని భారతదేశంలో, బహుశా 2016 సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించే అవకాశాలున్నాయి భావిస్తున్నారు.

కారు గురించిన విషయానికొస్తే, దీని ముందు మరియు వెనక వైపు భాగాలు భారీ అంశాలతో ఎస్- క్లాస్ వలె ఉంటాయి కానీ దీని సైడ్ ప్రొఫైల్ మాత్రం ఎస్-క్లాస్ కి కొంచెం భిన్నంగా ఉంటుంది. దీని సైడ్ ప్రొఫైల్ చాలా ప్రాముఖ్యమున్న మరియు సూటిగా ఉన్న షోల్డర్ లైన్ ను కలిగి ఉంది. ఇంకా రెండు వైపులా ఒక ప్రత్యేకమైన విండ్స్క్రీన్ సరిహద్దును కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీని ముందుభాగంలో బంపర్ మీద ఎయిర్ స్కూప్ ను, సిగ్నేచర్ మెర్సిడిస్ గ్రిల్ ను కలిగి ఉంటుంది. అదే విధంగా వెనక వైపు జారవిడిచిన రూఫ్ లైన్, విండ్షీల్డ్ అమరిక, వెడల్పుగా ఉండే టెయిల్ ల్యాంప్ మరియు ఒక మృదువైన రౌండ్ బ్యాక్ లను కలిగి ఉంది. ఎస్ క్లాస్ తో పోలిస్తే, సి-క్లాస్ ఒక బిట్ తేరుకున్నవిధంగా కనిపిస్తోంది.

ఈ యూరోపియన్ కూప్ కోసం మెర్సిడెస్ హుడ్ కింద చాలా ఇంజిన్ ఎంపికలు విడుదల చేసింది. 1.6 లీటర్ ఇంజిన్ 156 పిఎస్ శక్తిని సి180 వేరియంట్లో అందిస్తుంది మరియు 2.0-లీటర్ ఇంజిన్ సి200 ట్రిమ్ లో 184పిఎస్ శక్తిని అందిస్తుంది. అలాగే సి250 మరియు సి300 అదే 2.0 లీటర్ ఇంజన్ కలిగియుండి వరుసగా 211 పిఎస్ మరియు 245 పిఎస్ శక్తిని అందించవచ్చు.

భారతదేశంలో మెర్సిడెస్ నిరంతరం మరింత దూకుడుగా ఉండే ఎస్- క్లాస్ కూప్, ఎ ఎంజి లైనప్ మరియు సి క్లాస్ కూప్ వంటి వాటిని తీసుకొస్తునే ఉంది.రాబోయే సి క్లాస్ కూప్ వీటన్నింటిలో సి-క్లాస్ సెడాన్ ఇంజిన్ తో సమర్ధవంతంగా ఖరీదైనదిగా రాబోతున్నది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Mercedes-Benz కొత్త సి-క్లాస్ 1997-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కన్వర్టిబుల్ కార్స్

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience