ఎస్ 500, ఎస్ 63 ఏఎంజి మరియు మూడవ మోడల్ కారును నేడు ప్రారంభించనున్న మెర్సిడిస్ బెంజ్
మెర్సిడెస్ ఎస్-క్లాస్ 2012-2021 కోసం manish ద్వారా జూలై 30, 2015 12:08 pm ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: మెర్సిడెస్ బెంజ్ ఇండియా, ఎస్ 500 కూప్ మరియు ఎస్ 63 ఏఎంజి కూప్ మరియు ఇంకొక కారుతో కలిపి మొత్తం మూడు మోడల్ కార్లను జూలై 30, 2015 న ప్రవేశపెట్టనుంది. ఈ మోడల్స్ భారత దేశ మార్కెట్లో కొత్త ఎస్ క్లాస్ యొక్క కూప్ వెర్షన్లు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. ఈ మూడవ మోడల్ ఒక ప్రత్యేకమైన ఎడిషన్ మరియు 2015 మెర్సిడిస్ యొక్క 15 వ వాహన ప్రారంభంలో ఒక భాగంగా దీనిని ప్రవేశ పెడుతున్నారు. ఈ విడుదల ఫలితాలు కంపెనీ అభివృద్ధిని 41% పెరిగేలా చేస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి ఎస్500 నాలుగు డోర్ల వేరియంట్, ఇప్పుడు ఎస్ 500 రెండు డోర్ కూప్ వేరియంట్ వలె రాబోతోంది. ఎస్ 63 ఏఎంజి ఇపుడు ఒక కొత్త రంగు స్కీమ్ " క్రేజీ కలర్" తో అందించడానికి సిద్ధమవుతోంది. ఈ కారు ఇప్పటికే నాలుగు డోర్లతో ఫిబ్రవరి 2013 లో ఎక్స్-షోరూమ్ ముంబై లో రూ. 1.46 కోట్ల వద్ద ప్రారంభించబడింది.
ఎస్ 500 కూప్, 453బిహెచ్ పి మరియు 700 నానో మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేసే ఒక 4.7-లీటరు వి8 రెండు టర్బో ఇంజన్ లతో ప్రారంభించబడనుంది. ఈ ఎస్ 500 కూప్ లో అమర్చిన వి-8 పవర్ ప్లాంట్ ను , ఫోర్స్ ఇండియా పూణె ప్లాంటులో తయారు చేసారు.
ఈ ఎస్ 63 ఏఎంజి, 585 బి హెచ్ పి మరియు 900 నానో మీటర్ టార్క్ ను ఉత్పత్తి చేసే ఒక 5.5-లీటరు వి8 బై-టర్బో ఇంజిన్ తో ప్రవేశ పెట్టబడుతుంది. ఈ పవర్ ప్లాంట్ ఒక 7-స్పీడ్ ఏఎంజి స్పీడ్ షిఫ్ట్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడుతుంది. ఎస్ 63 కూప్ , దాని వెనుక చక్రాల కాన్ఫిగరేషన్ తో 4.2 సెకన్లనో 0-100 కి.మీ/ గం. వరకు వేగవంతం చేసుకోగలుగుతుంది లేదా దాని 4 మాటిక్ నాలుగు చక్రాల కాన్ఫిగరేషన్ తో 3.9 సెకన్లలో 0-100 కి.మీ/ గం. వరకు వేగవంతం చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కారు ఒక స్టీల్ అల్యూమినియం హైబ్రిడ్ బాడీ షెల్ తో ఉంటుంది. ఇది 250 కి.మీ/ గం. వరకు టాప్ స్పీడ్ (ఎలక్ట్రానిక్ పరిమితం) తో చేరుకోగల శక్తిని అందిస్తుంది మరియు ఈ కారు కూడా ఎస్ 63 సెడాన్ కంటే 90 కిలోలు తేలికైనదిగా రాబోతోంది.
అందమైన , ఎస్ 63 ఎ ఎం జి కూప్ మరియు ఎస్ 500 కూప్ పునఃరూపకల్పన బంపర్స్ మరియు పెద్ద బహుళ-స్పోక్ అల్లాయ్ వీల్స్ ని కలిగి ఉంటాయి. ఎస్ 500 వెనుకభాగం మరింత ఏటవాలుగా, అంతర్భాగాల్లో బాడి కిట్స్ మరియు కార్బన్ ఫైబర్ ట్రింస్ అన్నీ కూడా ఎస్63 కూప్ లో మాదిరిగానే ఉంటాయి. ఈ ఎస్500కూప్ నల్లటి అలాయ్స్, రెడ్ బ్రేక్ కాలిపర్స్, ఉదారమైన కార్బన్ ఫైబర్ వినియోగం మరియు ఆకర్షణీయమైన బాహ్య డిజైన్ ని కలిగి ఉండబోతున్నాయి. ఎస్63 ఎ ఎం జి క్వాడ్-ఎగ్జాస్ట్ యూనిట్లు మరియు ఎ ఎంజి బ్రాండింగ్ ని కూడా అందుబాటులోనికి రాబోతున్నది.
ఎస్ 500 కూప్ స్పెసిఫికేషన్స్:
ఇంజిన్: 4,663 సిసి వి8, బై- టర్బో
హార్స్ పవర్: 455
టార్క్: 700 ఎన్ఎమ్
గేర్బాక్స్: 7జి-ట్రానిక్ ప్లస్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్
ధర: రూ. 2 కోట్లు (ఊహిస్తున్న ఎక్స్-షోరూమ్ ధర)
ఎస్ 63 ఏఎంజి కూప్ స్పెసిఫికేషన్స్:
ఇంజిన్: 5,461 సిసి వి8, బై టర్బో
హార్స్ పవర్: 585
టార్క్: 900 ఎన్ఎమ్
గేర్బాక్స్: ఏఎంజి స్పీడ్ షిఫ్ట్ ఎంసిటీ 7-స్పీడ్ స్పోర్ట్స్ ట్రాన్స్మిషన్
ధర: రూ. 2.5 కోట్లు (ఊహిస్తున్న ఎక్స్-షోరూమ్ ధర)
ఈ మూడు కార్లు వాటి ధరలతో సహా ఏక కాలంలో ప్రారంభించబడతాయి.
మెర్సిడెస్ బెంజ్ ఇండియా కూడా ఎమ్ ఎల్ సి-క్లాస్ కూప్ ఎస్యువి, మేబ్యాచ్, ఏఎంజి జిటి స్పోర్ట్స్ కార్, వీటితో పాటు బి-క్లాస్ ఫేస్లిఫ్ట్ వంటి మోడల్లను మనకు అందించడానికి సిద్దమవుతోంది. జర్మన్ వాహన తయారీ దారులు భారత మార్కెట్ లో తమ ఉత్పత్తులను అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపొయే విధంగా అందిస్తున్నారు. అందుకే వారి యొక్క వార్షిక ఉత్పత్తి రెట్టింపై 20,000 యూనిట్ల వరకు ఉంది.