• English
  • Login / Register

రూ. 24.95 లక్షలు ధర వద్ద ప్రారంభించబడిన మెర్సిడెస్ బెంజ్ A-క్లాస్ ఫేస్లిఫ్

మెర్సిడెస్ ఏ జిఎల్ఈ కోసం arun ద్వారా డిసెంబర్ 08, 2015 04:53 pm ప్రచురించబడింది

  • 17 Views
  • 1 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

Mercedes-Benz A-Class Facelft

జర్మన్ వాహనతయారీసంస్థ మెర్సిడీస్ 15 ఇన్ 15 వ్యూహంలో భాగంగా ఆఖరి 15 వ వాహనం  A క్లాస్ ఫేస్‌లిఫ్ట్ ని ఈ రోజు ప్రారంభించబడినది. ఈ కారు రూ.24.95 లక్షల ధర వద్ద ప్రారంభించబడినది. A 180 స్పోర్ట్ రూ. 24.95లక్షలు (ఎక్స్-షోరూమ్ ముంబై) వద్ద ప్రారంభించబడినది మరియు  మెర్సిడెస్  A 200d వేరియంట్ రూ.25.95 లక్షలు (ఎక్స్-షోరూమ్ ముంబై)లో ప్రారంభించబడినది. ఎక్కువగా A-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ నవీకరించబడినది, కానీ యాంత్రికంగా మారలేదు. A-క్లాస్ ఫేస్లిఫ్ట్ అదే ఇంజన్ మరియు 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ గేర్బాక్స్ కాంబో ని కలిగి ఉంటుంది. అయితే, ఫేస్లిఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా మెర్సిడెస్ '4MATIC' వ్యవస్థ ని కలిగి ఉంది.     

Mercedes-Benz A-Class Facelift

పునః రూపకల్పన బంపర్ తో సౌందర్యపరమైనటువంటి మార్పులను కలిగి ఉంది. దీనిలో LED హెడ్‌ల్యాంప్స్ ఆప్షనల్ గా ఉంటాయి, అయితే హ్యాచ్ LED టెయిల్‌ల్యాంప్స్ ని కలిగి ఉంది. ఇంకా దీనిలో కొత్త వీల్స్,  వెనుక బంపర్ పైన కొత్తగా అమర్చబడిన ఎగ్జాస్ట్ మరియు ఒక పునఃరూపకల్పన గ్రిల్ వంటి దృశ్య మార్పులు ఉన్నాయి. లోపలివైపు, మెర్సెడీస్ సమాచార వినోద వ్యవస్థ కొరకు  క్రొత్త 8 అంగుళాల స్క్రీన్ ని కలిగి ఉంది. ఇది స్మార్ట్ఫోన్ ఇంటిగ్రేషన్ కొరకు ఆపిల్ కార్‌ప్లే మరియు మిర్రర్‌లింక్ సాఫ్ట్వేర్ ని కలిగి ఉంది. దీనిలో కొద్దిగా సవరించబడిన స్టీరింగ్, వివిధ మెటీరియల్ మరియు మూడ్ లైటింగ్ వంటి మార్పులను కలిగి ఉంది. A-క్లాస్ వాహనం  BMW 1 సిరీస్ మరియు వోల్వో  V40 వంటి వాహనాలకు వాటికి పోటీగా ఉంటుంది. మేము అతి త్వరగా మెర్సెడీస్  A45 AMG ని తీసుకురావాలని ఆశిస్తున్నాము. 

ఇంకా చదవండి 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Mercedes-Benz ఏ జిఎల్ఈ

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience