• English
  • Login / Register

మెర్సిడెస్ బెంజ్ 2015లో భారతదేశం లో తమ 15 పోర్ట్ఫోలియో కార్లను విడుదల చేశారు : సమగ్ర అవలోకనం

మెర్సిడెస్ బెంజ్ కోసం manish ద్వారా డిసెంబర్ 09, 2015 05:27 pm ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: 

మెర్సిడెస్ బెంజ్  వారు ప్రామిస్ చేసిన విధంగా ,తమ   15వ కారును   లాంచ్ చేశారు  ఇది తమ 2015 ఇండియా పోర్ట్‌ఫోలీయోకు గాను విడుదలైన చివరికారు , ఈ విడుదలైన , A-క్లాస్ ఫేస్-లిఫ్ట్,ధర   24.95 లక్షలు . ఈ సంవత్సరంకు గాను ఈ లగ్జరి  కారు తయారీదారులు ఒక ప్రత్యేకమైన    తమ ఉత్పాదకాల ద్వారా అభివృద్ధిని సాధించారు , తద్వారా వారు ఎన్నో నవికరించబడిన కారులను ఈ సంవత్సరం తీసుకు వచ్చారు. కనుక ఇప్పుడు మేము ,ఆ 15 కార్లా వివరాలు ముందుగా పోయిన  సంవత్సరం విడుదలైన వాహనం నుండి మొదలుకొని నేటి విడుదల వరకు క్రమంగా మీముందు వివరించనున్నాము . ఒక కొత్త సంవత్సరనికి స్వాగతం  పలకటానిని ఇంతకు మించి మంచి మార్గం ఉంటుందా .

1) మెర్సిడెస్ బెంజ్ CLA-క్లాస్ భారతదేశం లో ప్రారంభించబడింది;ధర, రూ.31,50 లక్షలు  : 

Mercedes-Benz CLA-Class

మెర్సిడెస్ బెంజ్ భారతదేశం INR 31,50 లక్షలు  (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) యొక్క ప్రారంభ ధర ట్యాగ్ తో దేశంలో చాలా ఎదురుచూస్తున్న, CLA-క్లాస్ ప్రారంభించింది. ఈ  మెర్సిడెస్ 'ప్రారంభ శ్రేణి లగ్జరీ సెలూన్ కావడంతో ,  అది ప్రధానంగా దేశంలో చౌకైన ఆడి, A3 సెలూన్ వ్యతిరేకంగా  పోటీ పడబోతుంది.

2) మెర్సిడెస్ బెంజ్ C 220 CDI రూ.39,90 లక్షలు ప్రారంభ ధర వద్ద భారతదేశం లో అడుగు పెట్టింది  : 

Mercedes-Benz C220 CDI

గత ఏడాది నవంబర్ లో పెట్రోల్ C 200 ప్రారంభించిన తరువాత , మెర్సిడెస్ బెంజ్ ఇప్పుడు దాని డీజిల్ వెర్షన్ భారతదేశం లో C 220 CDI పేరుతో  ప్రవేశపెట్టింది. ధరలు వరుసగా  INR 39.90 లక్షలు ,INR42.90 లక్షలు . డీజిల్ అవతార్ మొదట CBU మార్గంలో రానున్నది, అయితే  CKD కార్యకలాపాలు తరువాత దశలో మొదలవుతాయి. 

3) మెర్సిడెస్ బెంజ్ రూ 27,95 లక్షల ధర వద్ద  భారతదేశం లో B-క్లాస్ ఫేస్లిఫ్ట్  ప్రెవేశపెట్టబడింది  : 

Mercedes-Benz  B-Class

మెర్సిడెస్ బెంజ్ మరొక ఉత్పత్తి ప్రవేశంతో భారతదేశం లో దాని విస్తరణ పరంపర కొనసాగుతోంది. ముంబై లో ఒక ఆన్ గోయింగ్ ఈవెంట్ లో, సంస్థ దాని ఇప్పటికే అందుబాటులో B-క్లాస్ ఫేస్లిఫ్ట్ మోడల్ ప్రారంభించింది. కొత్త B-క్లాస్ పరిచయం పాటుగా, సంస్థ దాని sibling- యువ A-క్లాస్ డీజిల్ ఇంజన్ అప్గ్రేడ్ ఈ అవకాశాన్ని పట్టింది. ఇప్పుడు A200 CDI ఒక అదనపు 25 శాతం శక్తి మరియు 20 శాతం టార్క్ అందిస్తుంది. A200 CDI INR 26,95 లక్షలు (ఎక్స్-షోరూమ్ ముంబై) ధరకే అయితే A180 INR 25,95 లక్షల ధరకే ఉంది.

4) మెర్సిడెస్ బెంజ్ E400 కాబ్రియోలె రూ. 78.5 లక్షల ప్రారంభ వద్ద భారతదేశం లో ప్రారంభించబడింది :

Mercedes-Benz E400 Cabriolet

సంస్థ 15 ఇన్ 15 వ్యూహంలో భాగంగా మెర్సిడెస్ బెంజ్ ఇండియా  CLS ఫేస్లిఫ్ట్ తో పాటు భారతదేశం లో E400 కాబ్రియోలే ని ప్రారంభించింది. ఈ కారు  దేశంలో CBU మార్గం ద్వారా అమ్మకం చేయబడుతుంది మరియు కంపెనీ లైనప్ లో ఒక హాలో ఉత్పత్తిగా  వ్యవహరించబోతోంది. 

5) మెర్సిడెస్ బెంజ్  CLS 250 CDI ని  రూ. 76.5 లక్షల ధర వద్ద ప్రారంభించింది 

Mercedes-Benz CLS 250 CDI

CLA-క్లాస్, C-క్లాస్ డీజిల్, కొత్త  B-క్లాస్ మరియు నవీకరించబడిన A-క్లాస్ తరువాత మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఇప్పుడు దాని CLS 250  CDI ఫేస్లిఫ్ట్ ఉత్పత్తి శ్రేణి ని జోడించింది. ఈ కారు రూ. 76.5 లక్షల ధరకే ప్రారంభించబడి  E మరియు S క్లాస్ మధ్యలో ఉంది మరియు ఇది దేశంలో  CBU ద్వారా అమ్మకం చేయబడుతుంది.    

6) మెర్సిడెస్ బెంజ్ మేడ్ ఇన్ ఇండియా  C 220 సిడిఐ ని రూ.37.90 లక్షల ధర వద్ద ప్రారంభించింది 

Mercedes-Benz C 220 CDI
 
మెర్సిడెస్ బెంజ్ మొత్తం ధరలో 2% తగ్గింపుతో కొత్త చ్-క్లాస్ డీజిల్ ని ప్రవేశపెట్టింది. ఇది రూ. 37.9 లక్షల ప్రారంభ ధరతో మొదలవుతుంది. కొత్త సి 220 సిడిఐ స్థానిక ఉత్పత్తి భారతదేశంలో ప్రారంభమైన తొలి మూడు నెలల్లో మొదలవుతుంది. ఇప్పుడు ఇది భారతదేశం అంతటా అన్ని మెర్సిడెస్ బెంజ్ డీలర్షిప్ వద్ద అందుబాటులో ఉంటుంది.   

7) మెర్సిడెస్ బెంజ్ ఇండియా S600 గార్డ్ ని రూ. 8.9 కోట్ల ధర వద్ద ప్రారంభించింది 

Mercedes-Benz S-Gaurd

మెర్సిడెస్ బెంజ్ ఇండియా  దాని ప్రధాన లగ్జరీ సెడాన్ ఎస్-క్లాస్ యొక్క సాయుధ వెర్షన్ ను విడుదల చేసింది. S 600 గార్డ్ గా నామకరణం చేయబడి VR9 స్థాయి రక్షణను అందిస్తుంది మరియు రూ. 8.9 కోట్ల ప్రారంభ ధర వద్ద అందించబడుతుంది.   

8)/9)/10) మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎస్ 500 కూపే, ఎస్ 63 ఏఎంజి కూపే మరియు జి 63 ఏఎంజి క్రేజీ కలర్ ఎడిషన్ లను  ప్రవేశపెట్టింది 

మెర్సిడెస్, ఎల్లప్పుడూ లగ్జరీ యొక్క ఉదాహరణగా మరియు పర్యాయపదంగా మారింది. అదే విధంగా ఇప్పుడు కూడా ఒక విలాసవంతమైన స్పోర్ట్స్ కారు ఆధిపత్యం సాధించే లక్ష్యంతో మూడు కార్ల ను ఇటీవల విడుదల చేసింది. ఈ కారు కంపెనీ, నేడు దేశంలో ఎస్ 500 కూపే ను, ఎస్ 63 ఏఎంజి మరియు జి63 ఏఎంజి వాహనాలను ప్రవేశపెట్టింది. ఈ నమూనాలను భారత మార్కెట్లో ఎస్- క్లాస్ లో ప్రవేశపెట్టడం జరిగింది. ఎస్-క్లాస్ కూపేను రూ. ఈణృ 2.0 కోట్ల వద్ద,  మెర్సిడెస్ ఏఎంజి జి 63 క్రేజీ కలర్ ఎడిషన్ ను రూ. INR 2.17 కోట్ల వద్ద మరియు ఎస్63 ఏఎంజి కూపే ను రూ. INR 2.60 కోట్ల వద్ద, కంపెనీ ఎస్-క్లాస్ కూపే లో ఈ నమూనాలను టాగ్ చేసారు. 2015  మెర్సిడిస్ యొక్క 15 వ వాహన  ప్రారంభంలో ఒక భాగంగా ఈ మూడు వాహనాలను ప్రవేశ పెట్టడం జరిగింది. మెర్సిడెస్, ఒక కొత్త రంగు పథకం లో, జి63 ఏఎంజి ని ప్రారంభించింది మరియు "క్రేజీ రంగు" అను మారుపేరుతో కింద మనం గమనించవచ్చు. ప్రాథమికంగా ఈ ఎస్యువి, క్రింద చూపించిన విధంగా నియాన్ గ్రీన్ వంటి ప్రకాశవంతమైన రంగులో అందుబాటులో ఉంది. ఈ టెర్రైన్ ట్రైలర్స్ యొక్క యాంత్రిక భాగాలు, ఇప్పటికీ అలాగే ఉన్నాయి.

11) మెర్సిడెస్ ఎస్ 63ఎ ఎంజి సెడాన్  ని రూ.2.53 కోట్లు వద్ద ప్రారంభించింది 

Mercedes-Benz S 63 AMG

మెర్సిడెస్ బెంజ్ ఇండియా నేడు ఫ్లాగ్ షిప్ 2015 మెర్సిడెస్ ఎ ఎం జి ఎస్ 63 సెడాన్ ని రూ.2.53 కోట్లు వద్ద  ప్రారంభించింది.  ఇది 2015 సంవత్సరంలో దాని 15వ మోడల్ లో ఒకటిగా జోడించబడనున్నది. ఎస్ 500 కూప్, ఎస్ 63 ఎ ఎంజి కూప్ మరియు జి 63 క్రేజీ రంగు ఎడిషన్ ఇవన్నీ కూడా క్రిందటి నెల విడుదల అయ్యాయి. వీటితో పాటుగా మెర్సిడెస్ పోర్ట్ఫోలియోలో ఎ ఎం జి ఎస్ 63 సెడాన్ అధనంగా చేరింది.  ఇది 2015వ సంవత్సరంలో భారతదేశంలో ప్రారంభించబడిన  9వ ఎ ఎంజి మోడల్ మరియు మెర్సెడెజ్-బెంజ్ యొక్క 10వ మోడల్. మెర్సిడెస్ ఎ ఎం జి ఎస్ 63 సెడాన్ అదే 5.5-లీటరు వి8 బై-టర్బో ఎ ఎంజి ఇంజిన్ తో అమర్చబడి ఉంది. ఈ ఇంజిన్ ని ఇదివరుకే ఎస్63 కూప్ లో చూసాం. ఈ ట్విన్ టర్బో వి8 బెల్ట్స్ 585hpశక్తిని మరియు 90Nm టార్క్ ని అందిస్తాయి. ఈ కారు భారతదేశానికి సిబియు పద్దతి ద్వారా వచ్చింది  మరియు హ్యాండ్ క్రాఫ్టెడ్ పవర్ ప్లాంట్ లక్షణంతో వచ్చింది . ఇది 4.4 సెకన్లలో 0-100km/h వేగాన్ని చేరుకునేందుకు మరియు గరిష్టంగా 250km/h వేగాన్ని చేరుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఎస్63 సెడాన్ దాని 2-డోర్ వేరియంట్ వంటి మేజిక్ శరీర కంట్రోల్ సస్పెన్షన్ సిస్టమ్ తో వచ్చింది . ఇది ముందు భాగంలో రెండు స్టీరియోస్కోపిక్ కెమెరాలు ఎత్తు మరియు గుంతలు కనిపెట్టడానికి ఉపయోగించుకుంటుంది. ఇది చురుకుగా ఎయిర్ సస్పెన్షన్ దృఢత్వం రేటు సర్దుబాటు చేసుకొని మెరుగైన సౌకర్యం అందిస్తుంది.

12) మెర్సిడెస్ బెంజ్ C63 S AMG ని  రూ. 1.3 కోట్ల ధర వద్ద ప్రారంభించింది 

Mercedes-Benz C63 AMG S

మెర్సిడీస్ తన ప్రారంభాలను కొనసాగిస్తూ, ఈ రోజు భారత మార్కెట్లోనికి ఒక కొత్త ఉత్పత్తి  సి63 ఎస్ ఎఎంజి సెడాన్ ని రూ. 1.3 కోట్ల  వద్ద ఎక్స్-షోరూమ్ ఢిల్లీ లో ప్రారంభించింది. ఈ వాహనం మెర్సిడీస్ ఎఎంజి జిటి ఎస్ వలే 4.0 లీటర్, ట్విన్-టర్బో వి8 ఇంజిన్ ని కలిగి ఉంది. ఇది  503Bhp శక్తిని మరియు 700Nm టార్క్ ని అందిస్తూ మిల్లీసెకన్లు లోపల గేర్లు మార్చగలిగే 7-స్పీడ్ ఎఎంజి స్పీడ్ షిఫ్ట్ గేర్బాక్స్ తో అమర్చబడి ఉన్నది.   

13) మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఇ ఎస్యువి ని రూ.58.9 లక్షలు వద్ద ప్రారంభించింది

Mercedes-Benz GLE

మెర్సిడెస్ బెంజ్ ఇండియా, ఈ రోజు నవీకరించబడిన ఎంఎల్-క్లాస్ ని ప్రారంభించింది. ఇప్పుడు ఇది జిఎల్ఇ క్లాస్ గా కొత్త పేరుతో నామకరణం చేయబడినది. ఈ ఎస్యువి ఇప్పుడు రెండు డీజిల్ ఇంజిన్ ఎంపికలలో అందుబాటులో ఉంది మరియు వోల్వో ఎక్స్ సి90, బిఎండబ్లు ఎక్స్5 మరియు ఆడీ క్యు7 వంటి వాటితో పోటీ పడడానికి సిద్ధంగా ఉంది.

14) మెర్సిడెస్ - AMG GT- S ని  రూ. 2.4 కోట్ల ధర వద్ద ప్రారంభించింది

Mercedes-Benz AMG GT S

మెర్సిడెస్ బెంజ్ ఇండియా దాని ఫ్లాగ్‌షిప్ మోడల్ AMG GT- S ని రూ. 2.4 కోట్ల  ధర వద్ద  (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)లో ప్రారంభించింది.  ఇది ఈ ఏడాది ప్రారంభించబడుతున్న 5 వ ఏఎంజి. ఇది పూర్తిగా మెర్సిడెస్ AMG శాఖ చే అభివృద్ధి చేయబడినది. SLS AMG స్థానంలో ఈ సూపర్‌కారు కొత్త 4.0 లీటర్ ట్విన్ టర్బోV8 ఇంజిన్ చే అమర్చబడి 510ps శక్తిని మరియు 650Nm టార్క్ ని అందిస్తుంది.

15) మెర్సిడెస్ బెంజ్ A-క్లాస్ ఫేస్‌లిఫ్ట్  ని  రూ. 24.95 లక్షలు ధర వద్ద ప్రారంభించింది 

Mercedes-Benz A-Class facelift

జర్మన్ వాహనతయారీసంస్థ మెర్సిడీస్ 15 ఇన్ 15 వ్యూహంలో భాగంగా ఆఖరి 15 వ వాహనం  A క్లాస్ ఫేస్‌లిఫ్ట్ ని ఈ రోజు ప్రారంభించబడినది. ఈ కారు రూ.24.95 లక్షల ధర వద్ద ప్రారంభించబడినది. A 180 స్పోర్ట్ రూ. 24.95లక్షలు (ఎక్స్-షోరూమ్ ముంబై) వద్ద ప్రారంభించబడినది మరియు  మెర్సిడెస్  A 200d వేరియంట్ రూ.25.95 లక్షలు (ఎక్స్-షోరూమ్ ముంబై)లో ప్రారంభించబడినది. ఎక్కువగా A-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ నవీకరించబడినది, కానీ యాంత్రికంగా మారలేదు. A-క్లాస్ ఫేస్లిఫ్ట్ అదే ఇంజన్ మరియు 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ గేర్బాక్స్ కాంబో ని కలిగి ఉంటుంది. అయితే, ఫేస్లిఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా మెర్సిడెస్ '4MATIC' వ్యవస్థ ని కలిగి ఉంది.

was this article helpful ?

Write your Comment on Mercedes-Benz బెంజ్

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience