• English
    • Login / Register

    రూ. 1.3 కోట్ల ధర వద్ద ప్రారంభించబడిన మెర్సిడెస్ బెంజ్

    సెప్టెంబర్ 03, 2015 02:02 pm konark ద్వారా సవరించబడింది

    19 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    ముంబై: మెర్సిడీస్ తన ప్రారంభాలను కొనసాగిస్తూ, ఈ రోజు భారత మార్కెట్లోనికి ఒక కొత్త ఉత్పత్తి  సి63 ఎస్ ఎఎంజి సెడాన్ ని రూ. 1.3 కోట్ల  వద్ద ఎక్స్-షోరూమ్ ఢిల్లీ లో ప్రారంభించింది. ఈ వాహనం మెర్సిడీస్ ఎఎంజి జిటి ఎస్ వలే 4.0 లీటర్, ట్విన్-టర్బో వి8 ఇంజిన్ ని కలిగి ఉంది. ఇది  503Bhp శక్తిని మరియు 700Nm టార్క్ ని అందిస్తూ మిల్లీసెకన్లు లోపల గేర్లు మార్చగలిగే 7-స్పీడ్ ఎఎంజి స్పీడ్ షిఫ్ట్ గేర్బాక్స్ తో అమర్చబడి ఉన్నది.    

    ఈ కారు మొట్టమొదటిగా పారిస్ మోటార్ షో లో ప్రదర్శింపబడినది. ఇది మెర్సిడీస్ 15 ఇన్ 15 వ్యూహంలో మెర్సిడీస్ ఇండియా ఈ సంవత్సరంలో ప్రారంభిస్తున్న 11 వ కారు. కొత్త మెర్సిడెస్-బెంజ్ సి63 ఎస్  ఇటీవల విడుదలైన వ్యక్తిగతీకరించిన డిజైన్  ఎంపిక, ఎంబి డిజై నో అనే లక్షణాన్ని కూడా కలిగి ఉంది. దీని ద్వారా వినియోగదారులు వారికి నచ్చిన అంతర్భాగాల షేడ్స్, లెథర్ ఇంటీరియర్స్, డాష్బోర్డ్ ట్రింస్ మరియు స్పోర్టీరియర్ సీట్లు వంటివి ఎంచుకోవచ్చు.  

    ఈ సి63 ఎఎంజి ఎస్  0నుండి 100 కిలోమీటర్లు చేరుకొనేందుకు 4 సెకెన్ల సమయం తీసుకోగా గరిష్టంగా  250km/h వేగం వరకూ చేరుకోగలదు. లోపలివైపు, ఈ సి63 స్పోర్ట్ సీట్లు, ఫ్లాట్ - బోటండ్ స్పోర్ట్ స్టీరింగ్ వీల్, కార్బన్ ఫైబర్ మరియు అల్సంటరా లెథర్ వినియోగం ఇవన్నీ పొంది ఉంది.   

    ఇది ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎఎంజి కారు. దాని పనితీరు మరియు ప్రదర్శనతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇది మునుపటి సి63 ఎఎంజి తో పోలిస్తే, 32 శాతం అత్యంత ఇంధన సామర్ధ్యం గల ఎనిమిది సిలెండెర్ల పనితీరు కలిగిన కారు.       

    ఈ కారు బిఎండబ్లు ఎం3 మరియు కొత్తగా ప్రారంభించబడిన మసెరటి గిబ్లీ వలే సిబియు మార్గం ద్వారా  వచ్చింది.

    was this article helpful ?

    Write your Comment on Mercedes-Benz C6 3 AMG

    సంబంధిత వార్తలు

      ట్రెండింగ్‌లో ఉంది కార్లు

      • లేటెస్ట్
      • రాబోయేవి
      • పాపులర్
      ×
      We need your సిటీ to customize your experience