• login / register

మెర్సీడేజ్ వారు సీఎలే యొక్క ఉత్పత్తిని ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించారు

modified on సెప్టెంబర్ 09, 2015 04:51 pm by manish కోసం మెర్సిడెస్ బెంజ్

  • 6 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

మెర్సిడేజ్-బెంజ్ వారు వారి స్పోర్టీ మరియూ విలాసవంతమైన సెడాన్ సీఎలే యొక్క తయారీ ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. కారు కి 4 సిలిండర్ల టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజినుని అమర్చారు. ఇది 100Kw (136 హెచ్పీ) శక్తిని మరియూ 300ఎనెం టార్క్ ని విడుదల చేసే సామర్ధ్యం ఉంది మరియూ లీటర్ కి 17.9 కీ.మీ మైలేజీ ని అందిస్తుంది. దాదాపుగా 135Kw (183 హెచ్పీ) శక్తిని మరియూ 300ఎనెం టార్క్ ని అందించే ఒక 2-లీటర్ పెట్రోల్ వేరియంట్ తో పాటుగా ఇది 100 కీ.మీ ని 7.8 సెకనుల్లో చేరుకుంటుంది. ఈ కారు గరిష్టంగా 235 కీ.మీ లను చేరుకుంటుంది మరియూ భారతీయ రోడ్లకు అనువైన సస్పెన్షనుని కలిగి ఉంటుంది. సీఎలే కి 2699mm వీల్బేస్ ని సౌకర్యవంతమైన రైడ్ ని అందిస్తుంది.

మెర్సీడేజ్-బెంజ్ ఇండియా యొక్క మ్యానేజింగ్ డైరెక్టర్ మరియూ సీఈఓ అయిన ఎబర్హార్డ్ కర్న్ గారు," సీఎలే కి అద్భుతమైన డిజైన్, సాంకేతికమైన ఆవిష్కరణలు మరియూ వివిధ లక్షణాలను విభాగం లో మొదటి సారిగా అందిస్తున్నందున ఈ పోర్ట్ఫోలియో లో ఇప్పటికే ఇది విజయవంతంగా నిలుస్తోంది. దీనికి విరివిగా కొత్త కస్టమర్లు పెరుగుతున్నారు మరియూ విదేశీ మార్కెట్ లో ఉండేటువంటి పరిస్థితి భారతదేశం లో కూడా కనపడుతుంది. మేము ఈ సీఎలే వ్యూహంతో సంతృప్తిగా ఉన్నాము మరియూ మా కొత్త తరం కార్ల పెరుగుదలకి మరియూఈ మొత్తం విభాగానికే ఇది పూర్తిగా నిర్వచణం మార్చివేసింది. స్థానిక తయారీ సీఎలే ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది ఎందుకంటే అధిక విలువని మరియూ పెరిగిన అందుబాటు వలన," అని తెలిపారు.

అదనంగా, మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఆపరేషన్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాట్లాడుతూ " ఏకకాలంలో పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో సిఎల్ ఎ స్థానిక ఉత్పత్తి ప్రారంభించాలని తీసుకున్న కీలక నిర్ణయంతో ఈ సెడాన్ కోసం దీర్ఘ నిరీక్షణను కొంతమేరకు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. కొత్త అసెంబ్లీ లైన్ నుండి డీజిల్ సిఎల్ ఎ మరియు పెట్రోల్ జిఎల్ ఎ ఉత్పత్తి మొదలుపెట్టడం ద్వారా నూతన ఉత్పాదక సౌకర్యం తో మా భవిష్యత్ సిద్ధంగా ఉంది. మేము మా భారతీయ వినియోగదారులకు స్థానిక విలువలతో అతి తక్కువ సమయంలో ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అందిస్తున్నందుకుగానూ చాలా గర్వ పడుతున్నాము." అని తెలిపారు.

బాహ్యభాగాలలో, కారు బోనెట్ మరియు డైమెండ్ రేడియేటర్ గ్రిల్ మీద పవర్ డోం కలిగి ఉంది. కాంతి గుణకాలు మరియు హెడ్ల్యాంప్ కవర్ గ్లాస్ వెనుక ఎల్ ఇడి లు అనేవి పగటి పూట పనిచేసే  డ్రైవింగ్ లైట్లు (డి ఆర్ ఎల్ ఎస్) మరియు ఇండికేటర్స్ కి మరింత ప్రకాశాన్ని చేకూరుస్తాయి. సిఎల్ ఎ బాహ్య భాగాలలో మరియు అంతర్భగాలలో  అధిక నాణ్యత గల మెటీరియల్ తో స్పోర్టి స్టైలింగ్ తో వస్తుంది. ఈ కారు పానోరమిక్ సన్రూఫ్ మరియు మెర్సిడెస్ బెంజ్ రేడియో, యూజర్ ఫ్రెండ్లీ నావిగేషన్ మరియు ఖచ్చితమైన మ్యాప్  డేటా ని కలిగియున్న  నూతన తరం మల్టీమీడియా సిస్టమ్ తో వస్తుంది. సిఎల్ ఎ ఒక 5 స్టార్ యూరో నాప్ రేటింగ్ తో మరియు ఎబిఎస్, బిఎ ఎస్,ఇఎస్ పి మరియు  6 ఎయిర్బ్యాగ్స్ వంటి భద్రతా లక్షణాలతో వస్తుంది.

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన మెర్సిడెస్ బెంజ్

Read Full News
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?