• English
  • Login / Register

టోక్యో మోటార్ షోలో ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న మస్డా

అక్టోబర్ 01, 2015 11:49 am cardekho ద్వారా సవరించబడింది

  • 65 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: మస్డా వాహన తయరీసంస్థ తన 14 రకాల కార్లతో టోక్యో మోటర్ షోలో 2015 అక్టోబర్ 29 నుండి ప్రదర్శన చేసేందుకు సంసిద్ధమవుతుంది. ఈ ప్రదర్శన నవంబర్ 8 వరకూ 10 రోజుల పాటూ జరగనున్నది. దీనిలో ఎంతగానో ఎదురుచూస్తున్న మస్డా స్పోర్ట్స్ కూప్ కాన్సెప్ట్ మాత్రమే కాకుండా ఇటీవలే విడుదలైన మస్డా కొయిరు కాన్సెప్ట్ తో పాటు రేసింగ్ స్పెక్ మస్డా ఎంఎక్స్5 మరియు మస్డా కాస్మోస్పోర్ట్ యొక్క రెండు యూనిట్లు ప్రదర్శితం కానున్నాయి.

మస్డా ఆటోమొబైల్ ఔత్సాహికుల మధ్య తన కొత్త స్పోర్ట్ కూప్ కాన్సెప్ట్ యొక్క ట్రైలర్ ని విడుదల చేసి తన యొక్క ఉనికిని చాటుకుంది. ఆ కారు యొక్క చిత్రం కర్వీ బాడీ, పొడవైన హుడ్ మరియు నల్లని నేపధ్యాన్ని ని కలిగి ఉంది. దీని వెనుక ఉన్న ఎగ్జాస్ట్ గొట్టాలు కూడా చిత్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ,ఇవి ఖచ్చితంగా పెట్రోల్ హెడ్స్ ని పిచ్చెక్కించేలా చేస్తాయి. మిగిలిన వివరాల కొరకు ప్రదర్శన మొదలయ్యే వరకూ వేచి చూడాల్సిందే . "టోక్యో లో బహిర్గతమైన కారు ఆధునికంగా ఉంది కానీ మస్డా యొక్క పరంపర, ప్రామాణికతను మరియు మొత్తం స్పోర్ట్స్ మోడల్ చరిత్రనిఈ కారులో చూపించారు." అని అధికారులలో ఒకరు తెలిపారు.

ఈ సంస్థ 'ఏక్సిలరేట్ టూవార్డ్స్ అవర్ డ్రీమ్స్' అన్న థీమ్ కి అనుగుణంగా ఈ కొయిరు యొక్క ప్రదర్శన, మరియు మస్డా యొక్క అత్యుత్తమైన నమూనాలు' స్కై ఆక్టివ్ టెక్నాలజీస్ 'ని మరియు 'కోడో' యొక్క లక్షణాలను కలిగి ఉన్నాయి.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience