• English
    • Login / Register

    మాసెరాటి వారు 2016 యొక్క లెవాంటే ఎస్యూవీ యొక్క ఉత్పత్తిని ఖరారు చేశారు

    సెప్టెంబర్ 22, 2015 06:11 pm manish ద్వారా ప్రచురించబడింది

    • 21 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్: మాసెరాటి వారు లెవాంటే ఎస్యూవీ యొక్క ఉత్పత్తి వచ్చే ఏడాది ఫిబ్రవరీ నుండి మొదలు అవుతుంది అని ధృవీకరించారు. మార్చి లో జరిగే జెనీవా మోటర్ షోలో ఈ కారు ఆరంగ్రేటం చేస్తుంది. ఈ కారు కుబాంగ్ కాన్సెప్ట్ పై ఆధారపడి ఉంది మరియూ జీప్ ప్లాట్‌ఫార్మ్ కి వీడ్కోలు పలికారు. పునాదుల నుండి ఈ కారు మాసెరాటి గానే ఉంటుంది.

    మాసెరాటి కి సీఈఓ అయిన హరోల్డ్ వెస్టర్ గారు," ఇది 100 శాతం క్వాట్రొపోటో వేదిక పై ఆధారితమైంది మరియూ ఎన్నో కొత్త విషయాలతో అన్ని విధాలా సరికొత్తగా వస్తోంది, ఇది అన్ని కాన్సెప్ట్ కార్ల కంటే భిన్నంగా మరియూ మెరుగుగా ఉంటుంది," అని అన్నారు.

    మాసెరాటి వారు అమ్మకాలను 600 శాతం గత రెండు సంవత్సరాలలో పెంచుకున్నారు. ఇది కొత్త జిబ్లీ మరియూ క్వాట్రపోర్తే కారణంగా సంభవించింది. అల్ఫైరీ కాన్సెప్ట్ 2016 తయారీ కూడా దీని విడుదల తరువాత జరుగుతుంది. ఇది జాగ్వార్ F-టైప్ కి పోటీగా నిలుస్తుంది. ఇక 2017 లో, కంపెనీ వారు అల్ఫైరీ యొక్క క్యాబ్రియో వెర్షన్ ని కూడా ప్రవేశ పెట్టనున్నారు మరియూ గ్రాన్ ట్యురిస్మో 2018 లో విడుదల అవుతుంది.

    లెవెంటే టర్బోచార్జెడ్ ఇంజిన్ తో 350బిహెచ్పి మరియు  425బిహెచ్పి వి6ఎస్ తో అమర్చబడి ఉంది. కారు వి8 లో కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇది 560బిహెచ్పి శక్తికి పైగా అందిస్తుంది మరియు మూడు డీజిల్ ఇంజిన్లు 250బిహెచ్పి నుండి 340బిహెచ్పి పరిధిలో శక్తిని అందిస్తాయి. ఆల్ఫెరీ ఫ్యామిలీ కూప్ మరియు కాబ్రియో ని కూడా కలిగియుండి మూడు వేర్వేరు శక్తి ఎంపికలైన 410బిహెచ్పి, 450బిహెచ్పి మరియు 520బిహెచ్పి వేరియంట్లలో అందించబడుతుంది. భారతదేశంలో మసెరటీస్ లైనప్ అందుబాటులో ఉందంటే ఆశ్చర్యం లేదు.

    was this article helpful ?

    Write your వ్యాఖ్య

    ట్రెండింగ్‌లో ఉంది కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience