మారుతీ YRA కి బలేనో అని నామకరణం చేశారు, ప్రకటన విడుదల
జైపూర్:
బెంగళూరు లోని నెక్సా షోరూం వారు మారుతీ వారి రాబోయే హ్యాచ్ బ్యాక్ అయిన బలేనో యొక్క చిత్రాలతో కవ్వించారు. దీని బట్టి ఖచ్చితంగా తెలియ వచ్చినది ఏమనగా, ఈ కారుకి బలేనో అని పేరు పెట్టారు అని. వెబ్సైట్ లో కూడా ఈ కారు ఈ అక్టోబరులో విడుదల అవుతుంది అని చూపిస్తోంది.
బలెనో కి హ్యుండై ఎలీట్ i20 మరియూ హోండా జాజ్ పోటీగా నిలుస్తాయి. దీనికి 3995mm పొడవు, 1745mm వెడల్పు మరియూ 1470mm ఎత్తు ఉంటుంది. పోలిక కోసం, i20 కి 3985mm పొడవు, 1734mm వెడల్పు మరియూ 1505mm ఎత్తు కలిగి ఉంటుంది.
ఇది భారతదేశం లో ప్రఖ్యాతి గాంచిన ఇంజిన్లు కలిగి ఉంటుంది. ఒక 1.2-లీటర్ VTVT పెట్రోల్ మోటర్ మరియూ కొత్తగా విడుదల అయిన సియాజ్ వారు వాడే 1.3-లీటర్ SHVS డీజిల్ ఇంజిను ఉంటుంది. పోటీ కి తగినట్టు ఉండేందుకు, డీజిల్ మైలేజీ 28Kmpl గా ఉంది. యూరోపియన్ మార్కెట్ల కోసం, సుజూకీ వారు కొత్తగా అభివృద్ది చేస్తున్న 1.0-లీటర్ బూస్టర్ జెట్ ఇంజిను (ఒక రకమైన టర్బో పెట్రోల్) ని అమర్చి కొత్త బలెనో ని అందిస్తారు.
మంచి కొలతల కారణంగా 354 లీటర్ల డిక్కీ స్థలం అందింది. ఇది జాజ్ కంటే ఒక లీటరు ఎక్కువ. సీటింగ్ కూడా ఖాలీగా వెసులుబాటుగా ఉంటుంది. ఇక స్మార్ట్ ప్లే టచ్ స్క్రీన్ ఇంఫొటెయిన్మెంట్ తో నావిగేషన్ కూడా అందించడం జరుగుతుంది.