• English
  • Login / Register

బాలెనో ఆర్ ఎస్ వాహనాన్ని 2016 ఆటో ఎక్స్పో వద్ద బహిర్గతం చేసిన హోండా

మారుతి బాలెనో 2015-2022 కోసం sumit ద్వారా ఫిబ్రవరి 06, 2016 04:06 pm ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

దేశంలో ఈ బాలెనో ఆర్ ఎస్ వాహనం, సుజుకి యొక్క బూస్టర్ జెట్ టర్బో చార్జెడ్ పెట్రోల్ ఇంజన్ ను బహిర్గతం చేసింది.

Baleno RS

మారుతి సుజుకి సంస్థ, బాలెనో హాచ్బాక్ యొక్క స్పోర్టియర్ వెర్షన్ ను జరుగుతున్న 2016 ఆటో ఎక్స్పో వద్ద ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వాహనానికి, బాలెనో ఆర్ ఎస్ అను నామకరణం చేయడం జరిగింది. ప్రవేశపెట్టినప్పటి నుండి ఈ వాహనం, ఇదే విభాగం లో ఉండే వోక్స్వాగన్ పోలో జిటి టి ఎస్ ఐ మరియు అబార్త్ పుంటో వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది. భారతదేశం లో ఇది, సుజుకి యొక్క మొదటి టర్బో చార్జెడ్ చిన్న స్థానభ్రంశాన్ని కలిగిన పెట్రోల్ ఇంజన్ మరియు ఇదే ఇంజన్ ఇతర వాహనాలలో కూడా అందించే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే, బాలెనో యొక్క పోటీ వాహనం అయిన ఎలైట్ ఐ 20 వాహనం, హ్యుందాయ్ యొక్క 1.0 లీటర్ టర్బో జిడి ఐ ఇంజన్ ను ఇప్పటికీ బహిర్గతం చేయలేదు. అయితే, ఐ 20 వాహనం దేశంలో కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఈ కొత్త ఇంజన్ తో అందించబడుతుంది.

Baleno RS

సుజుకి నుండి ఈ కొత్త బూస్టర్ జెట్ సిరీస్, డైరెక్ట్ ఇంజక్షన్ తో పాటు టర్బో చార్జింగ్ ను కలిగి ఉంటుంది. ఈ బాలెనో ఆర్ ఎస్ వాహనం, 1.0 లీటర్ మూడు సిలండర్ల టర్బో చార్జెడ్ మోటార్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 110 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 170 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 5- స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.

Baleno RS

ఈ కొత్త వాహనం యొక్క లోపలి భాగానికి అలాగే బాహ్య భాగానికి స్పోర్టియర్ అంశాలను అందించడం జరిగింది. ముందుగా ఈ వాహనం యొక్క బాహ్య భాగం విషయానికి వస్తే, ముందు బంపర్ మార్పు చేయబడింది. వీటితో పాటు ఈ వాహనానికి, బై జినాన్ హెడ్ ల్యాంప్లు తో పాటు డి ఆర్ ఎల్ ఎస్ లు వంటి అంశాలు బాలెనో వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ కు అందించబడతాయి. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, కొత్త డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ తో పాటు స్లిం రైన్ గార్డ్ లు అందించబడతాయి. ఈ వాహనం యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, వెనుక భాగం అంతా ఫాక్స్ డిఫ్యూజర్ ను కలిగిన కొత్త డ్యూయల్ బంపర్ మినహాయిస్తే ఒకే విధంగా ఉంటుంది. మరోవైపు ఈ వాహనం యొక్క లోపలి భాగం విషయానికి వస్తే, బాలెనో ఆర్ ఎస్ వాహనం స్పోర్టియర్ అపోలిస్ట్రీ ను కలిగి ఉంటుంది. వీటన్నింటితో పాటు, అగ్ర శ్రేణి వాహనం అయిన ఆల్ఫా వేరియంట్ లో ఉండే 7 అంగుళాల స్మార్ట్ ప్లే సమాచార వ్యవస్థ తో పాటు ఆపిల్ కార్ ప్లే, ఎం ఐ డి తో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి అంశాలు ఈ వాహనానికి అందించబడ్డాయి.

మారుతి బాలెనో & మారుతి ఇగ్నిస్ వాహనాల ప్రదర్శన వీడియోలను వీక్షించండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Maruti బాలెనో 2015-2022

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience