Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మారుతి సుజుకి S-క్రాస్ ఫేస్‌లిఫ్ట్: వేరియంట్స్ వివరణ

మారుతి ఎస్-క్రాస్ 2017-2020 కోసం raunak ద్వారా మార్చి 19, 2019 11:22 am ప్రచురించబడింది

మారుతి సుజుకి S- క్రాస్ యొక్క మిడ్ లైఫ్ నవీకరణ ఇక్కడ ఉంది మరియు దాని ప్రత్యర్థి హ్యూండై క్రేటాతో దాని పోటీని పునరుద్ధరించడానికి అన్నింటినీ సెట్ చేసుకుంది. రెనాల్ట్ దాని యొక్క కాప్టర్ కారు ని రంగం లోనికి తీసుకొచ్చి ఈ పోటీ మరింత రసవత్తరంగా మార్చింది.

ఈ ఫేస్‌లిఫ్ట్ తో మారుతి సంస్థ S-క్రాస్ యొక్క బాహ్య సౌందర్యాన్ని మరింత పెంచడానికి ప్రయత్నించింది మరియు ఇందులో మంచి మంచి లక్షణాలు కూడా అందించింది. దీనిలో మీకు ఏ వేరియంట్ బాగుంటుందో పందండి చూద్దాం.

ప్రధానాంశాలు:

  • మారుతి సంస్థ S-క్రాస్ ఫేస్లిఫ్ట్ తో 1.6-లీటర్ డీజిల్ ఇంజన్ (DDiS 320: 120PS / 320Nm, 6 స్పీడ్ మాన్యువల్) ను విడిచి పెట్టింది మరియు ప్రస్తుతం తక్కువగా 1.3 లీటర్ డీజిల్ (DDiS 200: 90PS / 200Nm, 5-స్పీడ్ మాన్యువల్) ఇంజన్ ని కలిగి ఉంది.

  • 1.3-లీటర్ డీజిల్ ఇంజన్ సియాజ్ మరియు ఎర్టిగా లో ఉన్నట్టుగా సుజుకి యొక్క SHVS మైల్డ్-హైబ్రిడ్ టెక్ కలిగి ఉండడంతో పాటూ ఇంజిన్ స్టార్ట్ స్టాప్ వ్యవస్థ, బ్రేక్ ఎనర్జీ రీజెనరేషన్ మరియు టార్క్ అసిస్టెంట్ ఫంక్షన్ వంటి లక్షణాలను కలిగి ఉంది.
  • SHVS వ్యవస్థ వలన S- క్రాస్ DDiS 200 యొక్క మొత్తం ఇంధన సామర్ధ్యం 23.65kmpl నుండి 25.1kmpl వరకు పెరిగింది.

  • ఈ అంతర్జాతీయ స్పెక్ ఫేస్‌లిఫ్ట్ బూస్టర్ జెట్ సిరీస్ – 1.0- లీటర్ / 1.4-లీటర్ టర్బో పెట్రోల్స్ కి నాంది పలికినప్పటికీ S-క్రాస్ లో పెట్రోల్ వెర్షన్ గురించి మారుతి సంస్థ ఏమీ చెప్పలేదు.
  • ఇది సిగ్మా (బేస్), డెల్టా, జీటా మరియు ఆల్ఫా (రేంజ్-టాపింగ్) - ఇది ముందు నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
  • బూట్ స్పేస్ (353-లీటర్లు) మరియు గ్రౌండ్ క్లియరెన్స్ (180 మిమీ) ఇవి మారడం లేదు.

ప్రామాణిక భద్రతా లక్షణాలు:

  • EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) తో ABS (వ్యతిరేక లాక్ బ్రేకింగ్ సిస్టమ్) తో పాటు డ్యూయల్- ఫ్రంట్ ఎయిర్ బాగ్స్
  • ఆల్-అరౌండ్ డిస్క్ బ్రేకింగ్

రంగు ఎంపికలు:

  • నెక్సా బ్లూ
  • కాఫిన్ బ్రౌన్
  • గ్రానైట్ గ్రే
  • ప్రీమియం సిల్వర్
  • పెరల్ ఆర్కిటిక్ వైట్
  • ఈ ఐదు రంగుల ఎంపికలలో, నెక్సా బ్లూ (చిత్రాలను తనిఖీ చేయండి) అధనంగా కొత్తగా చేర్చబడింది

మారుతి సుజుకి S- క్రాస్ సిగ్మా:

లక్షణాలు:

  • లైట్లు: హాలోజెన్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ (ప్రీ-ఫేస్లిఫ్ట్ మోడల్ కు బహుళ రిఫ్లెక్టర్ యూనిట్ ఉంది). సాధారణంగా ప్రకాశించే టెయిల్ ల్యాంప్స్, కానీ కొత్త గ్రాఫిక్స్ ని కలిగి ఉంటాయి.
  • ఆడియో: ఎటువంటి ఆడియో వ్యవస్థను అందించడం లేదు.

  • సౌకర్యాలు: సెంట్రల్ లాకింగ్, ఎలక్ట్రికల్ సర్దుబాటు వెలుపల రియర్ వ్యూ మిర్రర్స్ (ORVMs), పవర్ డ్రైవ్స్ తో డ్రైవర్-సైడ్ ఆటో అప్ / డౌన్, టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్, మాన్యువల్ A.C మరియు ఎత్తు సర్దుబాటు సీటు బెల్ట్స్ ని కూడా అందిస్తుంది

  • టైర్లు: స్టీల్ రింస్ తో(205/60 నుండి) 215/60 క్రాస్ సెక్షన్

మారుతి సుజుకి ఎస్-క్రాస్ డెల్టా:

బేస్ సిగ్మా వేరియంట్ మీద డెల్టా కలిగి ఉండే లక్షణాలు:

ఆడియో: బ్లూటూత్ కనెక్టివిటీ, ఆక్స్-ఇన్ మరియు USB ఇన్పుట్, CD ప్లేబ్యాక్ తో పాటూ నాన్ టచ్ డబుల్-డిన్ ఆడియో సిస్టమ్. ఈ యూనిట్ నాలుగు-స్పీకర్ సిస్టమ్ తో జతచేయబడి రిమోట్ తో వస్తుంది.

సౌకర్యాలు:

ఆడియో మరియు కాలింగ్ ఫంక్షన్లతో టెలీస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్, ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ మరియు వెనుక పార్కింగ్ సెన్సార్స్

లైట్స్: గ్లోవ్ బాక్స్, లగేజ్ కంపార్ట్మెంట్ మరియు ముందర ఫుట్వెల్ కోసం లైట్లు

సౌందర్యాలు: బ్లాక్ రూఫ్ రెయిల్స్ మరియు పూర్తి వీల్ కవర్

మారుతి సుజుకి S-క్రాస్ జీటా:

డెల్టా వేరియంట్ మీద జీటా కలిగి ఉండే లక్షణాలు:

ఆడియో: బిల్ట్ ఇన్ నావిగేషన్, ఆపిల్ కార్ప్లే మరియు గూగుల్ ఆండ్రాయిడ్ ఆటోలతో సుజుకి యొక్క 7-ఇంచ్ స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్ సిస్టమ్. ఈ యూనిట్ ఆరు స్పీకర్ సిస్టమ్ (నాలుగు-స్పీకర్లు మరియు రెండు ట్వీటర్స్)తో జత చేయబడుతుంది. అలానే వాయిస్ ఆదేశాలు, స్మార్ట్ఫోన్ యాప్ ఆధారిత రిమోట్ మరియు వెనుక పార్కింగ్ కెమెరా మద్దతు.

సౌకర్యాలు: ఇంజిన్ పుష్-బటన్ స్టార్ట్-స్టాప్ తో పాసివ్ కీలెస్ ఎంట్రీ, క్రూయిస్ కంట్రోల్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీట్, ఆర్ర్రెస్ట్ (ట్విన్ కప్ హోల్డర్స్)తో రిక్లైనింగ్ రేర్ సీట్లు మరియు ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ORVM. అలానే వెనుక వాష్ మరియు వైపర్ తో డీఫాగర్ ఉన్నాయి.

సౌందర్యాలు: 16-ఇంచ్ మెషీన్ కట్ డ్యుయల్-టోన్ అలాయ్స్, ORVM లపై టర్న్ ల్యాంప్స్, సాటిన్ ఫినిష్ ఇంటీరియర్ హైలైట్స్, పియానో బ్లాక్ ఇన్సర్ట్ తో సెంటర్ కన్సోల్

లైట్స్: ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్

మారుతి సుజుకి S- క్రాస్ ఆల్ఫా :

జెటా వేరియంట్ మీద, టాప్ వేరియంట్ ఆల్ఫా పొంది ఉన్న లక్షణాలు:

లైట్స్: డే టైం రన్నింగ్ LED లతో LED ప్రొజక్టర్ హెడ్‌ల్యాంప్స్ మరియు LED గ్రాఫిక్స్ తో టెయిల్ ల్యాంప్స్

సౌకర్యాలు: ఆటో లెవలింగ్, ఆటో వైపర్స్, ఆటో డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్ తో ఆటో హెడ్ల్యాంప్ లు

సౌందర్యాలు: లెథర్ అప్హోల్స్టరీ మరియు లెదర్ వ్రాపెడ్ స్టీరింగ్ వీల్

మొత్తానికి మారుతి సంస్థ అన్ని వేరియంట్స్ లోనీ అందరికీ ఏదో ఒక లక్షణం అందించడం జరిగింది. స్పెసిఫికేషన్స్ బట్టి చూసుకుంటే జెటా అనేది మనం ఇచ్చే ధరకు మంచి విలువను అందిస్తుంది. ప్రీ ఫేస్లిఫ్ట్ మారుతి సుజుకి S-క్రాస్ 1.3 లీటర్ DDiS 200 ధర రూ. 7.94 - 10.55 లక్షల (ఎక్స్-షోరూమ్, న్యూ ఢిల్లీ) పరిధిలో ఉంది మరియు 1.6 లీటర్ DDiS 320 డీజిల్ ఇంజిన్ (11.66 లక్షల రూపాయల ధరకే) నిలిపివేయడంతో, నవీకరించబడిన S- క్రాస్ ఇంచుమించు అదే రేంజ్ లో ధరను కలిగి ఉంటుందని ఊహిస్తున్నాము, ఎందుకంటే మైల్డ్ హైబ్రిడ్ టెక్ మినహా అనేక మార్పులు ఏమీ లేవు.

Check out: Renault Captur Vs Hyundai Creta Vs Maruti S-Cross Facelift

r
ద్వారా ప్రచురించబడినది

raunak

  • 26 సమీక్షలు
  • 1 Comments

Write your Comment పైన మారుతి S-Cross 2017-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.67.65 - 71.65 లక్షలు*
Rs.11.70 - 20 లక్షలు*
Rs.20.69 - 32.27 లక్షలు*
Rs.13.99 - 21.95 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర