మారుతీ సుజూకీ వారు ఆల్టో కే10 అర్బనో లిమిటెడ్ ఎడిషన్ ని విడుదల చేశారు
అక్టోబర్ 08, 2015 10:36 am raunak ద్వారా ప్రచురించబడింది
- 35 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: ఆల్టో కే10 అర్బనో లిమిటెడ్ ఎడిషన్ ని అన్ని ప్రస్తుత లభ్యమయ్యే వేరియంట్లలోనూ కేవలం రూ. 16,990 అధిక ధరకి అందిస్తున్నారు.
మారుతీ సుజుకీ వారు ఆల్టో కే10 యొక్క లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్ ని అర్బనో అనే పేరు మీద విడుదల చేశారు. కంపెనీ వారి ప్రకారం, ఆల్టో కే10 అర్బనో 18 కొత్త లక్షణాలను కలిగి ఉండి LX, LXi, VXi and VXi (O) ట్రిం లలో, సీఎన్‌జీ తో కలిపి అందుబాటులో ఉంటుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ ధర లభిస్తున్న వేరియంట్లపై రూ. 16,990 అధిక ధరకి అందుబాటులో ఉంటుంది.
ఆఫర్లో ఏముంది?
ఇది క్రోము పూతలు ఫాగ్ ల్యాంప్స్ పై, వీల్ ఆర్చెస్ పై, బాహ్యపు అద్దాలపై, టెయిల్ లైట్స్ పై ఇంకా బూట్ లిడ్‌ల పై కలిగి ఉంటుంది
సైడ్ ప్రొఫైల్ లో బాడీ వినైల్ ని కూడా కలిగి ఉంటుంది
లోపల, ఆర్ట్ లెదర్ అప్‌హోల్స్‌ట్రీ తో పాటుగా స్టీరింగ్ వీల్ కవర్, డిజైనర్ మ్యాట్స్ ఇంకా పెడల్స్, ఆంబియంట్ లైట్ మరియూ ఎల్ఈడీ డోర్ సిల్స్ ఉంటాయి.
ఇవి కాకుండా, రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, హ్యాండ్స్-ఫ్రీ బ్లూటూత్ కిట్, యూఎస్‌బీ కార్ చార్జర్ తో వోల్టేజ్ ఇంకా ఉష్ణోగ్రత డిస్ప్లే వంటి లక్షణాలు కలిగి ఉంటాయి.
ఆల్టో కే10 అర్బనో ని సమర్పిస్తూ, మారుతీ సుజుకీ ఇండియా లోని, మార్కెటింగ్ & సేల్స్ విభాగానికి ఎగ్జెక్యూటివ్ డైరెక్టర్ అయిన మిస్టర్. ఆర్. ఎస్. కల్సి గారు," ఈ అర్బనో బ్లాక్ మరియూ సిల్వర్ థీం తో కాంప్లమెంటరీ బాడీ గ్రాఫిక్స్ ఇంకా పూతకలిగి ఉంటుంది. రివర్స్ పార్కింగ్, హ్యాండ్స్-ఫ్రీ బ్లూటూత్ కిట్, ఫాస్ట్ యూఎస్‌బీ కార్ చార్జర్ వగైరా వంటి అనేక లక్షణాలను కస్టమర్లకు అందిస్తున్నము," అని తెలిపారు.
" ఈ లక్షణాలు ఆల్టో కే10 అర్బనో ని మరింత స్టైలిష్ మరియూ ట్రెండీ గా చేస్తాయి. మేము మా కస్టమర్లు దీనిని స్వాగతిస్తారు అని ఆశిస్తున్నాము," అని అన్నారు.