ఆన్‌లైన్‌లో లీక్ అయిన Maruti Suzuki Grand Vitara భారత్ NCAP క్రాష్ టెస్ట్ చిత్రాలు; ఫలితాలు త్వరలో వెలువడే అవకాశం
మారుతి గ్రాండ్ విటారా కోసం anonymous ద్వారా జూలై 26, 2024 06:14 pm ప్రచురించబడింది
- 171 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
అది నిజమైతే, భారత్ NCAP ద్వారా పరీక్షించబడే మొదటి మారుతి సుజుకి మోడల్ ఇదే అవుతుంది.
-
మారుతి సుజుకి గ్రాండ్ విటారా యొక్క భారత్ NCAP క్రాష్ టెస్ట్ చిత్రాలు విడుదల అయ్యాయి.
-
SUVలో నిర్వహించిన ఫ్రంటల్ మరియు సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లను చిత్రాలు వెల్లడిస్తున్నాయి.
-
క్రాష్ టెస్ట్ ఫలితాలను మారుతి లేదా BNCAP ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
-
దాని ప్రత్యర్థులైన స్కోడా కుషాక్ మరియు VW టైగన్ గ్లోబల్ NCAPలో ఐదు స్టార్లు సాధించాయి.
భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) అనేది భారతదేశంలోని గ్లోబల్ NCAPని ప్రభావవంతంగా భర్తీ చేస్తూ దేశంలో విక్రయించే వాహనాలపై క్రాష్ టెస్ట్‌లను నిర్వహించే భారతదేశపు స్వంత కార్ అసెస్‌మెంట్ చొరవ. ఫేస్‌లిఫ్టెడ్ టాటా హారియర్ మరియు సఫారీ ఈ కొత్త చొరవ కింద పరీక్షించిన మొదటి కార్లు కాగా, గ్రాండ్ విటారా BNCAP మూల్యాంకనం చేసిన మొదటి మారుతి కావచ్చు. గ్రాండ్ విటారా యొక్క క్రాష్ టెస్ట్ చిత్రాలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి, కాంపాక్ట్ SUVలో నిర్వహించిన ఫ్రంటల్ మరియు సైడ్ ఇంపాక్ట్ పరీక్షలు రెండింటినీ చూపించాయి.
క్రాష్ టెస్ట్ ఫలితాల గురించి మారుతి నుండి ఎటువంటి అధికారిక సమాచారం లేదు, లేదా BNCAP వెబ్‌సైట్‌లో ఎటువంటి చిత్రాలను పోస్ట్ చేయలేదు. అయితే త్వరలోనే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం, మాకు ఈ SUV యొక్క క్రాష్ టెస్ట్ రేటింగ్ గురించి ఖచ్చితమైన సమాచారం లేదు, కానీ గ్రాండ్ విటారా ఆధారంగా ఉన్న అదే ప్లాట్‌ఫారమ్ అయిన మునుపటి తరం విటారా బ్రెజ్జా 2018 లో గ్లోబల్ NCAP టెస్ట్‌లో ఫోర్ స్టార్స్ సాధించింది.
భారత్ NCAP టెస్టింగ్ కోసం కనీసం మూడు మోడళ్లను పంపినట్లు మారుతి ఇంతకు ముందు ధృవీకరించింది, వాటిలో గ్రాండ్ విటారా ఒకటి అని మేము భావిస్తున్నాము. ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ సాధిస్తే, అప్పుడు అది ఆ స్కోర్ సాధించిన మొదటి మారుతి కారు అవుతుంది. అంతేకాక, కొనుగోలుదారులకు అదనపు ప్లస్ పాయింట్‌ను అందించడం ద్వారా దాని అమ్మకాలను పెంచడానికి సహాయపడుతుంది. ధికారిక ఫలితాల కోసం వేచి ఉండవలసి ఉంటుంది, కానీ అప్పటి వరకు గ్రాండ్ విటారా యొక్క BNCAP స్కోరుపై మీ అంచనాలను క్రింది కామెంట్స్‌లో పంచుకోండి.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలలో లభిస్తుంది, 103 PS 1.5-లీటర్ పెట్రోల్ మరియు మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ మరియు 116 PS 1.5-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్‌ట్రైన్. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే/ ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భద్రత పరంగా ఇందులో, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు 360 డిగ్రీల కెమెరాతో రేర్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
గ్రాండ్ విటారా ధర రూ. 10.99 లక్షల నుండి ప్రారంభమై రూ. 20.09 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉంటుంది. ఇది MG ఆస్టర్, హోండా ఎలివేట్, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, టయోటా హైరైడర్, VW టైగన్ మరియు స్కోడా కుషాక్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
అన్ని తాజా ఆటోమోటివ్ అప్‌డేట్‌ల కోసం కార్దెకో యొక్క వాట్సప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి
మరింత చదవండి: గ్రాండ్ విటారా ఆన్ రోడ్ ధర