మారుతి సుజుకి సెలెరియో ఇప్పుడు అన్ని వేరియంట్లలో ఎయిర్బ్యాగ్స్ మరియు ABS ని కలిగి ఉంది
డిసెంబర్ 02, 2015 07:53 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
చెన్నై:
మారుతి సుజుకి సెలెరియో అన్ని వేరియంట్లలో డ్యుయల్ ఎయిర్బ్యాగ్స్ మరియు ABS ని కలిగి ఉంటుందని ప్రకటించింది. సెలేరియో 2014 లో ప్రారంభించబడినది మరియు AMT టెక్నాలజీ తో ప్రజాదరణ పొంది ప్రారంభించబడిన దగ్గర నుండి రూ. 1.3 లక్షల యూనిట్లకు పైగా విక్రయించబడినది. మారుతి సుజుకి సెలేరియో ని ఎయిర్బ్యాగ్స్ మరియు ABS తో రూ. 4.16 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరతో అందిస్తుంది.
"సెలెరియో ద్వారా మేము ఎల్లప్పుడూ వినియోగదారులకు ఉత్తమం చేకూర్చాలని ప్రయత్నిస్తున్నాము. సెలెరియో బేస్ వేరియంట్ నుండి డ్రైవర్ మరియు సహ డ్రైవర్ కోసం ఎయిర్బ్యాగ్స్ మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) వంటి భద్రతా లక్షణాలు అందించడం ద్వారా మేము వినియోగదారులను మరింత చేరువ చేసుకుంటున్నాము. మేము నిభందనల పరంగా సెలెరియో కి ఇటువంటి భద్రతా లక్షణాలను అందించగలుగుతున్నందుకు చాలా ఆనందిస్తున్నాము." అని మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మిస్టర్ RS కల్సి తెలిపారు.
మిస్ కాకండి : మారుతి సుజుకి యొక్క కాంపాక్ట్ ఎస్యువి అయిన వైబిఏ వాహన అంతర్గతభాగం బహిర్గతం!
సెలెరియో మారుతి సుజుకి కాంపాక్ట్ 800cc డీజిల్ ఇంజన్ ని కలిగియున్న మొదటి కారు. పెట్రోల్, డీజిల్ మరియు CNG అను మూడు ఫ్యుయల్ ఎంపికలను కలిగియుండి విభాగంలో మొదటి కారుగా ఉంది. పెట్రోల్ సెలెరియో ఒక 1.0-లీటర్, 3-సిలిండర్ ఇంజన్ ని కలిగియుండి 6000rpm వద్ద 67bhp శక్తిని మరియు 3500rpm వద్ద 90Nm టార్క్ ని అందిస్తుంది. 800 సిసి డీజిల్ ఇంజన్ 3500rpm వద్ద 47hp శక్తిని మరియు 2000rpm వద్ద 125Nm టార్క్ ని అందిస్తుంది. అయితే ఒక 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మూడు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండగా, 4-స్పీడ్ ఆంట్ పెట్రోల్ వెర్షన్ లో మాత్రమే అందించబడుతుంది.
చెక్ చేయండి
స్విఫ్ట్ మరియు స్-క్రాస్ కి AMT వెర్షన్ ని పెట్టాలని యోచిస్తున్న మారుతి సుజికి