• English
  • Login / Register

మారుతి సుజుకి సెలెరియో డీజిల్ వెర్షన్ ను ప్రారంభించింది; వాటి నిర్దేశాలు, లక్షణాలు మరియు ముఖ్యాంశాలు

జూన్ 04, 2015 12:45 pm sourabh ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: చాలా ఎదురుచూస్తున్న మారుతి సుజుకి సెలెరియో డీజిల్ వెర్షన్ ను రూ 4.65 లక్షల వద్ద ప్రవేశపెట్టింది. ప్రవేశ స్థాయి డీజిల్ కార్ల మద్య పోటీ ఇప్పుడు మరింత దూకుడుగా ఉంది. చేవ్రొలెట్ బీట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మరియు ఫోర్డ్ ఫిగో ల తో పోలిస్తే సెలిరియో అతి తక్కువ ధరను కలిగి ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు అత్యంత తక్కువ ధరను కలిగి ఉన్న డీజిల్ వాహనం సెలిరియో ఒక్కటే. మారుతి సుజుకి మొట్టమొదటి సారిగా సెలిరియో కు డీజిల్ ఇంజెన్ ను ప్రవేశపెట్టింది. ఈ ఇంజెన్ 793cc స్థానబ్రంశాన్ని కలిగి ఉంటుంది మరియు రెండు సిలెండర్లు అమర్చబడి ఉంటాయి. ఈ ఇంజెన్ అత్యధికంగా 47.6bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు 27.62kmpl మైలేజ్ ను అందిస్తుంది. మరిన్ని నిర్దేశాలు, లక్షణాలు మరియు ముఖ్యాంశాలను చూద్దాం రండి.  

   

బాహ్య కొలతలు

  • పొడవు: 3600మిల్లిమీటర్లు
  • వెడల్పు: 1600మిల్లిమీటర్లు
  • ఎత్తు: 1560మిల్లిమీటర్లు
  • వీల్బేస్: 2425మిల్లిమీటర్లు
  • గ్రౌండ్ క్లియరెన్స్: 165మిల్లిమీటర్లు
  • టర్నింగ్ వ్యాసార్ధం: 4.7మీటర్లు
  • బూట్ స్పేస్: 235 లీటర్లు
  • వాహనం బరువు: 880-900కిలోలు
  • ఇంధన ట్యాంక్ సామర్థ్యం: 35 లీటర్లు

బాహ్య లక్షణాలు

  • ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్
  • అల్లాయ్ వీల్స్
  • వెనుక వైపర్ తో వాషర్
  • విద్యుత్తో సర్దుబాటయ్యే వెలుపలి రేర్ వ్యూ మిర్రర్స్ తో పాటు సైడ్ సూచికలు
  • టైర్ల పరిమాణం: 165/70 R14
  • ముందు డిస్క్ బ్రేక్లు, వెనుక డ్రమ్ బ్రేక్లు

రంగు ఎంపికలు

  • సన్షైన్ రే
  • సెరులీన్ బ్లూ
  • సిల్కీ సిల్వర్
  • బ్లేజింగ్ రెడ్
  • పెర్ల్ ఆర్కిటిక్ వైట్
  • గ్లిస్ట్నింగ్ గ్రే

అంతర్గత లక్షణాలు

  • ఆడియో సిస్టమ్ తో ఆక్సలరీ, యుఎస్బి, 4 స్పీకర్ల తో బ్లూటూత్ కనెక్టవిటీ  
  • స్టీరింగ్ వీల్ పై నియంత్రణలు
  • ముందు మరియు వెనుక పవర్ విండోస్
  • ట్రిప్ కాలిక్యులేటర్
  • 60:40 ఫోల్దింగ్ రేర్ సీటు
  • పవర్ అవుట్లెట్  

భద్రతా లక్షణాలు

  • డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్
  • ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)
  • ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)
  • సెంట్రల్ లాకింగ్ తో పాటు ఇమ్మోబిలైజర్

ఇంజిన్, పవర్ మరియు గేర్బాక్స్

  • పవర్ట్రెయిన్: 0.8 లీటర్, డిడి ఐఎస్ 125, 2 సిలిండర్ డీజిల్ ఇంజిన్
  • అత్యధిక పవర్: 3500rpm వద్ద 47.6Ps
  • అత్యధిక టార్క్: 2000rpm వద్ద 125Nm
  • గేర్బాక్స్: 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్
  • ఇంధన సామర్ధ్యం: 27.6kmpl
was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience