• English
  • Login / Register

భారతదేశంలోనే మారుతి సుజుకి 15 మిల్లియన్లవ వాహనాన్ని ప్రవేశపెట్టే మొదటి కంపెనీగా మారింది

మే 27, 2015 04:23 pm raunak ద్వారా ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఇప్పుడు మారుతి 2020 సంవత్సరం నాటికి, ప్రతి ఏడాది 2 మిలియన్ల వాహనాలను ఉత్పత్తి చేయడాన్ని  లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, దీని కోసం అది భవిష్యత్తులో వివిధ విభాగాలలో కొత్త వాహనాలు పరిచయం చేసే ప్రణాలికలో ఉంది.  

దేశం యొక్క అతిపెద్ద వాహన తయారీదారి - మారుతి సుజుకి నేడు 15 మిల్లియన్లవ కారును ప్రవేశపెట్టినట్టు ప్రకటించింది. ఇది ప్రవేశపెట్టిన 15 మిల్లియన్లవ కారు మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడీఐ (చాసిస్ నంబర్: MA3FJEB1S00740865). దీనిని మనేసర్ ఉత్పాదక యూనిట్ నుండి ప్రవేశపెట్టడం జరిగింది. 

చరిత్రను తిరిగి చూస్తే, డిసంబర్ 1983 లో మారుతి 800 ఈ ఉత్పాదక యూనిట్ నుండి ప్రవేశపెట్టిన మొట్ట మొదటిగా కారుగా నిలుస్తుంది. ఈ మైలురాయిని కంపెనీ 31 సంవత్సరాలలో సాధించింది. అంతేకాకుండా, 1 మిలియన్ మార్చ్ 1994లో, 5 మిలియన్లు ఏప్రిల్ 2005లో, 10 మిలియన్లు మార్చ్ 2011లో మరియు 15 మిలియన్ల మైలురాయిని మే 2015లో చేరుకుంది.  

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సంస్థ యొక్క  ప్రొడక్షన్ శాఖకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన శ్రీ  రాజీవ్ గాంధీ, "మారుతి సుజుకి యొక్క ప్రయాణం కాయ్జెన్ (ఒక జపనీస్ వ్యాపార తత్వశాస్త్రం) లాంటిది, ఇది నిరంతర అభివృద్ధి చెందుతూ ఉంది.  షోరూంలలో మా ఉద్యోగులు అందించే అపారమైన సహకారం, మమ్మల్ని  వినియోగదారుల అవసరాలు మరియు ఆకాంక్షలను మెరుగైన విధంగా నెరవేర్చడానికి తొడ్పతుంది,'' అని చెప్పారు.  

తదుపరి, "మేము, మంచి సామర్థ్యం మరియు ప్రేరణ అందించే ఉద్యోగుల సహాయంతో  నాణ్యతమైన ఉత్పత్తులను అందిస్తూ మరియు,  అతి తక్కువ సమయంలో 20 మిలియన్ మార్క్ ను చేరుకోవాలని ఆశిస్తున్నాము,'' అని అన్నారు.    

టాప్ మోడల్   -  సంచిత ఉత్పత్తి (మిలియన్ యూనిట్లు) బ్రాండ్ ఆల్టో (కే10 తో సహా) -  3.1 మారుతి 800  -  2.9 ఓమ్ని  -  1.7 వాగన్ ఆర్   -  1.6 స్విఫ్ట్   -  1.3 డిజైర్  -  1.0

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience