మారుతి సుజుకి ఆల్టో 2019 Vs రెనాల్ట్ క్విడ్ Vs డాట్సన్ రెడి-GO: స్పెసిఫికేషన్ పోలికలు

మారుతి ఆల్టో 800 కోసం dhruv ద్వారా మే 15, 2019 12:29 pm ప్రచురించబడింది

  • 57 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మారుతి యొక్క ప్రవేశ-స్థాయి హాచ్బ్యాక్ 2019 కోసం నవీకరించబడింది. ఇది దాని ప్రత్యర్థులపై ఎంత పోటీని ఇవ్వగలదో చూద్దాము అన్నిటినీ కాగితంపై పెట్టి ఉంచాము, పదండి తెలుసుకుందాము.

Maruti Suzuki Alto 2019 vs Renault Kwid vs Datsun redi-GO: Spec Comparison

మారుతి ఆల్టో 800 ను ఆల్టో అని పిలుస్తున్నారు మరియు ఇక్కడ పేరు మాత్రమే మార్చబడలేదు. ఒక తేలికపాటి ఫేస్లిఫ్ట్ భాగంగా, మారుతి సుజుకి ఆల్టో 800cc ఇంజిన్ BSVI కంప్లైంట్ కి అనుగుణంగా తయారు చేసింది. ఇది కొత్త భద్రతా లక్షణాల యొక్క సమూహాన్ని కూడా కలిపి సురక్షితంగా చేసింది. అందువలన, నవీకరించబడిన 2019 ఆల్టో కాగితంపై దాని ప్రత్యర్థులతో ఎలా పోటీ పడుతుంది? పదండి చూద్దాము.

కొలతలు

కొలతలు

మారుతి సుజుకి ఆల్టో

రెనాల్ట్ క్విడ్

డాట్సన్ రెడీ-GO

పొడవు

3445mm

3679mm

3429mm

వెడల్పు

1490mm

1579mm

1560mm

ఎత్తు

1475mm

1478mm

1541mm

వీల్బేస్

2360mm

2422mm

2348mm

 

పొడవైనది: రెనాల్ట్ క్విడ్

వెడల్పైనది: రెనాల్ట్ క్విడ్

ఎత్తైనది: డాట్సన్ రెడ్-GO

పొడవైన వీల్బేస్: రెనాల్ట్ క్విడ్

ఇంజిన్

 

మారుతి సుజుకి ఆల్టో

రెనాల్ట్ క్విడ్ 0.8 SCe

డాట్సన్ రెడీ -GO 0.8 లీటర్

డిస్ప్లేస్మెంట్

796cc

799cc

799cc

గరిష్ట పవర్

47.3PS @ 6000rpm

54PS @ 5678rpm

54PS @ 5678rpm

గరిష్ట84 టార్క్

69Nm @ 3500rpm

72Nm @ 4386rpm

72Nm @ 4836rpm

ట్రాన్స్మిషన్

5-స్పీడ్ MT

5-స్పీడ్ MT

5-స్పీడ్ MT

ఉద్గార నియమం సమ్మతి

BS 6

BS 4

BS 4

అత్యంత శక్తివంతమైనది: రెనాల్ట్ క్విడ్, డాట్సన్ రెడి-G

అధిక టార్క్ ని అందించేది: రెనాల్ట్ క్విడ్, డాట్సన్ రెడి-GO

Maruti Suzuki Alto 2019 vs Renault Kwid vs Datsun redi-GO: Spec Comparison

లక్షణాలు

ఇంఫోటైన్మెంట్

ఆల్టో ఒక టచ్‌స్క్రీన్ లేకుండా ఒక సాధారణ ఆడియో వ్యవస్థను పొందుతుంది. అయితే, ఇది AUX, USB మరియు బ్లూటూత్ అనుసంధానానికి మద్దతు ఇస్తుంది. అయితే, దీనిలో స్మార్ట్ఫోన్ డాక్ అనేది ఉంది, దీనితో మీ స్మార్ట్‌ఫోన్ ని సిష్టం ద్వారా జత చేసి ఆడియో ని,  నావిగేషన్, ఇన్కమింగ్ కాల్స్ మరియు మరిన్ని నియంత్రించడానికి ఉపయోగించుకోవచ్చు. ఆల్టో రెండు ఫ్రంట్ స్పీకర్లతో వస్తుంది.

రెనాల్ట్ సంస్థ క్విడ్ ని ఆక్స్, USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీ కలిగిన టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో అందిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేలకు మద్దతు ఇస్తుంది. ఆల్టో మాదిరిగా, ఇది కర్మాగారం నుండి కేవలం రెండు ఫ్రంట్ స్పీకర్లతో మాత్రమే వస్తుంది.  

రెడీ-GO లో, డాట్సన్ బ్లూటూత్ కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే ఒక సాధారణ ఆడియో వ్యవస్థను అందిస్తోంది. ఇది ఫ్యాక్టరీ నుండి రెండు స్పీకర్లతో లభిస్తుంది.

Maruti Suzuki Alto 2019 vs Renault Kwid vs Datsun redi-GO: Spec Comparison

భద్రత

ఇక్కడ మూడు కార్లను EBD తో ABS ని మరియు డ్రైవర్ ఎయిర్బ్యాగ్ ని అందిస్తున్నాయి. అయితే, మారుతి ప్రయాణీకుల ఎయిర్బ్యాగ్ ని టాప్-స్పెక్స్ వేరియంట్ లో ప్రామాణికంగా అందిస్తోంది, ఇది తక్కువ-స్పెక్ వేరియంట్స్ లో ఆప్ష్నల్ గా అందిస్తుంది. ఆల్టో మరియు క్విడ్ ఆల్టో మరియు క్విడ్ రెండూ కూడా డ్రైవర్ మరియు కో- డ్రైవర్ కోసం ఒక సీట్ బెల్ట్ రిమైండర్ ని స్పీడ్ అలర్ట్ వ్యవస్థతో పాటూ అందిస్తున్నాయి. రెడీ-GO, అయితే ఈ రెండు లక్షణాలను కోల్పోతుంది. ఆల్టో వెనుక పార్కింగ్ సెన్సార్లను కూడా పొందుతుంది, అయితే క్విడ్ రేర్‌వ్యూ కెమెరాతో కలిగి ఉంటుంది.

సౌకర్య లక్షణాలు

ఈ పోలికలో మూడు కార్లు పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్ మరియు మాన్యువల్ AC లతో లభిస్తున్నాయి.

Maruti Suzuki Alto 2019 vs Renault Kwid vs Datsun redi-GO: Spec Comparison

ధర

కార్

మారుతి సుజుకి ఆల్టో

రెనాల్ట్ క్విడ్

డాట్సన్ రెడీ-GO

ధర పరిధి

రూ. 2.94 లక్షలు - రూ. 3.72 లక్షలు

రూ. 2.72 లక్షలు- రూ. 3.90 లక్షలు

రూ. 2.68 లక్షలు - రూ. 3.75 లక్షలు

రీడి-GO యొక్క బేస్ మోడల్ ఇక్కడ చౌకైన వేరియంట్ గా ఉంది, అలాగే ఇక్కడ టాప్-స్పెక్స్ వేరియంట్ లో క్విడ్ అత్యంత ఖరీదైనది. ఆల్టో మధ్యలో ధరలో ఉంటుంది మరియు ఈ మూడు కార్ల యొక్క తక్కువ వేరియంట్ లో చాలా ఖరీదైనది ఆల్టో. అయితే, దాని టాప్ వేరియంట్ ఈ మూడు కార్లలో అత్యంత సరసమైనదిగా ఉంది.  

ఆల్టో కూడా 1.0-లీటరు వెర్షన్ ని కలిగి ఉంది అందుకని K10 అని పిలుస్తారు, అయితే క్విడ్ మరియు రీడి-GO 1.0-లీటర్ ఇంజిన్లతో కూడా అందించబడతాయి. అయితే, ఈ పోలికను నవీకరించిన 2019 ఆల్టో కోసం, మేము 1.0-లీటర్ వేరియంట్లను ఖాతాలోకి తీసుకోలేదు.    

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి Alto 800

Read Full News

explore similar కార్లు

Used Cars Big Savings Banner

found ఏ కారు యు want నుండి buy?

Save upto 40% on Used Cars
  • quality వాడిన కార్లు
  • affordable prices
  • trusted sellers

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

కార్ వార్తలు

  • ట్రెండింగ్ వార్తలు
  • ఇటీవల వార్తలు

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience