విడుదల కు సిద్ధంగా ఉన్న ఎస్-క్రాస్ మొదటి టెస్ట్ డ్రైవ్ లోనే చోటు చేసుకున్న ప్రమాదం

మారుతి ఎస్-క్రాస్ 2017-2020 కోసం sameer ద్వారా ఆగష్టు 01, 2015 03:31 pm ప్రచురించబడింది

జైపూర్: ఈ ఆటోమొబైల్స్ చరిత్రలో ఊహించలేని సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల విడుదల అయిన హ్యుందాయ్ క్రెటా యొక్క ప్రమాదం తర్వాత, ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్న మారుతి సుజుకి ఎస్-క్రాస్, క్రాష్ కు గురి అయ్యింది. ఈ వాహనం భారతీయ రోడ్లపై ఇంకా విజయం సాధించక ముందే, ఈ దురదృష్టకర వాహనం ఎటువంటి ప్రమాదానికి గురి అయ్యిందో మనం ఈ క్రింది చిత్రాలను గనుక చూస్తే మనకు అర్ధం అవుతుంది.

ప్రమాదానికి కారణం ఇప్పటికీ తెలియదు, కానీ తాజా నివేదికల ప్రకారం డ్రైవర్ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అని చెబుతున్నారు. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, ఈ ప్రమాదం ఎటువంటి ప్రాణనష్ట్టాన్ని చోటు చేసుకోలేదు. అయితే ఈ క్రాస్ఓవర్ ఒక భారీ నష్ట్టానికి గురి అయ్యింది మరియు పొదలు లోకి దిగిన ముందు అనేక సార్లు బోల్తాపడింది. ప్రస్తుతం ఇది ఒక టెస్ట్-డ్రైవ్ వాహనం మరియు కారు యొక్క మొత్తం శరీరం భారీ నష్ట్టానికి గురి అయినట్లుగా తెలుస్తుంది.

ప్రమాద కారణం ఏదైనా కానీ, కారు అధిక వేగంతో ప్రభావితం అయ్యి అనేక సార్లు పరివేష్టితమయ్యాక మాములు స్థితికి చేరుకుంది. వాటి చిత్రాలను దగ్గరగా చూసినట్లయితే, స్టీరింగ్ అలాగే ఉంది. అంటే, అక్కడ ఎయిర్ బ్యాగ్స్ పని చేయలేదని తెలుస్తుంది. కారుకు ఉన్న అల్లాయ్ వీల్స్ చూస్తుంటే అది అగ్ర శ్రేణి వేరియంట్ అని అర్థమవుతోంది. కానీ ఇది ప్రామణికత కలిగిన ఎయిర్ బ్యాగ్స్ తో వస్తుంది. ఇది డ్రైవర్ యొక్క సీటు బెల్టు నిర్లక్ష్యం వల్ల జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. 

దీని ముందరిభాగం రిపేర్ చేయలేని విధంగా దెబ్బతింది. దీనిలో పిల్లర్స్ పూర్తిగా ధ్వంశమయిపోయి ముందరి పాసింజర్ సీటు ఎడమ విండో నుండి బయటకు వచ్చేసింది. ఈ క్రాస్ ఓవర్ యొక్క అన్ని విండో గ్లాస్లు పగిలిపోయాయి. దీని సున్నితమైన రూఫ్ లైన్ కూడా కొద్దిగా కిందకు జారిపోయింది. దీనిలో ప్రయాణించిన వారు ప్రమాదం కారణంగా చిన్న చిన్న గాయాలు పాలయ్యారు. మారుతీ ఎస్-క్రాస్ ఆగస్ట్ 5న ఇంకా ప్రారంభం కావల్సి ఉండగా, ఈ విధంగా ప్రమాదానికి గురి కావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మీరు మరింత వివరాలు తెలుసుకునేందుకుగానూ వీక్షిస్తూ ఉండండి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి S-Cross 2017-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience