మారుతి S-క్రాస్ ధరలు రూ.2 లక్షలకు పైగా తగ్గించబడ్డాయి
మారుతి ఎస్-క్రాస్ 2017-2020 కోసం nabeel ద్వారా జనవరి 19, 2016 07:01 pm సవరించబడింది
- 21 Views
- 1 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మారుతి సంస్థ S-క్రాస్ వాహనం చాలా డిస్కౌంట్ మరియు ఆఫర్లు అందించిన తరువాత, సంస్థ ఈ ప్రీమియం క్రాసోవర్ పై రూ. 2 లక్షల కంటే ఎక్కువ ధర తగ్గించాలని నిర్ణయించింది. ఈ ధర తగ్గుదల వాహనం పై అందిస్తున్న డిస్కౌంట్ లేదా ఆఫర్ కాదు, ఇది ధర యొక్క పునఃరుద్ధరణ మరియు ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ DDiS 320 ఆల్ఫా రూ.13.74 లక్షల( ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరను కలిగి ఉండేది, కానీ ఇప్పుడు ఈ వేరియంట్ రూ.11.69 లక్షల ధరకి అందించబడి దాదాపుగా రూ.2,05,000 తగ్గించబడింది. DDiS 320 యొక్క మొత్త రేంజ్ అంతా కూడా రూ.2.05 లక్షల తగ్గింపులోనే ఉండగా, DDiS 200 రూ.40,000 నుండి రూ.60,000 లకు తగ్గించబడింది.
మారుత్యి S-క్రాస్ వాహనం ఆగస్టు 05, 2015 న ప్రారంభించబడింది మరియు అప్పటి నుండి చాలా సవాళ్లు ఎదుర్కొంది. దీనిలో వచ్చిన సమస్య ఏమిటంటే ఈ కారు ప్రారంభించినప్పుడు కలిగియున్న ధర మరియు DDiS 200మరియు DDiS 320 మోటారు మధ్య ఉన్న ధర వ్యత్యాశం. S-క్రాస్ వాహనం నెలకు సుమారు 3,000 యూనిట్లు అమ్మకాలు చేస్తుంది మరియు హ్యుందాయి క్రెటా సుమారుగా 7,000 విక్రయాలతో మేనేజ్ చేస్తూ ఒక కటిన సమయం ఎదుర్కొంటుంది. ఈ కారు యొక్క అమ్మకాలు డీలర్స్ డిస్కౌంట్ అందించిన
రూ .5 లక్ష భారీ మొత్తం డిస్కౌంట్ల తరువాత ఊపందుకున్నాయి. ఇదే అంశం మారుతి S-క్రాస్ ని విజయం సాధించేలా చేయవచ్చు.
ఈ ధర తగ్గింపు అందరు కారు తయారీదారులు ధరను పెంచే సమయంలో వచ్చింది. మారుతి కూడా దాని అన్ని ఉత్పత్తులకు దాదాపు రూ .4,000 వరకు ధరని పెంచింది, బాలెనో వాహనం రూ.12,000 వరకు పెంపు నమోదు చేసుకుంది. ఈ తగ్గుదల ఎవరైతే S-క్రాస్ వాహనం కొనుగోలు చేసుకుందాం అనుకుంటున్నారో వారికి చక్కటి ఉపశమనంగా ఉంది. మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ET, RS కల్సి ప్రకారం " అవును, మేము 1.6 లీటర్ ఇంజిన్ యొక్క ధరని సవరణ చేసిన దగ్గర నుండి అమ్మకాలు ఊపందుకున్నాయి." మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్, నెక్సా చానెల్స్), పాత్రో బెనర్జీ ఇలా అన్నారు " వీటిలో 15,000 యూనిట్లు 1.3 లీటర్ వేరియంట్ నుండి అమ్మకాలు జరిగింది మరియు మిగిలినవి 1.6 లీటర్ వేరియంట్ నుండి జరిగినవి." ఇది భారతదేశంలో క్రాసోవర్ల తొలి ఆవిర్భవం మాత్రమే. క్రమంగా వినియోగదారులు దీని యొక్క విలువను గ్రహించి ఇక మీదట క్ర్రోసోవర్లను స్వీకరించడం మొదలు పెడతారు.
ఇంకా చదవండి
నెక్సా- మనకి ఉత్తమ శ్రేణి డీలర్ షిప్లు అవసరమా లేక ఉత్తమమయిన వాహనాలా ?