ప్రారంభమైన మారుతి ఇన్విక్టో MPV డీలర్‌షిప్ బుకింగ్‌లు, జూలై 5న విడుదల
మారుతి గ్రాండ్ విటారా మరియు టయోటా హైరైడర్ విధంగానే, టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా రూపొందించబడిన మారుతి ఇన్విక్టో
-
మారుతి ఇన్విక్టో ధర జూలై 5న వెల్లడించనున్నాను.
-
బలమైన-హైబ్రిడ్ టెక్నాలజీ ఎంపికతో హైక్రాస్ 2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందనుంది.
-
పనోరమిక్ సన్‌రూఫ్, 10-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, గరిష్టంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు మరియు ADASను కలిగి ఉంది.
-
రూ.19 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో వస్తుంది అని అంచనా.
మారుతి ఇన్విక్టో MPV ఆఫ్‌లైన్ ప్రీ బుకింగ్స్ ప్రస్తుతం ఎంపిక చేసిన డీలర్‌షిప్‌ల వద్ద ప్రారంభమయ్యింది. ఈ MPVని జూలై 5న ఆవిష్కరించనున్నాను మరియు అదే రోజున విక్రయాలు ప్రారంభించనున్నారు.
బాలెనో/గ్లాంజా మరియు గ్రాండ్ విటారా/హైరైడర్ కాంబినేషన్ల విధంగానే మారుతి ఇన్విక్టో టయోటా ఇన్నోవా హైక్రాస్ రీబ్యాడ్జ్డ్ వెర్షన్గా వస్తుంది. అయితే, తాజా రహస్య చిత్రాలలో చూసినట్లుగా, ఎక్ట్సీరియర్ పరంగా టయోటా MPVతో పోలిస్తే లుక్ పరంగా కొంత భిన్నంగా ఉండవచ్చు.
ఇది కూడా చదవండి: కియా కారెన్స్ లగ్జరీ ప్లస్ వర్సెస్ టయోటా ఇన్నోవా GX పోలిక
ఇన్నోవా హైక్రాస్‌లో ఉన్న 2-లీటర్ పెట్రోల్ ఇంజన్నే ఇన్విక్టోలో కొనసాగించారు, ఇది 174 PS పవర్ మరియు 205 Nm వరకు టార్క్‌ను అందిస్తుంది. ఇన్నోవాలో 186 PS వరకు పవర్‌ను అందించగల హైబ్రిడైజేషన్ ఎంపిక కూడా ఉంది. హైక్రాస్ హైబ్రిడ్ 23.24 kmpl వరకు మైలేజీ అందిస్తుంది మరియు ఇవే గణాంకాలను ఇన్విక్టోలో కూడా చూడవచ్చు.
ఇది పనోరమిక్ సన్‌రూఫ్, 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ మరియు డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్‌లతో వస్తుంది. భద్రతా పరంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ముందు పార్కింగ్ సెన్సార్‌లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. రాడార్ ఆధారిత భద్రతా సాంకేతికత అయిన, ADASను కలిగి ఉన్న మొదటి మారుతి కారు ఇది.
సంబంధిచినవి: CD మాటలలో: మారుతి MPV కోసం రూ.30 లక్షలకు పైగా చెల్లించడానికి సిద్ధంగా ఉండండి,
మారుతి ఇన్విక్టో ధర హైక్రాస్ శ్రేణి రూ.18.55 లక్షల నుండి రూ.29.99 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధర కంటే కొంత ఎక్కువగా ఉండవచ్చు. దీనికి ప్రత్యక్ష పోటీదారులు ఎవరు లేకపోయినా కియా కారెన్స్ మరియు మారుతి XL6ల కంటే ఖరీదైన మరియు మరింత ప్రీమియం ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.