మీ కోసం టయోటా ఇన్నోవా హైక్రాస్-ఆధారిత మారుతి ఎంగేజ్ MPV మొదటి లుక్
మారుతి ఇన్విక్టో కోసం tarun ద్వారా జూన్ 13, 2023 07:12 pm ప్రచురించబడింది
- 34 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జూలై 5న విడుదల కానున్న MPVని మారుతి 'ఎంగేజ్'గా ప్రకటించనుంది.
-
హైక్రాస్‌తో పోలిస్తే మారుతి MPV తేలికపాటి మార్పులను పొందినట్లుగా కనిపిస్తుంది.
-
Nexa నుండి ప్రేరణ పొందిన కొత్త గ్రిల్, భిన్నమైన అల్లాయ్ వీల్స్ మరియు సరికొత్త డిజైన్ గల LED టెయిల్ ల్యాంప్ వంటివి పొందనుంది.
-
పనోరమిక్ సన్‌రూఫ్, 10-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, వెంటిలేటెడ్ ముందు సీట్లు మరియు డ్యూయల్-జోన్ AC వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.
-
ఇది రాడార్ ఆధారిత ADAS టెక్నాలజీని పొందిన మొదటి మారుతి వాహనంగా నిలుస్తుంది
-
బలమైన -హైబ్రిడ్ సాంకేతికత ఎంపికతో ఇన్నోవా 2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనుంది.
మారుతి తన సరికొత్త MPVని జూలై 5న విడుదల చేయనుంది మరియు ఈ వాహనం అసలైన రహస్య చిత్రాలను ఇక్కడ అందించాము. టయోటా ఇన్నోవా హైక్రాస్ రీబ్యాడ్జ్ వెర్షన్గా, ఇది మారుతి ఎంగేజ్ పేరుతో విడుదల కానుంది.
హైక్రాస్‌తో పోలిస్తే మారుతి MPV తేలికపాటి మార్పులను పొందినట్లుగా రహస్య చిత్రాలలో గమనించవచ్చు. ముందు భాగంలో, Nexa నుండి ప్రేరణ పొందిన కొత్త క్రోమ్ గ్రిల్‌ను పొందింది. ఈ గ్రిల్ కారణంగా ఇది దాదాపుగా టయోటా MPV విధంగానే కనిపిస్తుంది.
సంబంధించినవి: CD మాటలలో: మారుతి MPV కోసం రూ.30 లక్షలకు పైగా చెల్లించడానికి సిద్ధంగా ఉండండి
ఈ మారుతి MPVని అనేక మోడల్‌లలో చూడవచ్చు. ఇందులో ఒక మోడల్ విభినమైన అల్లాయ్ వీల్ డిజైన్‌ను పొందింది. మారుతిలో కూడా కొత్త అల్లోయ్ వీల్ డిజైన్‌ను ఆశించవచ్చు. పక్క మరియు వెనుక భాగాలు టయోటా MPV పోలీకతో ఉండగా, వెనుక భాగంలో నెక్సా నుండి ప్రేరణ పొందిన సరికొత్త డిజైన్ గల LED టెయిల్ ల్యాంప్‌తో వస్తుంది.
డ్యూయల్ టోన్ షేడ్ మరియు ఒకే విధమైన ఫీచర్‌ల జాబితాతో, మారుతి MPV ఇంటీరియర్ హైక్రాస్‌ను పోలి ఉంటుంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ముందు సీట్‌లు, రెండో వరుసలో పవర్డ్ ఒట్టోమన్ సీట్‌లు ఉంటాయి. ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా, TPMS, మరియు ADAS వంటి భద్రత ఫీచర్‌లను పొందింది.
ఇది బలమైన-హైబ్రిడ్ సాంకేతికత ఎంపికగా, హైక్రాస్ 2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. MPV హైబ్రిడ్ వెర్షన్ 186PS పవర్‌తో, 23.24kmpl వరకు మైలేజ్‌ను అందిస్తుంది. పెట్రోల్ వేరియంట్‌లో CVT ట్రాన్స్‌మిషన్ లభిస్తుండగా, హైబ్రిడ్ e-CVT (సింగిల్ స్పీడ్ ట్రాన్స్‌మిషన్)తో జత చేయబడింది.
ఇవి కూడా చదవండి: టయోటా హైలక్స్‌లో ఆఫ్-రోడ్ సాహసయాత్ర!
ఇన్నోవా హైక్రాస్ ధర రూ.18.55 లక్షల నుండి రూ.29.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉండగా, మారుతి MPV కూడా సుమారుగా ఇదే ధరను కలిగి ఉంటుంది. టయోటా విధంగానే, మారుతి MPVకి కూడా ప్రత్యక్ష ప్రత్యర్థులు లేకపోయినా, ఇది కియా కారెన్స్‌కు ప్రీమియం ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.