• English
  • Login / Register

నాలుగు వేర్వేరు రంగుల్లో లభ్యమవుతున్న మారుతి ఇన్విక్టో

మారుతి ఇన్విక్టో కోసం ansh ద్వారా జూలై 10, 2023 02:02 pm ప్రచురించబడింది

  • 1.1K Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

టయోటా ఇన్నోవా హైక్రాస్ యొక్క రీబాడ్జ్ వెర్షన్ అయినప్పటికీ ఇన్విక్టోలో ఎంపిక చేసుకోవటానికి ఎక్కువ రంగులు ఉండవు. 

Maruti Invicto Colour Options

భారతీయ కారు తయారీదారు తమ సరికొత్త ఫ్లాగ్షిప్ మోడల్ కారు మారుతి ఇన్విక్టోను ఎట్టకేలకు ప్రవేశపెట్టారు. ఇది టయోటా ఇన్నోవా హైక్రాస్‌ నుండి పునర్నిర్మించిన వెర్షన్.  ఒకవేళ మీరు ఈ కారును ఆర్డర్ చేయాలనుకుంటున్నట్లయితే, ఈ ప్రీమియం MPV ఎన్ని రంగుల్లో లభ్యమవుతుందో  తెలుసుకోండి. 

ఇదీ చదవండి: మారుతి ఇన్విక్టో వర్సెస్ టయోటా ఇన్నోవా హైక్రాస్ వర్సెస్ కియా క్యారెన్స్: ధరల అంచనా

ఒకపక్క టయోటా MPV యొక్క రంగులను పోలి ఉంటూనే ఇన్విక్టో కేవలం నాలుగు మోనోటోన్ రంగుల్లో లభ్యమవుతుంది.

Maruti Invicto: Nexa Blue

నెక్సా బ్లూ

Maruti Invicto: Stellar Bronze

స్టెల్లార్ బ్రాంజ్

Maruti Invicto: Majestic Silverమజెస్టిక్ సిల్వర్

Maruti Invicto: Mystic White

మిస్టిక్ వైట్ 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇన్నోవా హైక్రాస్లో లభ్యమయ్యే నలుపు వర్ణాల శ్రేణులు ఇన్విక్టోలో కనపడవు. 

పవర్ ట్రైన్

Maruti Invicto Strong Hybrid Powertrain

టయోటా ఇన్నోవా హైక్రాస్లో ఉన్నట్టుగానే మారుతి ఇన్విక్టోలో కూడా అదే రెండు లీటర్ల బలమైన హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ పవర్ట్రైన్ అమర్చబడి ఉంటుంది. ఇది eCVT గేర్ బాక్స్ కు అనుసంధానమై ఉంటూ 186PS మరియు 206Nm వద్ద నడుస్తుంది. అయితే ఇది ఇన్విక్టోలో లభ్యమయ్యే ఒకే ఒక్క ఇంజన్ ఎంపిక. కాగా, టయోటా ఇన్నోవా హైక్రాస్లో 174PS పవర్ ను విడుదల చేసే రెండు లీటర్ల పెట్రోల్ ఇంజన్ అదనంగా లభ్యమవుతుంది. ఇంకో విషయం ఏమిటంటే టయోటా మాదిరిగా మారుతి యం.పి.వి. కూడా ఫ్రంట్ వీల్ డ్రైవ్ ట్రైన్ సౌకర్యం కలిగి ఉంటుంది. 

ఫీచర్లు & భద్రత

Maruti Invicto Cabin

దీని ఫీచర్లు కూడా హైక్రాస్ ఫీచర్లకు బాగా దగ్గరగా ఉంటాయి. ఇన్విక్టో 10.1 ఇంచుల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఏడు ఇంచుల డిజిటల్ డ్రైవర్స్ డిస్ప్లే, డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ముందు వైపు సీట్స్ మరియు పనరోమిక్ సన్రూఫ్ వంటి సౌకర్యాలు కలిగి ఉంటుంది. 

ఇదీ చదవండి: ప్రారంభానికి ముందే మారుతి ఇన్విక్టోను బుక్ చేసుకున్న ఆరువేల మంది వినియోగదారులు. 

భద్రత విషయానికి వస్తే ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్, EBDతో కూడిన ABS, ఆల్ వీల్ డిస్క్ బ్రేకులు, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు (ఫ్రంట్ మరియు రేర్ పార్కింగ్ సెన్సార్లు), అలాగే 360 డిగ్రీల కెమెరా ఉంటాయి. 

ధర మరియు ప్రత్యర్థులు

Maruti Invicto

ఇన్విక్టో యొక్క ఎక్స్ షోరూం ధర 24.79 లక్షల నుండి 28.42 లక్షల మధ్య ఉంది. ఇది ఇన్నోవా హైక్రాస్కు బలమైన పోటీదారు. ఇన్విక్టోను టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు కియా క్యారెన్స్ కు అత్యున్నత ప్రత్యామ్నాయంగా పరిగణించవచ్చు. 

మరింత చదవండి: ఇన్విక్టో ఆటోమేటిక్

 

 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti ఇన్విక్టో

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience