తమ వాహనాలను మళ్ళీ తిరిగి రప్పించుకున్న మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్
published on జనవరి 27, 2023 10:51 am by rohit for మారుతి గ్రాండ్ విటారా
- 74 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈసారి, ఈ కాంపాక్ట్ SUVల వెనుక సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్‌లలో లోపం ఉందని అనుమానిస్తున్నారు
మారుతి గ్రాండ్ విటారా ఇప్పటికీ మూడవసారి తన కాంపాక్ట్ SUVలను వెనక్కి తీసుకుంది, ఇందులో భాగంగా ఈ కారు తయారీదారు మరొక 11,177 యూనిట్‌లను తిరిగి రప్పించుకుంది. వెనుక భాగం సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్‌లలో సంభావ్య లోపం కారణంగా ఇలా చేయాల్సి వచ్చింది. ఇది దీర్ఘ కాలంలో వదులుగా మారి, పనితీరు ప్రభావితం కావచ్చు.
దీని ప్రత్యర్థి టయోటా కూడా ప్రభావితం అయ్యింది
గ్రాండ్ విటారాకు సమానమైన టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కూడా ఇలాంటి సంభావ్య లోపాల కారణంగా వెనక్కి తీసుకున్నారు. ఈ కారు తయారీదారు 4,026 SUV యూనిట్‌లను తిరిగి రప్పించుకుంది, ఇప్పటి వరకు ప్రభావిత భాగం వైఫల్యం చెందినట్లు ఎటువంటి నివేదికలు లేవని ప్రకటించింది.
ఏ యూనిట్‌లు ప్రభావితం అయ్యాయి?
ఈ ఇరు కారు తయారీదారుల, ఆగస్ట్ 8 మరియు నవంబర్ 15, 2022 మధ్య తయారైన అన్నీ SUV యూనిట్‌లను వెనక్కి తీసుకుంది. ఈ కాలంలో తయారైన SUVని కొనుగోలు చేసిన వారు తమ వాహనాన్ని తనిఖీ కోసం వర్క్ؚషాప్ؚకు తీసుకువెళ్లవచ్చు. అంతేకాకుండా మారుతి, టయోటా కూడా ప్రభావిత-వాహన యజమానులను సంప్రదిస్తారు. లోపాలను కనుగొంటే, ఆ భాగాన్ని ఎటువంటి ఖర్చు లేకుండా మారుస్తారు.
సంబంధించినవి: సుమారు 1,400 యూనిట్‌ల గ్లాంజా మరియు హైరైడర్ؚలను టయోటా వెనక్కి తీసుకుంది
ఇంతకముందు వెనక్కి తీసుకున్న సందర్భాలు
ఇప్పటి వరకు SUVలను వెనక్కి తీసుకున్న అన్నీ సందర్భాలు వాటి భద్రత’ ఫీచర్‌లకు సంబంధించినవే అని గమనించడం ముఖ్యం. మొదటి సారిగా డిసెంబర్ 2022లో వెనక్కి తీసుకున్నారు (ముందు వరుస సీట్ బెల్ట్ؚల షోల్డర్ ఎత్తు సర్దుబాటు అసెంబ్లీ లోని చిన్న భాగలలోని ఒక దాంట్లో లోపం కారణంగా కావచ్చు), రెండవ సారి జనవరి 2023లో వెన్నకు తీసుకున్నారు (ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్ؚలో అనుమానిత లోపం కారణంగా).
ఇది కూడా చదవండి: తాజా సమాచారం: కొన్ని ఎంపిక చేసిన హైరైడర్ SUV యూనిట్‌లను వెనక్కి తీసుకుంటున్నట్లు టయోటా ప్రకటించింది
మేము ఏం సూచిస్తున్నాం
ప్రస్తుత స్థితిలో, ఈ SUVలను నడపడం సురక్షితమా లేదా అనేది మారుతి కానీ టయోటా కానీ ప్రకటించలేదు. మీ వాహనం ఈ వెనక్కి తీసుకునే ప్రక్రియలో ఉందో లేదో తెలుసుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము. ఒకవేళ ఈ ప్రక్రియలో ఉంటే, మీ వాహనాన్ని మంచి స్థితిలో ఉంచడానికి, సాధ్యమైనంత త్వరగా దాన్ని తనిఖీ చేయించండి.
ఇక్కడ మరింత చదవండి: గ్రాండ్ విటారా ఆన్-రోడ్ ధర
- Renew Maruti Grand Vitara Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Loan Against Car - Get upto ₹25 Lakhs in cash
0 out of 0 found this helpful