• English
    • Login / Register

    మారుతి ఎర్టిగా వర్సెస్ మహీంద్రా మారాజ్జో: చిత్రాలలో

    మే 21, 2019 02:24 pm dinesh ద్వారా ప్రచురించబడింది

    • 21 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    మన దేశంలో అత్యుత్తమంగా అమ్ముడయ్యే ఎంపివి, ఎర్టిగాతో పోల్చుకుంటూ, మహీంద్రా యొక్క తాజా ప్రయత్నంతో ఇన్నోవా క్రెస్టా కు పోటీగా తీసుకొచ్చింది

    Maruti Ertiga vs Mahindra Marazzo: In Pics

    మారుతి ఎర్టిగా దేశంలో అత్యుత్తమంగా అమ్ముడైన ఎంపివి లలో ఒకటి. ఏది ఏమైనప్పటికీ, దాని సన్నిహిత పోటీదారుడు - మహీంద్రా మారాజ్జో - స్టైలింగ్ మరియు ధరల పరంగా ఎలా ఉండబోతుంది? మేము చిత్రాలలో పోలిక ను కనుగొనేందుకు సిద్ధంగా ఉన్నాము.

    ఎక్స్టీరియర్:

    ఫ్రంట్:

    వెడల్పు: 1735 మీమీ

    వెడల్పు: 1866 మీమీ

    ఎర్టిగా నిగూఢమైనదిగా మరియు దానికి ఒక వ్యాపార సంబంధమైన అనుభూతిని కలిగి ఉన్నది, మారాజ్జో మరింత స్పోర్టిగా అలాగే దూకుడుగా కనిపిస్తుంది. మారాజ్జో, ఎర్టిగా కంటే ఎంతో విశాలమైనది.

    పొడవు: 4395 మీమీ

    పొడవు: 4585 మీమీ

    వీల్బేస్: 2740 మీమీ

    వీల్బేస్: 2760 మీమీ

    ఎర్టిగా యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే తక్కువ లైన్లతో నీట్ గా కనిపిస్తుంది. మారాజ్జో మరొక వైపు, పదునైన ముందు భాగంతో  ప్రతిబింబించే లైన్లతో, ఇది మరింత దూకుడుగా అలాగే స్టైలింగ్గా ముందుకు కొనసాగుతుంది. ఎంపివి లు రెండూ ఫ్లోటింగ్ రూఫ్ లైన్ రూపకల్పనను పొందుతాయి.

    ఎత్తు: 1690 మీమీ

    ఎత్తు: 1774 మీమీ

    వెనుక భాగం విషయానికి వస్తే, ఎర్టిగా ఎల్- ఆకారపు టెయిల్ దీపాలతో మరియు విండ్షీల్డ్ దిగువ నుండి టైల్ గేట్ తో మరింత ఆధునికంగా కనిపిస్తోంది. మరోవైపు మారాజ్జో, వెనుకవైపు కన్వెన్షినల్ రూపకల్పన పద్ధతితో కొనసాగుతుంది.

    ఎర్టిగా 15 అంగుళాల చక్రాలు తో వస్తుంది, అదే మారాజ్జో విషయానికి వస్తే 16 మరియు 17 అంగుళాల చక్రాలను కలిగి ఉంటుంది. మారాజ్జోకు నాలుగు డిస్క్ బ్రేక్లు కూడా లభిస్తాయి, ఎర్టిగా వలె కాకుండా, ముందు భాగంలో మాత్రమే డిస్క్ బ్రేక్లు లభిస్తాయి. ఇక్కడ చిత్రంలో చూపించిన అల్లాయ్ చక్రాలు ఈ రెండు ఎంపివి ల యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లలో చూడవచ్చు.

    • మారుతి సుజుకి ఎర్టిగా వర్సెస్ మహీంద్రా మారాజ్జో: ఏ ఎంపివి ఎక్కువ స్థలాన్ని అందిస్తుంది?

    ఇంటీరియర్:

    డాష్బోర్డ్:

    మారాజ్జో యొక్క క్యాబిన్ ద్వంద్వ- టోన్ బ్లాక్- వైట్ ఫినిషింగ్ ను పొందుతున్నప్పుడు, ఎర్టిగా యొక్క క్యాబిన్- లేత గోధుమ రంగు మరియు గోధుమ కలయికతో ముందు స్థానంలో అందరిని ఆకర్షిస్తుంది అని చెప్పవచ్చు. అయితే, మారాజ్జో యొక్క క్యాబిన్ మరింత ప్రీమియం లుక్ ను అందించడానికి వాటి డోర్లు మరియు సీట్లపై  లెథర్ ను ఉపయోగించడం జరిగింది. ఎర్టిగా ఫాబ్రిక్ అప్హోల్స్టరీని అగ్ర శ్రేణి వేరియంట్ అయిన జెడ్డిఐ + వేరియంట్ పొందుతుంది.

    ఎంపివి లు రెండు, ఎర్టిగా వలె కాకుండా స్టీరింగ్ మౌంట్ నియంత్రణలతో వస్తాయి, కానీ మారాజ్జో క్రూజ్ నియంత్రణతో కూడా వస్తుంది. ఎర్టిగా యొక్క స్టీరింగ్ వీల్ దిగువన సమాంతరంగా ఉంటుంది మరియు వుడ్ ఇన్సర్ట్లను పొందుతుంది.

    పానీయాలు చల్లగా ఉంచడానికి ఎర్టిగా, వెంటిలేటెడ్ ఫ్రంట్ కప్ హోల్డర్లతో వస్తుంది.

    మారాజ్జో మరోవైపు, కన్వెన్షినల్ కూల్డ్ గ్లోవ్ బాక్స్ తో వస్తుంది.

    ఇక్కడ ఎర్టిగా కన్వెన్షినల్ హ్యాండ్ బ్రేక్ లివర్ తో వస్తుంది, అదే మారాజ్జో విషయానికి వస్తే విమానం-వంటి హ్యాండ్ బ్రేక్ లివర్ ను పొందుతుంది.

    ఇన్ఫోటైన్మెంట్:

    ఎంపివి లు రెండూ తమ అగ్ర శ్రేణి మోడళ్లలో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలకు మద్దతిచ్చే 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ను కలిగి ఉంటాయి.

    ఏసి:

    ఎంపివి లు రెండూ ఆటో ఏసి ను పొందుతాయి. అయినప్పటికీ, ఎర్టిగా 2 వ వరుస ముందు భాగంలో రూఫ్ మౌంట్ బ్లోయర్స్ తో వస్తుంది, అయితే మారాజ్జో రూఫ్ పొడవు అంతటా ఒక పెద్ద ప్రత్యేకమైన ఏసి యూనిట్ తో వస్తుంది. ఎర్టిగా బ్లోవర్లను పొందుతుండగా, మారాజ్జో డిఫ్యూజర్లను పొందుతుంది.

    ఎర్టిగా 7 సీటర్గా మాత్రమే లభిస్తుండగా, మార్జోజో 7 మరియు 8 సీట్ల ఎంపికలను కలిగి ఉంటుంది. 7 సీటర్ మారాజ్జో యొక్క రెండవ వరుస కెప్టెన్ సీట్లతో వస్తుంది, అయితే 8 సీటర్ వెర్షన్ రెండవ వరుసలో ఒక బెంచ్ సీటును పొందుతుంది.

    మారాజ్జో, మూడవ వరుసలో సులభమైన వెళ్లేందుకు టంబుల్ ఫార్వార్డ్ ఫీచర్ ను పొందుతుంది, ఎర్టిగా స్లయిడ్ మరియు టిల్ట్ ఫంక్షన్ తో మాత్రమే వస్తుంది.

    మూడవ వరుసలో, ఎర్టిగాలో ఇద్దరు కూర్చునేందుకు మాత్రమే సీటు అనుమతిస్తుంది, మారాజ్జో లో ముగ్గురు కూర్చునేందుకు వీలు కల్పిస్తుంది. రెండు కార్లు యొక్క మూడవ వరుస సీట్లకు, రెండు సర్దుబాటు హెడ్ రెస్ట్ లు అందించబడతాయి.

    Not Available On The Maruti Ertiga

    టొయోటా-సుజుకి, మహీంద్రా మారాజ్జో కు ప్రత్యర్ధిని అభివృద్ధి చేయనుంది

    మారుతి ఎర్టిగాలో అందుబాటులో లేదు

    మారాజ్జోలో రెండవ వరుస సీట్లకు సన్ షేడ్ వస్తుంది, ఇది మారుతి ఎర్టిగాలో అందుబాటులో లేని ఒక లక్షణం.

    డీజిల్ ఇంజన్:

    ఎర్టిగా, 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్తో శక్తిని విడుదల చేస్తుంది, ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్ పవర్ ను మరియు 200 ఎన్ఎమ్ గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. ఇది 25.47 కి.మీ ల ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఎర్టిగా 1.5 లీటర్ యూనిట్ తో కూడా అందుబాటులో ఉంది, ఈ ఇంజన్ గరిష్టంగా 95 పిఎస్ పవర్ ను మరియు 225 ఎన్ఎమ్ గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది మరియు ఇది 24.20 కి.మీ ల ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంది.

    మరోవైపు మారాజ్జో 1.5 లీటర్ యూనిట్ మాత్రమే లభిస్తుంది. ఇది గరిష్టంగా 121 పిఎస్ పవర్ ను మరియు 300 ఎన్ఎమ్ గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది మరియు మహీంద్రా మార్జోజో 17.6 కి.మీ ల ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తుంది.

    పెట్రోల్ ఇంజిన్

     

    ఎర్టిగా వాహనం డీజిల్ ఇంజన్ తో పాటు, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో కూడా వస్తుంది, ఇది గరిష్టంగా 105 పిఎస్ శక్తిని మరియు 138 ఎన్ఎమ్ గల టార్క్ను అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో గాని జత చేయబడి ఉంటుంది.

    మారాజ్జో ఇప్పుడు పెట్రోలు ఇంజన్ తో అందుబాటులో లేదు. ఏది ఏమైనప్పటికీ, బిఎస్VI నియమావళి మంచి పేరును సాధించిన తరువాత ఇది ఏప్రిల్ 2020 తర్వాత పెట్రోల్ ఇంజన్ ను పొందుతుంది. ఇది 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్ను పొందగలదని భావిస్తున్నారు.

    సేఫ్టీ:

    ఎర్టిగా ద్వంద్వ ముందు ఎయిర్ బాగ్స్, ఎబిఎస్, ఈబిడి, వెనుక పార్కింగ్ సెన్సార్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్స్, డ్రైవర్ మరియు సహ డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ మరియు హై స్పీడ్ అలెర్ట్ సిస్టమ్ వంటి ప్రామాణిక అంశాలతో వస్తుంది. ఇది హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి అంశాలను కూడా పొందుతుంది, కానీ ఇవి పెట్రోల్ ఆటోమాటిక్ వేరియంట్లకు మాత్రమే పరిమితమవుతాయి.

    మారాజ్జో ద్వంద్వ ముందు ఎయిర్ బాగ్స్, ఈబిడి తో ఏబిఎస్, ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్లు, హై స్పీడ్ అలెర్ట్ సిస్టమ్ మరియు డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ప్రామాణిక అంశాలతో వస్తుంది.

    ఇవి కూడా చదవండి: సుజుకి, టొయోట తో పాటు ఆఫ్రికాకు భారతదేశంలో తయారు చేయబడిన బాలెనో, విటారా బ్రెజ్జా, సియాజ్, ఎర్టిగా లను సరఫరా చేయనుంది.

    మరింత చదవండి: ఎర్టిగా డీజిల్


     

    was this article helpful ?

    Write your Comment on Maruti ఎర్టిగా 2015-2022

    explore similar కార్లు

    ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience