• English
    • లాగిన్ / నమోదు

    మారుతి వారు కొత్త వీడియోలో బలెనో వివరాలు తెలిపారు!

    అక్టోబర్ 21, 2015 11:54 am raunak ద్వారా సవరించబడింది

    19 Views
    • 13 వ్యాఖ్యలు
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్:

    హ్యుండై ఎలీట్ ఐ20 ని క్రిందికి నెట్టేందుకుమారుతీ వారు బలేనో ని తీసుకు వచ్చారు. ఈ మారుతిసుజూకీ బలెనో వచ్చే సోమవారం విడుదల కానుంది. ఈ బలెనో కేవలం ప్రీమియం నెక్సా డీలర్‌షిప్ లలో లభ్యం అవుతుంది. ఈ ఏడాది చివరికి మరుతీ వారు 100 నెక్సా డీలర్‌షిప్ లను తెరవబోతున్నారు. ప్రస్తుతం 80 పైగా డీలర్‌షిప్ లు ఉన్నాయి. బలెనో కోసం బుకింగ్స్ కొన్ని వారాల క్రితం మొదలయ్యాయి మరియూ అధికారికంగా అక్టోబర్ 26న విడుదల అవ్వనుంది. 

     ప్రపంచవ్యాప్తంగా ఇది 2015 ఫ్రాంక్‌ఫర్ట్ మోటర్ షోలో తయారీ ఉత్పత్తిగా   మరియూ iK2 కాన్సెప్ట్ గా 2015 జెనీవా మోటర్ షోలో  ప్రదర్శితమయ్యింది. ఈ వాహనం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యే లోపు ముందుగా భారతదేశంలో ప్రవేశించనుంది. దీని బట్టి ఈ వాహనానికి భారతదేశం ముఖ్యమైన మార్కెట్ అని అర్థం అవుతోంది.  బలెనో కి హ్యుండై ఎలీట్ ఐ20 పోటీగా నిలువనుంది. ఈ కారు కూడా బలెనో లాగే ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యే ముందుగా భారతదేశంలో ప్రవేశించింది.  ప్రస్తుతం హ్యుండై ఎలీట్ ఐ20 నెలకి 10 వేల యూనిట్ల అమ్మకాలను అందుకుంటుంది. ఈ సంఖ్యను మారుతి వారు దాటలని ఆశించవచ్చు.

    was this article helpful ?

    Write your Comment on Maruti బాలెనో 2015-2022

    ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
    ×
    మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం