• English
  • Login / Register

కేవలం హయ్యర్-ఎండ్ వేరియెంట్ؚలలో మైల్డ్-హైబ్రిడ్ సాంకేతికతను తిరిగి పొందిన Maruti Brezza

మారుతి బ్రెజ్జా కోసం rohit ద్వారా జనవరి 23, 2024 02:53 pm ప్రచురించబడింది

  • 761 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మైల్డ్-హైబ్రిడ్ సాంకేతికతతో వస్తున్న ఈ SUV పెట్రోల్-MT వేరియెంట్ؚల క్లెయిమ్ చేసిన మైలేజీ 17.38 kmpl నుండి 19.89 kmplకు పెరిగింది.

Maruti Brezza

  • ఈ SUV పవర్ؚట్రెయిన్ సెట్అప్ నుండి మైల్డ్-హైబ్రిడ్ సాంకేతికతను 2023 మధ్య కాలం నుండి నిలిపివేశారు. 

  • ఈ SUV హయ్యర్-స్పెక్ ZXi మరియు ZXi+ MT వేరియెంట్ؚలలో మారుతి తిరిగి ఈ సాంకేతికతను అందిస్తోంది. 

  • లోయర్-స్పెక్ LXi మరియు VXi MT వేరియెంట్ؚలలో, ఈ మైల్డ్-హైబ్రిడ్ సాంకేతికతను అందించడం లేదు.

  • CNG వేరియెంట్‌ల క్లెయిమ్ చేసిన మైలేజీలో మార్పు లేకుండా 25.51 km/kgగా ఉంది.

  • బ్రెజ్జా 5-స్పీడ్ MT మరియు 6-స్పీడ్ AT ఎంపికలు రెండిటినీ కలిగి ఉన్న 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది. 

  • ఈ SUV ధరలు రూ.8.29 లక్షల నుండి రూ.14.14 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉన్నాయి.

మారుతి బ్రెజ్జా మాన్యువల్-పవర్ؚట్రెయిన్ సెట్అప్ నుండి మైల్డ్-హైబ్రిడ్ సాంకేతికతను 2023 మధ్య కాలంలో నిలిపివేసిన తరువాత, ఈ కారు తయారీదారు దీన్ని తిరిగి తీసుకువచ్చింది, ఇది కేవలం మాన్యువల్-ట్రాన్స్ؚమిషన్ కలిగిన సబ్-4m SUV హయ్యర్-స్పెక్ ZXi మరియు ZXi+ వేరియెంట్ؚలకు మాత్రమే పరిమితం చేయబడింది. లోయర్-ఎండ్ మాన్యువల్ వేరియెంట్ؚలు ఇప్పటికీ ఈ సాంకేతికత లేకుండానే వస్తున్నాయి.

ఈ పునఃపరిచయం ప్రాధాన్యత ఏమిటి? 

మైల్డ్-హైబ్రిడ్ సెట్అప్ؚను నిలిపివేసిన తరువాత, ఈ SUV పెట్రోల్-MT కాంబో ఇంధన సామర్ధ్య అంకెలు దాదాపుగా 3 kmpl అంటే 17.38 kmplకు తగ్గింది. మైల్డ్-హైబ్రిడ్ సాంకేతితకను తిరిగి పరిచయం చేయడం వలన, ఈ SUV ZXi మరియు ZXi+ MT వేరియెంట్ؚలు ప్రస్తుతం క్లెయిమ్ చేసిన మైలేజీ అంకెలు 19.89 kmplగా ఉన్నాయి, ఇది 2.5 kmpl కంటే కొంత ఎక్కువ. మాన్యువల్ గేర్ؚబాక్స్ కలిగిన లోయర్-స్పెక్ LXi మరియు VXi వేరియెంట్ؚలు ఇప్పటికీ మైల్డ్-హైబ్రిడ్ సాంకేతికత లేకుండా, 17.38 kmpl మైలేజ్‌ను అందిస్తున్నాయి.

ఇప్పటికీ కేవలం పెట్రోల్ ఆఫరింగ్ మాత్రమే

Maruti Brezza 6-speed automatic gearbox

మైల్డ్-హైబ్రిడ్ సెట్అప్ ఈ SUV 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ؚతో (103 PS/ 137 Nm), 5-స్పీడ్ మాన్యువల్ؚతో లేదా 6-స్పీడ్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో వస్తుంది. మారుతి ఇదే ఇంజన్ؚను 5-స్పీడ్ MT వేరియెంట్ؚతో ఐచ్ఛిక CNG కిట్ؚతో కూడా అందిస్తుంది (88 PS/121.5 Nm శక్తిని విడుదల చేస్తుంది). ఈ CNG వర్షన్ ఇంధన సామర్ధ్యం ఇప్పటికీ 25.51 km/kgగా ఉంది.

ఇది కూడా చదవండి: 2024 చివరి నాటికి విడుదల కానున్న మారుతి eVX ఎలక్ట్రిక్ SUV 

ధర పరిధి మరియు పోటీదారులు

Maruti Brezza rear

మారుతి బ్రెజ్జా ధర రూ.8.29 లక్షల నుండి రూ.14.14 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉంటుంది. ఈ SUV కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా XUV300, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్, మారుతి ఫ్రాంక్స్ సబ్-4m క్రాస్ؚఓవర్ SUVలతో పోటీ పడుతుంది. 

ఇక్కడ మరింత చదవండి: మారుతి బ్రెజ్జా ఆన్ؚరోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti బ్రెజ్జా

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience