7 చిత్రాలలో వివరించబడిన మారుతి బ్రెజ్జా బ్లాక్ ఎడిషన్
మారుతి బ్రెజ్జా కోసం shreyash ద్వారా మార్చి 27, 2023 12:21 pm ప్రచురించబడింది
- 24 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ సబ్ కాంపాక్ట్ SUV కొత్త బ్లాక్ ఎడిషన్ యూనిట్‌లు ఇప్పటికే డీలర్ؚషిప్ؚల వద్దకు చేరుకున్నాయి.
మారుతి తన అరెనా లైన్అప్‌కు బ్లాక్ ఎడిషన్‌ను పరిచయం చేసింది (ఆల్టో 800 మరియు ఈకోను మినహాయించి), ఇవి “పర్ల్ మిడ్‌నైట్ బ్లాక్” ఎక్స్‌టీరియర్ షేడ్ؚలో అందిస్తున్నారు. బ్రెజ్జాలో, ఈ రంగు ఎంపిక ZXi మరియు ZXi+ వేరియెంట్ؚలలో మాత్రమే ఎటువంటి ధర పెరుగుదల లేకుండా అందుబాటులో ఉంటాయని మారుతి వెల్లడించింది.
బ్రెజ్జా బ్లాక్ ఎడిషన్ యూనిట్‌లు ఇప్పటికే డీలర్‌షిప్‌లను చేరుకున్నాయని సమాచారం, ఈ కొత్త కలర్ ఆప్షన్ ఫస్ట్ లుక్ ఇక్కడ అందించబడింది:
ఇది ఫ్లోటింగ్ LED డే టైమ్ రన్నింగ్ లైట్‌లతో డ్యూయల్-LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు కలిగిన బ్రెజ్జా ZXi వేరియెంట్. దీనికి నలుపు రంగు గ్రిల్ మరియు బంపర్‌పై సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఉన్నాయి. టాప్ మోడల్ నుంచి రెండవ వేరియెంట్ అయిన, దీనిలో ఫాగ్ లైట్‌లు మాత్రం లేవు.
బ్రెజ్జా టాప్-వేరియెంట్ؚలలో ఇప్పటికే పూర్తి నలుపు రంగు గల 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ؚను కలిగి ఉంది. ఇవి కొత్త బ్లాక్ ఎడిషన్ రూపానికి, బ్లాక్ క్లాడింగ్ మరియు సైడ్ బాడీ మౌల్డింగ్ؚతో కలిసి మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది.
ఇది కూడా చదవండి: రూ.9.14 లక్షలకు విడుదలైన మారుతి బ్రెజ్జా CNG
బ్రెజ్జా నలుపు రంగు ఎడిషన్ؚలో వెనుక వైపు ఇప్పటికీ సిల్వర్ స్కిడ్ ప్లేట్‌తో వస్తుంది. టెయిల్ ల్యాంప్ؚల చుట్టూ నల్లని అవుట్‌లైన్, దీని అందాన్ని మరింతగా పెంచుతుంది.
ఈ బ్లాక్ ఎడిషన్ మారుతి సబ్-కాంపాక్ట్ SUV ఇంటీరియర్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. సాధారణ వేరియెంట్‌లో ఉన్నట్లుగా ఇది డ్యూయల్-టోన్ ఇంటీరియర్ؚతో వస్తుంది. ఇక్కడ ఉన్న ZXi వేరియెంట్ చిన్న ఏడు-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్ؚను పొందింది. పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్, ఆటోమ్యాటిక్ ఎయిర్ కండిషనింగ్, క్రూజ్ కంట్రోల్ మరియు డిజిటల్ TFT MID కూడా ఉన్నాయి.
అపోలిస్ట్రీలో కూడా ఎటువంటి మార్పులు లేదు మరియు బ్లాక్ ఎడిషన్ బ్రెజ్జా, ఈ విషయంలో సాధారణ వేరియెంట్ؚలానే కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి: మారుతి బ్రెజ్జా Vs గ్రాండ్ విటారా: మరింత ఇంధన సామర్ధ్యం కలిగిన CNG SUV ఏది?
మెకానికల్ పరంగా కొత్త బ్లాక్ ఎడిషన్ బ్రెజ్జాలో ఎటువంటి మార్పులు లేవు. ఇది 1.5-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌తో (103PS/137Nm), 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్‌తో జత చేయబడింది. సబ్‌కాంపాక్ట్ SUVల CNG వేరియెంట్ؚలలో, తక్కువ అవుట్ؚపుట్ 88PS/121.5Nmగల స్వరూప ఇంజన్‌ను కలిగి ఉంటాయి మరియు ఇది 5-స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ؚతో జత చేయబడుతాయి.
ధర & పోటీదారులు
బ్రెజ్జా బ్లాక్ ఎడిషన్ ధరలో ఎటువంటి మార్పులు లేవు, సాధారణ రంగు వాహనాల సమానమైన ధరలోనే ఇది అందించబడుతుంది. బ్లాక్ ఎడిషన్‌పై ఆధారపడిన ZXi మరియు ZXi+ వేరియెంట్ؚల ధరలు క్రింద అందించబడ్డాయి:
వేరియెంట్ |
ధర |
ZXi |
రూ. 10.95 లక్షలు |
ZXi CNG MT |
రూ. 11.90 లక్షలు |
ZXi+ |
రూ. 12.38 లక్షలు |
ZXi AT |
రూ. 12.45 లక్షలు |
ZXi+ AT |
రూ. 13.88 లక్షలు |
అన్ని ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు
మారుతి బ్రెజ్జా టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ మరియు మహీంద్రా XUV300 వంటి వాటితో పోటీ పడుతుంది. బ్రెజ్జా నలుపు ఎడిషన్, టాటా నెక్సాన్ డార్క్ ఎడిషన్‌కు ప్రత్యక్ష ప్రత్యర్ధి. మరొక వైపు, సోనెట్ పరిమిత రన్ X-లైన్ వేరియెంట్ؚలో మ్యాట్ గ్రే ఫినిష్ؚను పొందుతుంది.
ఇక్కడ మరింత చదవండి: బ్రెజ్జా ఆన్ؚరోడ్ ధర
0 out of 0 found this helpful