మారుతి బాలెనో యాక్సెసరీస్ బ హిర్గతం
నవంబర్ 03, 2015 06:29 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
మారుతి బాలెనో, ప్రీమియం హ్యాచ్బ్యాక్ శ్రేణి కొన్ని రోజుల క్రితం రూ.4.99 లక్షల నుండి 8.11 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద ప్రారంభించబడినది. పోటీ ధరతో కారు ఎంచుకోవడానికి కొత్త యాక్సెసరీస్ తో ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ యాక్సెసరీస్ లను నెక్సా వెబ్సైట్ ద్వారా సమీకరించి కారు యొక్క మొత్తం రూపాన్ని చూడవచ్చు.
బాహ్య భాగాలలో చూడడానికి ముచ్చటగా అనిపించే అనేక ఎంపికలు పుష్కలంగా ఉన్నాయి. ఆ యాక్సెసరీస్ లలో బ్లాక్డ్ ఔట్ అల్లాయ్ వీల్స్, ఓఆర్‌విఎం పైన క్రోం చేరికలు, ముందు స్పాయిలర్, సైడ్ స్పాయిలర్ మరియు వెనుక తక్కువ బంపర్ స్పాయిలర్ ఉన్నాయి. విండ్ స్క్రీన్ విజర్స్ తో మడ్ ఫ్లాప్స్ ఒక ఉపకరణంగా అందుబాటులో ఉంది మరియు రూఫ్ మౌంటెడ్ లోడింగ్ క్యారేజి కూడా అందించబడుతుంది.
లోపలివైపు, విస్తృత శ్రేణికి చెందిన ఫాబ్రిక్ సీట్ కవర్లు ఎంచుకోవడానికి ఉన్నాయి. ఇతర అంతర్గత ఉపకరణాలైన ఫ్లోర్ మ్యాట్స్, గ్లోవ్ బాక్స్ ఇల్లుమినేషన్, ఛార్జర్, హెర్ట్జ్ స్పీకర్లు మరియు ఆమ్ప్లిఫయర్లతో నావిగేషన్ సిస్టమ్ మరియు హెడ్సప్ డిస్ప్లే వంటి వాటిని కలిగి ఉంది.
ఇంకా చదవండి: బాలెనో ని ప్రవేశపెట్టడం వలన స్విఫ్ట్ మరియు డిజైర్ విలువను మారుతి వారు తగ్గించుకున్నారా?
భద్రత పరంగా, రెండు పరిమాణాలలో చైల్డ్ సీట్ అందుబాటులో ఉంది. అలానే ఒక గేర్ లాక్ భద్రత లక్షణం కూడా అందుబాటులో ఉంది.
ప్రీమియం హాచ్ బాలెనో ఇప్పటివరకు కొనుగోలుదారులు నుండి మంచి స్పందనను పొందింది మరియు తయారీదారులు అత్యుత్తమ బుకింగ్స్ ని నమోదు చేసుకున్నారు. ఈ వాహనం యొక్క తాజా లుక్స్ మరియు కొత్త ప్లాట్‌ఫార్మ్ ఈ అద్భుతమైన లుక్స్ కి ఒక మార్గం చూపించింది.దీని ద్వారా ఈ నెక్సా లైన్ కి ఎక్కువ మంది వినియోగదారులు ఆశక్తి చూపిస్తున్నారు.
ఇక్కడ మారుతి సుజుకి బాలెనో మొదటి డ్రైవ్ చూడండి:
ఇది కూడా చూడండి: