మారుతి ఆల్టో, రెనాల్ట్ క్విడ్, ఏప్రిల్ 2019 లో అత్యంత ప్రాచుర్యం చెందిన బడ్జెట్ హాచ్బ్యాక్లు
మారుతి ఆల్టో 800 కోసం dhruv ద్వారా మే 15, 2019 12:09 pm ప్రచురించబడింది
- 49 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మార్చి నెలలో అమ్మకాలు గణనీయంగా పడిపోయిన తరువాత, మారుతి ఆల్టో తన యొక్క సత్తాను ఏప్రిల్ లో 20,000 అమ్మకాలతో తిరిగి చాటుకుంది.
- ఇటీవల దీనికి వచ్చిన నవీకరణలకు ధన్యవాదాలు తెలుపుకోవాలి, ఆల్టో యొక్క అమ్మకాలు ఏప్రిల్ నెల 2019 లో ఆరు నెలల కాలానికి సగటు అమ్మకాలను మించిపోయాయి.
- రెనాల్ట్ క్విడ్ కూడా నెలకి 5000 కంటే ఎక్కువ యూనిట్ల అమ్మకాలు జరిగేలా నిరంతరంగా కొనసాగుతుంది.
- రెనాల్ట్ GO 2019 ఏప్రిల్ నెలలో దాని సంఖ్యలో గణనీయమైన తగ్గుదలను చూసింది.
- మార్చి 2019 తో పోలిస్తే ఈ విభాగం గణనీయంగా పెరిగింది.
భారతదేశంలో ఈ ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్ లో మనకి చాలా కార్లు అయితే లేవు, కాని ఈ మొత్తం అమ్మకాలు చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో 25,000 యూనిట్లకి పైగా అమ్మకాలు జరిగాయి. ఒక విభాగంలో పలువురు కొనుగోలుదారులు ఉన్నప్పుడు, వారిలో చాలామంది మొదటిసారి కారు కొనుగోలుదారులు అయినప్పుడు, ఏ తయారీదారి అయినా దానిని తీవ్రంగా తీసుకోకుండా ఉండలేరు. దిగువ పట్టికలోని సంఖ్యలను పరిశీలించండి మరియు క్రింద ఉన్న మా విశ్లేషణ బట్టి, మొట్టమొదటి కారు కొనుగోలుదారులు దేని వైపు మొగ్గు చూపుతున్నారో చూద్దాము.
ఏప్రిల్ 2019 |
మార్చి 2019 |
MoM గ్రోత్ |
మార్కెట్ ప్రస్తుత వాటా (%) |
మార్కెట్ వాటా (% గత సంవత్సరం) |
YoY mkt వాటా (%) |
సగటు అమ్మకాలు (6 నెలలు) |
|
మారుతి సుజుకి ఆల్టో |
22766 |
16826 |
35.3 |
78.28 |
63.08 |
15.2 |
21911 |
రెనాల్ట్ క్విడ్ |
5336 |
5853 |
-8.83 |
18.34 |
17.2 |
1.14 |
5367 |
డాట్సన్ రెడ్-గో |
979 |
1374 |
-28.74 |
3.36 |
5.85 |
-2.49 |
1159 |
మొత్తం |
29081 |
24053 |
20.9 |
28437 |
టేక్అవే
ఆల్టో నెమ్మదిగా మార్చి తరువాత తిరిగి తన సత్తా చాటుకుంది:
గత ఆరునెలల్లో దాదాపుగా 22,000 యూనిట్ల ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్ నెలవారీ అమ్మకాలు జరిగాయి. మార్చ్ నెలలో (16,826 యూనిట్లు) కొద్దిగా తగ్గిన తర్వాత, మళ్ళీ ఏప్రిల్ లో తన సత్తా చాటుకుంది. ఏప్రిల్ నెలలో మారుతి 23 వేల యూనిట్లు విక్రయించింది. ఈ యొక్క అమ్మకాలలో అభివృద్ధి అనేది ఈ ఏప్రిల్ లో ఆల్టో యొక్క ఫేస్లిఫ్ట్ ని ప్రవేశపెట్టిన తరువాత వచ్చిందని చెప్పవచ్చు.
నెల నెలకి క్విడ్ మంచి పనితీరుని అందిస్తుంది:
క్విడ్ ని ఆల్టో తో పోల్చి చూడడం వలన దీని యొక్క విజాయాలు అనేవి కప్పి వేయబడ్డాయి అని చెప్పవచ్చు. అయితే, రెనాల్ట్ యొక్క ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్ ఒక SUV వైఖరితో దాని మంచి ప్రదర్శనని ప్రతీ నెలా పునరావృతం చేసింది. మార్చి, ఏప్రిల్ నెలలో అమ్మకాలు పరిశీలించండి మరియు చివరి ఆరు నెలల్లో సగటు అమ్మకాలు గనుక చూసుకున్నట్లయితే, మేము దేని గురించి మాట్లాడుతున్నాము అనేది మీకు తెలుస్తుంది. క్విడ్ కొరకు ఒక ఫేస్లిఫ్ట్ 2019 రెండవ భాగంలో రావచ్చని అంచనా వేయబడుతుంది.
డాట్సన్ రెడ్-GO యొక్క నంబర్లు దెబ్బతిన్నాయి: రెడి-Go ఎప్పుడూ కూడా 1,000 యూనిట్ల మార్కు నుండి పైకి వెళ్దామని ఒక టార్గెట్ పెట్టుకుంది, కానీ ఏప్రిల్ 2019 కి సేల్స్ పరంగా క్రిందకి కూడా వెళిపోయింది. డాట్సన్ దాని మార్కెట్ వాటాను గత నెలలో పోలిస్తే 28 శాతం కంటే తక్కువగా చూసింది.
ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్లు బాగా కొనసాగుతున్నాయి: సాపేక్షంగా చవకైన కార్లలో అందుబాటులో ఉన్న ప్రీమియమ్ ఫీచర్లతో, ఈ ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్ యొక్క భవిష్యత్తు అనేది ఎటువంటి డోకా లేకుండా ఉంటుందని చెప్పవచ్చు. అయితే, ఈ కార్ల డిమాండ్ స్థిరంగా ఉండి కొనసాగుతుండటంతో ఈ సెగ్మెంట్ నెలసరి వృద్ధి రేటు 20 శాతం పెరుగుతూ ఉంది.