Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మహీంద్రా XUV.e8 క్యాబిన్ؚను పంచుకొనున్న Mahindra XUV.e9

నవంబర్ 24, 2023 12:17 pm ansh ద్వారా ప్రచురించబడింది
90 Views

ఎలక్ట్రిక్ XUV700 కూపే-స్టైల్ వర్షన్ రహస్య చిత్రాలు ఇటీవల కనిపించాయి, క్యాబిన్ లోపల ఏముందో కూడా కనిపించింది

  • క్యాబిన్ؚలో ఇంటిగ్రేటెడ్ ట్రిపుల్-స్క్రీన్ సెట్అప్ ఉంది, కొత్త రెండు స్పోక్ؚల స్టీరింగ్ వీల్ కూడా ఉంది.

  • తాత్కాలిక లైటింగ్ సెట్అప్ؚతో భారీ ముసుగులో ఉన్న ఎక్స్‌టీరియర్ కేవలం కూపే బాడీ ఆకారాన్ని మాత్రమే చూపుతోంది.

  • ఈ SUV 450 km వరకు పరిధిని అందించవచ్చు, రేర్-వీల్ డ్రైవ్ మరియు పూర్తి-వీల్ డ్రైవ్ ఎంపికలు రెండూ ఉన్నాయి.

  • ఏప్రిల్ 2025 నాటికి రూ.38 లక్షల అంచనా ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) విడుదల కావచ్చు.

మహీంద్రా XUV.e9, భారతదేశ కారు తయారీదారు విడుదల చేయబోయే కొత్త-జెన్ ఎలక్ట్రిక్ SUVల తదుపరి బ్యాచ్ؚలో ఒకటి. ఈ కూపే-స్టైల్ EV దాదాపుగా ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న డిజైన్ టెస్ట్ చేస్తూ చాలాసార్లు కనిపించింది. XUV.e9 తాజా స్పై చిత్రాలలో, దీని టెస్ట్ వాహనం ఇంటీరియర్ؚలు మొదటిసారిగా కనిపించాయి. దీని క్యాబిన్, మహీంద్రా XUV.e8లో (మహీంద్రా XUV700కు ఎలక్ట్రిక్ వర్షన్) ఉన్న క్యాబిన్ؚకు సారూప్యంగా ఉంది, ఇది కూడా ఇటీవల కనిపించింది. దీనిలో కనిపించిన అంశాల గురించి ఇప్పుడు చూద్దాం.

ప్రతి ఒక్కరి కోసం స్క్రీన్ؚలు

రహస్య చిత్రంలో ముందుగా గమనించేది భారీ స్క్రీన్ సెట్అప్ ని, ఇది దాదాపుగా డ్యాష్ బోర్డు ఒక చివర నుంచి మరొక చివర వరకు ఉంటుంది. ఈ స్క్రీన్ సెట్అప్లో మూడు ఇంటిగ్రేటెడ్ డిస్ప్లేలు ఉంటాయి: ఒక డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ప్యాసెంజర్ డిస్ప్లే. కొత్త రెండు-స్పోక్‌ల స్టీరింగ్ వీల్ మొదటి కాన్సెప్ట్ؚలో లేని మరొక కొత్త డిజైన్ బిట్.

ఇది కూడా చూడండి: ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణ తరువాత రహస్యంగా బహిర్గతమైన మహీంద్రా స్కార్పియో N-ఆధారిత పికప్

మిగిలిన డ్యాష్ؚబోర్డు సాధారణనగా కనిపించింది, సెంటర్ కన్సోల్ؚలో నాజూకైన AC వెంట్ؚలు, XUV.e9 ప్రోటోటైప్ؚలో కనిపించిన అదే గేర్‌షిఫ్ట్ లివర్ మరియు డ్రైవ్ మోడ్ؚలను మార్చడానికి ఉపయోగించే డయల్ ఉన్నాయి. అలాగే, సీట్లు పూర్తిగా కనిపించనప్పటికీ, అప్ؚహోల్ؚస్ట్రీ, ఫ్యాబ్రిక్ మరియు లెదర్ؚల కలయికగా కనిపించాయి.

ఫీచర్లు భద్రత

మహీంద్రా XUV.e8 ఇంటీరియర్ చిత్రం రిఫరెన్స్ కోసం ఉపయోగించబడింది

ఒక ప్రీమియం ఆఫరింగ్ؚగా, మహీంద్రా XUV.e9 కూడా మల్టీ-జోన్ ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్, (అడాప్టివ్) క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్ؚలు, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, మరియు ప్రీమియం సౌండ్ సిస్టమ్ؚలను కలిగి ఉంటుందని అంచనా. ఎలక్ట్రిక్ మోడల్ కాబట్టి, దీనిలో మల్టీ-లెవెల్ రెగెన్ మరియు వెహికిల్-టు-లోడ్ (V2L) సాంకేతికతలు కూడా ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: భారతదేశంలో విడుదలకు ఒక అడుగు దూరంలో ఉన్న మహీంద్రా గ్లోబల్ పికప్, ఫైల్ అయిన డిజైన్ పేటెంట్

భద్రత ఫీచర్ల విషయంలో, మహీంద్రా దీనిలో 6 వరకు ఎయిర్ బ్యాగ్ؚలను, EBDలతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు లేన్ కీప్ అసిస్ట్ మరియు ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ADAS ఫీచర్లను అందిస్తుంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ؚలలో XUV700 పనితీరు ఆధారంగా, భారత్ NCAP క్రాష్ టెస్ట్ؚలలో మహీంద్రా XUV.e9 మంచి స్కోర్ؚను సాధిస్తుందని అంచనా వేయవచ్చు.

పవర్ؚట్రెయిన్ వివరాలు

మహీంద్రా XUV.e9 కారు తయారీదారు INGLO ప్లాట్ఫార్మ్ పై ఆధారపడుతుంది, ఇది 60 kWH మరియు 80 kWh బ్యాటరీ ప్యాక్ؚలను కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ؚలతో, ఈ ప్లాట్ఫార్మ్ రేర్-వీల్ డ్రైవ్ మరియు ఆల్-వీల్-డ్రైవ్ సెట్అప్ؚలను అందిస్తుంది, మరియు 500 కిమీ వరకు క్లెయిమ్ చేసిన పరిధిని కలిగి ఉంటుంది.

మహీంద్రా చెప్పినట్లు, ఇది, 0-80 శాతం ఛార్జింగ్ؚకి కేవలం 30 నిమిషాల సమయంతో, 175 kW వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యాలకు కూడా మద్దతు ఇస్తుంది.

విడుదల ధర

మహీంద్రా XUV.e9, XUV.e8 (ఎలక్ట్రిక్ XUV700) విడుదల తరువాత ఉంటుందని అంచనా. XUV.e8 2024 చివరిలో విడుదల అవుతుంది. దీని ప్రారంభ అంచనా ధరరూ. 38 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు, రాబోయే టాటా హ్యారియర్ EV మరియు సఫారి EVలకు పోటీ అవుతుంది.

చిత్రం మూలం

Share via

Write your Comment on Mahindra ఎక్స్ఈవి 9ఈ

explore similar కార్లు

ఓలా ఎలక్ట్రిక్ కారు

4.311 సమీక్షలుకారు ని రేట్ చేయండి
Rs.40 లక్ష* Estimated Price
డిసెంబర్ 16, 2036 Expected Launch
ట్రాన్స్ మిషన్ఆటోమేటిక్
ప్రారంబమైనప్పుడు వివరాలను తెలియజేయండి
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
Rs.18.90 - 26.90 లక్షలు*
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.17.49 - 22.24 లక్షలు*
Rs.7 - 9.84 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర