కేవలం పెట్రోల్-ఆటో కాంబినేషన్‌లో మాత్రమే ఆస్ట్రేలియాలో విడుదలైన మహీంద్రా XUV700
ఆస్ట్రేలియన్-స్పెక్ XUV700ని కేవలం AX7 మరియు AX7L వేరియంట్‌లలో మాత్రమే అందిస్తున్నారు
-
కేవలం 7-సీట్‌ల వెర్షన్‌లో 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో(200PS/380Nm) మాత్రమే అందుబాటులో ఉంది.
-
ఆస్ట్రేలియా ధరల ప్రకారం దాదాపు రూ. 20.72 లక్షలు నుండి రూ.22.41 లక్షలుగా ఉంది.
-
డ్యూయల్ 10.25-అంగుళాల డిస్‌ప్లేలు, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు ADAS వంటి ఫీచర్‌లు ఉన్నాయి.
-
7 సంవత్సరాల/1.5 లక్షల కిమీ వ్యారంటితో అందించబడుతుంది.
విడుదల అయిన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత, మహీంద్రా XUV700 ప్రస్తుతం ఆస్ట్రేలియ చేరుకుంది. భారతీయ కారు తయారీదారు ఈ SUVని కేవలం రెండు వేరియంట్‌లలో మాత్రమే అందిస్తోంది-AX7 మరియు AX7L – ఇవి భారతీయ కరెన్సీలో దాదాపుగా రూ.20.72 లక్షలు మరియు రూ. 22.41 లక్షలుగా ఉంది, భారతదేశంలో ఈ వాహనాల ధరలతో పోలిస్తే ఇది తక్కువ. అంతేకాకుండా, 7-సంవత్సరాల/1.5 లక్షల కిమీ (ఏది ముందు అయితే) వ్యారంటి ప్యాకేజీని కూడా అందిస్తున్నారు.
పవర్‌ట్రెయిన్ ఎంపికలలో ఏదైనా మార్పులు ఉన్నాయా?
భారతదేశంలో అందిస్తున్నట్లు గానే ఆస్ట్రేలియన్-స్పెక్ XUV700ని కేవలం 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందిస్తున్నారు, ఇది 200PS పవర్ మరియు 380Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. అంతేకాకుండా, ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
భారతదేశంలో మాత్రం, అదే ఇంజన్ను 6-స్పీడ్ మాన్యువల్ ఎంపికతో కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా, XUV700 ఇక్కడ అదే గేర్‌బాక్స్ ఎంపికలతో 2.2-లీటర్ డీజిల్ యూనిట్ (185PS/450Nm వరకు) ఎంపికను కూడా పొందుతుంది. ఈ ఇంజన్ ఆల్-వీల్-డ్రైవ్ (AWD) సిస్టమ్ ఎంపికను కేవలం టాప్-స్పెక్ అయిన AX7 మరియు AX7L ఆటోమేటిక్ వేరియంట్‌లతో మాత్రమే కలిగి ఉంటుంది.
ఇవి కూడా చూడండి: రెండు కొత్త వివరాలను వెల్లడిస్తూ మళ్ళీ కెమెరాకు చిక్కిన నవీకరించిన మహీంద్రా XUV300
అందిస్తున్న ఫీచర్లు
కేవలం టాప్ వేరియంట్‌లను మాత్రమే అందిస్తున్నందున, ఈ ఆస్ట్రేలియన్-స్పెక్ XUV700లో డ్యూయల్ 10.25-అంగుళాల డిస్‌ప్లేలు (ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ మరియు మరొకటి ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం), డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు సోనీ 12-స్పీకర్ 3D సౌండ్ సిస్టమ్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది.
దీని భద్రతా అంశాలలో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360-డిగ్రీ కెమెరా, రివర్సింగ్ కెమెరా మరియు అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లు (ADAS) ఉన్నాయి. ADAS సూట్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ మరియు హై-బీమ్ అసిస్ట్‌లను కలిగి ఉంది.
ఇది AX7 వేరియంట్‌లో మాత్రమే అందిస్తునందున, ఆస్ట్రేలియన్-స్పెక్ XUV700 7-సీట్‌ల లేఅవుట్‌లో మాత్రమే విక్రయించబడుతుంది. దీన్ని ఐదు రంగు ఎంపికలలో అందించబడుతుంది: డ్యాజ్ؚలింగ్ సిల్వర్, ఎలక్ట్రిక్ బ్లూ, ఎవరెస్ట్ వైట్, మిడ్ నైట్ బ్లాక్ మరియు రెడ్ రేజ్.
ఇవి కూడా చదవండి: AI ప్రకారం రూ.20 లక్షల లోపు భారతదేశంలో అందుబాటులో ఉన్న టాప్ 3 ఫ్యామిలీ SUVలు
స్వదేశంలో పోటీదారులు
XUV700 భారతదేశంలో టాటా సఫారీ, MG హెక్టర్ ప్లస్ మరియు హ్యుందాయ్ అల్కాజర్‌లతో పోటీపడుతుంది. ఇక్కడ, మహీంద్రా దీన్ని రెండు విస్తృత వేరియంట్‌లలో విక్రయిస్తుంది: MX మరియు AX. ఇందులో AX ట్రిమ్ మరొక మూడు విస్తృత వేరియంట్‌లుగా విభజించబడింది: AX3, AX5 మరియు AX7. ఇండియా-స్పెక్ XUV700 5-సీటర్ అమరికలో కూడా పొందవచ్చు. దీని ధరలు రూ.14.01 లక్షల నుండి రూ.26.18 లక్షల (ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ) వరకు ఉన్నాయి.
మరింత చదవండి : మహీంద్రా XUV700 ఆన్ రోడ్ ధర