• English
  • Login / Register

ఈ దీపావళికి XUV400ని రూ. 3.5 లక్షల వరకు డిస్కౌంట్ؚలతో అందిస్తున్న Mahindra

మహీంద్రా ఎక్స్యువి400 ఈవి కోసం rohit ద్వారా నవంబర్ 06, 2023 11:23 am ప్రచురించబడింది

  • 1.3K Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

గరిష్ట ప్రయోజనాలు ఈ ఎలక్ట్రిక్ SUV టాప్ వేరియెంట్ పాత యూనిట్ల పై మాత్రమే అందిస్తున్నారు

Mahindra XUV400

  • ఆగస్ట్ 2023లో మహీంద్రా XUV400 వాహనాన్ని కొన్ని భద్రత ఫీచర్లతో నవీకరించింది. 

  • ఈ ఎలక్ట్రిక్ SUV ఆగస్ట్ ముందు నాటి పాత స్టాక్ పై మొత్తం రూ. 3.5 లక్షల వరకు డిస్కౌంట్ؚలు అందిస్తున్నారు.

  • నవీకరించిన XUV400 పై కూడా రూ. 3 లక్షల వరకు ఆదా చేయవచ్చు. 

  • ఈ ఆఫర్ؚలు కొనుగోలు చేసే నగరం పై ఆధారపడి మారవచ్చు. 

  • ఈ ఆఫర్ؚలు అన్నీ నవంబర్ 2023 వరకు చెల్లుబాటు అవుతాయి.

కార్లతో సహా కొత్త ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ప్రజలు ఇష్టపడే సమయాలలో దీపావళి సమయం ఒకటి. ఎందుకంటే అన్నిటిపై భారీ డిస్కౌంట్ؚలు మరియు ప్రయోజనాలను పొందవచ్చు. మీరు చవకైన ఎలక్ట్రిక్ SUV, ప్రత్యేకించి మహీంద్రా XUV400ను కొనుగోలు చేయాలని అనుకుంటే ఇది మంచి సమయం. నవంబర్ 2023లో ఈ ఎలక్ట్రిక్ ఆఫరింగ్ పై కనీసం ఒక లక్ష ఆదా చేయవచ్చు.

నగరం మరియు వేరియెంట్-వారీ ఆఫర్ؚలు

వేరియెంట్ 

ఢిల్లీ ఆఫర్లు 

ముంబై ఆఫర్లు

నాన్-ESP EC (3.2kW)

N.A.

రూ. 1.5 లక్షలు

నాన్-ESP EL

రూ. 3 లక్షలు

రూ. 3.5 లక్షలు

నాన్-ESP EL డ్యూయల్ టోన్

రూ. 3 లక్షలు

రూ. 3.5 లక్షలు

ESP EC (3.2kW)

రూ. 1 లక్షలు

రూ. 1.5 లక్షలు

ESP EL

రూ. 2.5 లక్షలు

రూ. 3 లక్షలు

ESP EL డ్యూయల్ టోన్

రూ. 2.5 లక్షలు

రూ. 3 లక్షలు

గమనిక: ఈ ఆఫర్లు పైన పేర్కొన్న రెండు నగరాలకు మాత్రమే పరిమితం అవుతాయి మరియు మీరు నివసించే రాష్ట్రం మరియు మీరు ఎంచుకున్న వేరియెంట్ ఆధారంగా మారవచ్చు. మరిన్ని వివరాల కోసం సమీపంలోని మహీంద్రా డీలర్ؚషిప్ؚను సంప్రదించవలసి ఉంటుంది. 

XUV400 కొన్ని భద్రతా ఫీచర్లతో, ఆగస్ట్ 2023లో నవీకరించబడింది, ధరలు కూడా రూ. 20,000 వరకు పెరిగాయి. అందువలన నవీకరణ చేయక ముందు మోడల్ ఇన్వెంటరీ రూ. 3.5 లక్షల వరకు గరిష్ట డిస్కౌంట్ؚలతో లభిస్తుంది. 

ఎలక్ట్రిక్ పవర్ؚట్రెయిన్ మరియు ఛార్జింగ్ వివరాలు

Mahindra XUV400

XUV400 EVని మహీంద్రా రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందిస్తుంది: 34.5kWh మరియు 39.4kWh. ఈ బ్యాటరీలు ఏకైక ఎలక్ట్రిక్ మోటార్ؚతో జత చేయబడి ఉంటాయి మరియు 150PS మరియు 310Nm శక్తిని ఉత్పత్తి చేస్తాయి. MIDS తెలియజేసిన ప్రకారం 34.5kWh బ్యాటరీ 375కిమీ అంచనా పరిధిని అందిస్తుంది, అలాగే  39.4kWh బ్యాటరీ 456కిమీ పరిధిని క్లెయిమ్ చేస్తుంది. 

AC మరియు DC ఫాస్ట్ ఛార్జర్ؚలు రెండిటినీ ఉపయోగించి ఈ SUV బ్యాటరీని ఈ క్రింద ఇచ్చిన సమయంలో ఛార్జ్ చేయవచ్చు.

  • 50kW DC ఫాస్ట్ ఛార్జర్: 50 నిమిషాలు (0-80 శాతం)

  • 7.2kW AC ఛార్జర్: 6.5 గంటలు

  • 3.3kW డొమెస్టిక్ ఛార్జర్: 13 గంటలు 

ఇది కూడా చదవండి: రూ. 10 లక్షల కంటే తక్కువ ధరతో 6 ఎయిర్ؚబ్యాగ్ؚలు ప్రామాణికంగా ఉన్న 8 కార్లు

ధరలు మరియు పోటీదారులు

Mahindra XUV400 rear

మహీంద్రా XUV400 ధర రూ. 15.99 లక్షలు మరియు 19.39 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉంటుంది. దీని ఏకైక పోటీదారు టాటా నెక్సాన్ EV, అయితే ఇది MG ZS EV మరియు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ؚలకు కూడా చవకైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. 

ఇక్కడ మరింత చదవండి: మహీంద్రా XUV400 EV ఆటోమ్యాటిక్

was this article helpful ?

Write your Comment on Mahindra ఎక్స్యువి400 ఈవి

explore మరిన్ని on మహీంద్రా ఎక్స్యువి400 ఈవి

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
×
We need your సిటీ to customize your experience