Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

Mahindra XEV 9e భారత్ NCAP నుండి పూర్తి 5-స్టార్ భద్రతా రేటింగును పొందింది, వయోజన ప్రయాణికుల రక్షణలో కచ్చితమైన స్కోరును పొందింది.

మహీంద్రా ఎక్స్ఈవి 9ఈ కోసం shreyash ద్వారా జనవరి 17, 2025 06:56 pm ప్రచురించబడింది

XEV 9e అన్ని పరీక్షలు మరియు సన్నివేశాలలో డ్రైవర్ మరియు సహ-డ్రైవర్ ఇద్దరికీ మంచి రక్షణను అందిస్తూ, వయోజన ప్రయాణికుల రక్షణ (AOP)లో పూర్తి 32/32 పాయింట్లను సాధించింది.

మహీంద్రా XEV 9e అనేది భారతీయ ఆటోమేకర్ శ్రేణి యందు అందజేయబడుతున్న ఫ్లాగ్‌షిప్ ఆల్-ఎలక్ట్రిక్ అయి ఉంది, ఇది ఇప్పుడు భారత్ NCAP వారిచే క్రాష్ టెస్ట్ చేయబడింది. XEV 9e వయోజన మరియు పిల్లల ప్రయాణికుల రక్షణలో పూర్తి 5-స్టార్ భద్రతా రేటింగులను సాధించడమే కాకుండా, వయోజన భద్రతలో 32 కి 32 కచ్చితమైన స్కోరులను కూడా సాధించింది. XEV 9e యొక్క క్రాష్ టెస్ట్ యొక్క ఫలితాలను వివరంగా పరిశీలిద్దాం.

పారామితులు

స్కోరు

వయోజన ప్రయాణికుల రక్షణ (ఏఓపి)

32 పైకీ 32 పాయింట్లు

బాలల ప్రయాణికుల రక్షణ (సిఓపి)

49 పాయింట్ల పైకీ 45 పాయింట్లు

వయోజన భద్రతా రేటింగ్

5 స్టార్స్

బాలల భద్రతా రేటింగ్

5 స్టార్స్

ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బ్యారియర్ స్కోర్

16 పాయింట్ల పైకీ 16 పాయింట్లు

సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బ్యారియర్ టెస్ట్ స్కోర్

16 పాయింట్ల పైకీ 16 పాయింట్లు

డైనమిక్ స్కోర్ (బాలల భద్రత)

24 పాయింట్ల పైకీ 24 పాయింట్లు

పై చిత్రంలో చూపబడిన విధంగా, XEV 9e ఎలక్ట్రిక్ SUV-కూపే అన్ని పరీక్షలలోనూ డ్రైవర్ మరియు సహ-డ్రైవర్ ఇరువురికీ సమగ్రమైన ఆల్ రౌండ్ రక్షణను అందించింది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బ్యారియర్ పరీక్షలో, డ్రైవర్ మరియు ముందు కూర్చున్న ప్రయాణీకుల యొక్క అన్ని శరీర భాగాలు 'మంచి' రక్షణను పొందాయి, అయితే సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బ్యారియర్ పరీక్ష మరియు సైడ్ పోల్ పరీక్షలో, డ్రైవర్ తల, ఛాతీ, ఉదరం మరియు పెల్విస్ అన్నీ 'మంచి' రక్షణను అందుకున్నాయి.

18 నెలలు మరియు 3 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లల కొరకు, డైనమిక్ స్కోరు వరుసగా ముందు కూర్చున్న మరియు ప్రక్కన కూర్చున్న వారందరికీ 8 పైకీ 8 మరియు 4 పైకీ 4 గా ఉండినది.

వీటిని కూడా చూడండి: భారత్ NCAP క్రాష్ పరీక్షలలో మహీంద్రా BE 6 5-స్టార్ సేఫ్టీ రేటింగును సాధించింది.

ఆఫర్ పైన పవర్‌ట్రెయిన్‌లు

XEV 9e ని మహీంద్రా రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందిస్తుంది. స్పెసిఫికేషన్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

బ్యాటరీ ప్యాక్

59 kWh

79 kWh

క్లెయిం చేయబడిన రేంజ్ (ఎంఐడిసి భాగం I + భాగం II)

542 km

656 km

పవర్

231 PS

286 PS

టార్క్

380 Nm

380 Nm

డ్రైవ్ రకం

RWD

RWD

ఆఫర్ పై భద్రతా ఫీచర్లు

XEV 9e 7 అనేది ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), 360-డిగ్రీ కెమెరా మరియు లేన్-కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ వంటి 2 వ స్థాయి అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) టెక్‌ తో కలిసి వస్తుంది.

ధర శ్రేణి మరియు ప్రత్యర్థులు

మహీంద్రా XEV 7e ధర రూ. 21.90 లక్షల నుండి 30.50 లక్షల మధ్య ఉంటుంది (ప్రవేశ ధర, ఎక్స్-షోరూమ్, భారతదేష వ్యాప్తంగా). ఇది టాటా సఫారీ EV మరియు టాటా హారియర్ EV లకు ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఉంటుంది, అయితే దీనిని టాటా కర్వ్ EV, MG ZS EV, హ్యుండాయ్ క్రెటా ఎలక్ట్రిక్ మరియు మహీంద్రా BE 6 లకు ప్రీమియం ప్రత్యామ్నాయంగా కూడా పరిగణించవచ్చు.

ఆటోమోటివ్ ప్రపంచం నుండి తక్షణ అప్‌డేట్ లను పొందడానికి కార్దెకో వాట్సాప్ ఛానెల్‌ ని అనుసరించండి.

Share via
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
Rs.18.90 - 26.90 లక్షలు*
Rs.48.90 - 54.90 లక్షలు*
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.17.49 - 21.99 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర