Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మహీంద్రా మహారాష్ట్రలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు 8,000 కోట్ల రూపాయలని వెచ్చించింది

ఫిబ్రవరి 17, 2016 03:42 pm nabeel ద్వారా ప్రచురించబడింది

మహీంద్రా తన ఆటోమోటివ్ ప్లాంట్స్ ని మహారాష్ట్రలో విస్తరించేందుకు 8,000 కోట్ల రూపాయలని వెచ్చించింది. ఈ పెట్టుబడులు 7 సంవత్సరాల కాలంలో వెచ్చించబడతాయి. ఈ సమాచారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) కు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ చేరవేసింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,పవన్ గోయెంకా, మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి (పరిశ్రమలు), అపూర్వ చంద్రతో (MoU), దేవేంద్ర ఫడ్నవిస్, ముఖ్యమంత్రి సమక్షంలో ఈ అగ్రిమెంట్ పై సంతకం చేసారు.

ఈ కంపెనీ ప్రణాళికలు దాని విస్తరణలో భాగంగా మహారాష్ట్రలో ఆటోమోటివ్ ప్లాంట్లలో 8,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది అన్నారు. పెట్టుబడి ఏడు సంవత్సరాల కాలంలో వెచ్చిన్చబడుతుంది. ఈ పెట్టుబడి అంతా మహారాష్ట్రలో వాహనాల మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉత్పత్తి అభివృద్ధి మరియు సామర్థ్యం విస్తరణ దిశగా వినియోగించే ఉంటుంది. అని కూడా జోడించారు. " ఈ సంస్థ యొక్క కేంద్రాలు ప్రస్తుతం నాసిక్, Kandivali, చకన్ (పూనే), ఇగాత్ పురి, జహీరాబాద్ (తెలంగాణ), హరిద్వార్ (ఉత్తరాఖండ్) లో ఉన్నాయి.

మహీంద్ర గత నెల 10% వృద్ధిని సాధించింది. ఎందుకనగా ఇది 43,789 యూనిట్ల అమ్మకాల ని చేయగలిగింది. ఈ అమ్మకాల్ని జనవరి 2016 సమయంలో చేయగలిగింది. జనవరి 2015 సమయంలో 39,930 అమ్మకాల్ని చేయగలిగింది. అందువలన ఈఎ 10 శాతం వృద్ది చేయగలిగింది. ఈ ప్యాసింజర్ వాహనాలు దీని విభాగంలో జనవరి 2015 జనవరిలో 19,573 యూనిట్లని విక్రయించింది. 2016 లో 22,088 యూనిట్లు విక్రయించటం ద్వారా 13 శాతం వృద్దిని నమోదు చేసింది. కంపెనీ దేశీయ అమ్మకాలు జనవరి 2015 జనవరిలో 37,045 యూనిట్లు కాగా 2016 సమయంలో 40,693 యూనిట్లుగా నమోదయ్యాయి. జనవరి 2015 ఎగుమతులు 2,885 యూనిట్లుకాగా జనవరి 2016 ఎగుమతులు 3,096 యూనిట్లుగా నమోదయ్యాయి. జనవరి 2016 ఆటో అమ్మకాలు ప్రదర్శన మాట్లాడుతూ, ఎం అండ్ ఎం లిమిటెడ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్), మరియు ప్రవీణ్ షా ప్రెసిడెంట్ ఇలా అన్నారు. "2016 మధ్యకాలంలో 10% వృద్ధి సాధించినందుకు సంతోషంగా ఉన్నాము. అందువలన మా ఉత్పత్తులు ముఖ్యంగా కొత్తగా KUV100 మరియు TUV300 గిరాకీతో జనవరిలో సాధ్యమవుతోంది. రాబోయే ఆటో ఎక్స్పోలో అన్ని రకాల OEM లకు ప్రయోజనాత్మకంగా ఉంటుంది. మేము కూడా రాబోయే కేంద్ర బడ్జెట్లో సమర్థవంతమైన వృద్ధి సాధించటం జరిగింది. ఈ బడ్జెట్లో ఆటోమోటివ్ పరిశ్రమ కోసం ముఖ్యమైన రాయితీలను కూడా ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా MHCV ఎగుమతులు ప్రదర్శనలలో మంచి వృద్ధి సాధిస్తామని నమ్మకం ఉంది. ఈ విషయంలో వీరు సంతోషాన్ని వ్యక్తం చేసారు".

n
ద్వారా ప్రచురించబడినది

nabeel

  • 13 సమీక్షలు
  • 0 Comments

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
Rs.10.44 - 13.73 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.1.20 సి ఆర్*
ఫేస్లిఫ్ట్
Rs.67.65 - 71.65 లక్షలు*
ఫేస్లిఫ్ట్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర