మహీంద్రా తన ఆటోమోటివ్ ప్లాంట్స్ ని మహారాష్ట్రలో విస్తరించేందుకు 8,000 కోట్ల రూపాయలని వెచ్చించింది. ఈ పెట్టుబడులు 7 సంవత్సరాల కాలంలో వెచ్చించబడతాయి. ఈ సమాచారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) కు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ చేరవేసింది. మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,పవన్ గోయెంకా, మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి (పరిశ్రమలు), అపూర్వ చంద్రతో (MoU), దేవేంద్ర ఫడ్నవిస్, ముఖ్యమంత్రి సమక్షంలో ఈ అగ్రిమెంట్ పై సంతకం చేసారు.
">