మహంద్రా వారు టీయూవీ300 స్టీరింగ్ వీల్ తో ఊరిస్తున్నారు
ఆగష్టు 25, 2015 03:18 pm raunak ద్వారా సవరించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: విడుదల సమయం ఆసన్నం అయ్యే కొద్దీ మహింద్రా వారు టీయూవీ300 యొక్క కాంపాక్ట్ ఎస్యూవీ మరొక ప్రకటన తో ముందుకొచారు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో పాటుగా క్యాబిన్ కలర్ స్కీము మరియూ స్టీరింగ్ వీల్ ని ప్రకటనలో కనపడేట్టు గా చూపించారు. సెప్టెంబరు 10, 2015 లో విడుదల ఉంటుంది అనగా కంపెనీ వారు ఈ టీయూవీ యొక్క ముందు ఫెండర్ ని చూపించారు.
కొత్త ప్రకటన గురించి మాట్లాడుతూ, ఈ టీయూవీ300 లో నూతన స్టీరింగ్ వీల్ ఉంది. వేరే మహింద్రా వాహనాలతో పోలిస్తే ఇది చిన్నగా ఉంది పైగా మూడు పుల్లలతో సిల్వర్ పూతలు దిగువన అమర్చుకుని ఉంది. ఆడియో మరియూ బ్లూటూత్ కి బటన్స్ కలిగి ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కి ట్విన్ డైల్ టైప్ క్రోము పూత కలిగిన రింగులు ఉన్నాయి. డ్యాష్ బోర్డ్ కి రెండు రంగులు ఉన్నాయి - అవి బ్లాక్ మరియూ బేజ్ మరియూ క్రోము పూతలు ఏసీ వెంట్స్ కి మరియూ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కి కనిపిస్తాయి. బాహ్యపు అద్దాలకు ఒక అడ్జస్ట్మెంట్ టాగల్ కింది భాగంలో స్టీరింగ్ కి కుడి వైపు అమర్చారు.
మహింద్రా దీనిని సెప్టెంబరు 10 న విడుదల చేస్తుంది మరియూ డెలివరీలు తరువాత మొదలు పెడుతుంది. ఇంతకు మించి ఎటువంటి సమాచారం దీని గురించి ఆందలేదు. దీనికి ఎమ్హాక్80 డీజిల్ ఇంజిను ఉంది అని మహింద్రా వారు తెలిపారు.