• English
  • Login / Register

స్కార్పియో N స్టైలింగ్ؚతో సరికొత్త పికప్ కాన్సెప్ట్ؚను టీజ్ చేసిన మహీంద్రా, ఎలక్ట్రిక్ వాహనం కావచ్చు

మహీంద్రా స్కార్పియో ఎన్ కోసం ansh ద్వారా ఆగష్టు 01, 2023 02:16 pm ప్రచురించబడింది

  • 421 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ కారు తయారీదారు తమ గ్లోబల్ పికప్ ట్రక్ؚను INGLO ప్లాట్ؚఫారమ్ ఆధారంగా తయారుచేయవచ్చు

Mahindra Scorpio Pickup

  • మహీంద్రా పికప్ ఒక గ్లోబల్ ఆఫరింగ్.

  • స్కార్పియో Nతో డిజైన్ సారూప్యాలు కలిగి ఉంటుంది. 

  • 450కిమీ వరకు పరిధి ఉండవచ్చు.

  • 2025లో విడుదల కావచ్చు. 

ఆగస్ట్ 15 కార్యక్రమం కోసం మహీంద్రా కొత్త పికప్ కాన్సెప్ట్ؚను టీజ్ చేసింది, ఇది స్కార్పియో Nపై ఆధారపడింది అని మా నమ్మకం. మునుపటి-తరం మహీంద్రా స్కార్పియో కూడా పికప్ వర్షన్ؚను కలిగి ఉంది, ఇది ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశలో అందుబాటులో ఉంది, దీనికి తదుపరి వర్షన్ వస్తుందని మేము విశ్వసిస్తున్నాము.

ఇది ఎలక్ట్రిక్ పికప్ ఆ?

Mahindra Scorpio Pickup

స్కార్పియో N ICE (ఇంటర్నల్ కంబుషన్ ఇంజన్) మోడల్, కానీ టీజర్‌లో మహీంద్రా గ్లోబల్ పికప్ కోసం తమ విజన్ؚను ప్రదర్శిస్తున్నట్లు పేర్కొనందున, ఈ కారు తయారీదారు INGLO ప్లాట్ؚఫారమ్‌పై ఆధారపడిన ఎలక్ట్రిక్ వర్షన్ కావచ్చని మేం విశ్వసించడానికి కారణం ఉంది.

అభివృద్ధి చెందిన మార్కెట్‌లలో పికప్ؚలు సాధారణంగా కనిపించే వాహనాలు, ఫోర్డ్ మరియు టయోటా వంటి పేరొందిన కారు తయారీదారులు ఇప్పటికే ఎలక్ట్రిక్ పికప్‌లను తయారుచేయడం/విక్రయించడం ప్రారంభించారు. మరొకవైపు లగ్జరీ విభాగంలో, టెస్లా సైబర్ ట్రక్‌ను విడుదల చేసేందుకు ఇప్పటికీ కృషి చేస్తోంది, ప్రొడక్షన్‌కు-సిద్దంగా ఉన్న ఈ వాహనానికి ఇప్పటికే బహుళ సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంది.

ఇది కూడా చదవండి: భారతదేశంలో రాబోయే ఎలక్ట్రిక్ కార్‌లు

INGLO ప్లాట్ؚఫారమ్

Mahindra INGLO

ఈ ప్లాట్ؚఫారమ్ రెండు విభిన్న బ్యాటరీలను కలిగి ఉంటుంది: 60kWh మరియు 80kWh. INGLO ప్లాట్ؚఫారమ్ రేర్ వీల్ డ్రైవ్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ పవర్‌ట్రెయిన్ؚలు రెండిటినీ అందించగలదు, రెండవది పికప్ؚకు మరింతగా సరిపోతుంది, 450కిమీ వరకు పరిధిని అందించగలదు. INGLO ప్లాట్ؚఫారమ్ గురించి ఇక్కడ మరింత తెలుసుకొండి.

డిజైన్ సారూప్యతలు

Mahindra Scorpio Pickup

పికప్ కాన్సెప్ట్ టిజర్ కేవలం ముందు గ్రిల్, టెయిల్ ల్యాంపులు, సైడ్ స్టెప్ వంటి వివరాలను మాత్రమే చూపిస్తుంది, ఇవ్వి అన్నీ స్కార్పియో N నుండి ప్రేరణ పొందాయి. అంతేకాకుండా, పికప్ పూర్తి ఆకారం, బోనెట్ మరియు సన్ؚరూఫ్‌లతో సహా ప్రముఖ SUVలాగా కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: మహీంద్రా SUV e8 (XUV 700 ఎలక్ట్రిక్) కాన్సెప్ట్ వర్షన్ నుండి ఇలా భిన్నంగా ఉంటుంది 

స్కార్పియో N-ఆధారిత పికప్ కాన్సెట్ ఆగస్ట్ 15వ తేదీన కేప్‌టౌన్, దక్షిణ ఆఫ్రికాలో ప్రదర్శించబడుతుంది. ఎలక్ట్రిక్ పికప్ 2025 కంటే ముందు రాకపోవచ్చు, అయితే ఇంతకు ముందు తరం స్కార్పియో గెట్ఎవే వంటి ICE వర్షన్ ఉంటే, అది ఇసుజు V-క్రాస్ మరియు టయోటా హైలక్స్ వంటి వాటితో పోటీ పడటానికి భారతదేశానికి రావచ్చు. 

ఇక్కడ మరింత చదవండి: స్కార్పియో N ఆటోమ్యాటిక్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Mahindra స్కార్పియో ఎన్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience