మహీంద్రాS101 ,KUV100 అనే పేరుతో రాబోతోందా?
జైపూర్ : S101 కోడ్ పేరుతో ఉన్న మహీంద్రా యొక్క రాబోయే వాహనం KUV100 పేరుతో రాబోతుందని ఊహిస్తున్నారు. భారతదేశంలోని ఆటో కార్ సంస్థ ప్రకారం, దీని వెనుక కారణం KUV100 అనే బ్రాండ్ KUV100 పేరు వెనుక ఉన్న కారణం, ఆటో కార్ ఇండియా ప్రకారం ఈ వాహనానికి XUV100 అని పెట్టకపోవడానికి కారణం (పూర్వం ఇదే పేరు మీద పుకార్లు వచ్చాయి). ఎందుకంటే భారతవాహన సంస్థ 'చిన్న మరియు తక్కువ వాహనం'కి XUV బ్రాండ్ పేరుని పంచుకోవాలనుకోదు. మహీంద్రా కుడా తన వినియోగదారులు XUV500 అనే పేరుతో తికమక పడటం ఇష్టంలేదు. XUV అనేది సాదారణంగా మాస్ అని పిలవబడుతోంది.కారు యొక్క మరిన్ని వివరాలు అధికారికంగా డిసెంబర్ 18,2015 న బహిర్గతం చేయబడతాయి. KUV100 అనే పేరు “Kompact” అనే పదం నుండి వచ్చింది అని నమ్ముతారు. ఈ కారు బి-సెగ్మెంట్ క్రాస్ ఓవర్ /SUVగా రాబోతోంది.
ఇటీవల మహీంద్రా S101(కోడ్ నేం) ప్రోటోటైప్ ఒక వాణిజ్య చిత్రీకరణ సమయంలో రహస్యంగా కనిపించింది http://telugu.cardekho.com/car-news/Mahindra%20S101%20Spied%20Uncamouflaged%20in%20Mumbai-17122 . ఇది చూడటానికి SUV క్రాస్ ఓవర్ కన్నా ఎక్కువగా రూఫ్రెయిల్స్ , క్లాడింగ్ మరియు ఏటవాలు గీతలు కలిగి ఉంది. అలాగే, కారు వెనుక డోర్స్ కి పిల్లర్ మౌంట్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. కారు ప్రక్కభాగం నుండి గమనిస్తే వెనుక డోర్ నుండి బోల్డ్ బాడీ లైన్స్, కర్వ్స్ కలిగి ఉంది. వెనుక భాగంలోని టెయిల్‌లైట్ చూడటానికి చాలా చక్కగా కనిపిస్తుంది. సిల్వర్ అలాయ్స్ చక్కగా మలచిన రేర్ స్పాయిలర్ తో కొత్తగా ఉన్నాయి. KUV100, 1.2 లీటర్ ,3 సిలెండర్, డీజిల్ మరియు పెట్రోల్ ఇంజిన్లు కలిగి ఉంటుంది . దీని యొక్క శక్తి 75- 80 BHP గానూ ట్రాన్స్మిషన్ 5- స్పీడ్ మాన్యువల్ గా లేదా ఒక ఆప్షనల్ AMTకలిగి ఉండవచ్చు. ఈ క్రాసోవర్ హ్యుందాయి ఐ10, చెవ్రొలెట్ బీట్ మరియు మారుతి సెలేరియో వంటి కార్లతో పోటీ పడవచ్చు. ఇది సెగ్మెంట్ యొక్క మొదటి క్రాసోవర్ గా ఉంటుంది . దీని ధర సుమారు 4 లక్షలుగా ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు .