మహీంద్రా ఒక నెల కాలంలో 21,000 ల KUV100 వాహనాల బుకింగ్స్ ని నమోదు చేసుకుంది
మహీంద్రా కెయువి 100 ఎన్ఎక్స్టి కోసం sumit ద్వారా ఫిబ్రవరి 18, 2016 07:25 pm ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
అందరూ ఊహించిన విధంగానే మహీంద్ర KUV100 మార్కెట్లో తన మార్గాన్ని సుగమం చేసుకుంది. భారతీయ కార్ల తయారీ సంస్థ కేవలం ప్రారంభించ బడిన 34 రోజుల వ్యవధిలోనే 21,000 ల 'ఎస్యూవీ' బుకింగ్లు నమోదు చేసింది. ఈ బుకింగ్స్ డిసెంబర్ 2015 చివరలో ప్రారంభించింది. ఇంతేకాకుండా, 1.75 లక్షల విచారణలను మరియు 2.7 మిలియన్ సందర్శనల ను కూడా వెబ్సైట్లో పొందగలిగింది.
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్),& అధ్యక్షుడు మిస్టర్ ప్రవీణ్ షా మాట్లాడుతూ, ఇలా అన్నారు. " మేము ఈ మహేంద్ర కె యు వి 100 వాహనాన్ని ప్రారంభించిన కొన్ని రోజులకే ఇన్ని బుకింగ్స్ ని నమోదు చేసుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. దీనిని ఆదరించిన వినియోగదారులకి మా ధన్యవాదాలు. అంతే కాకుండా పెద్ద సంఖ్యలో విచారణలు మరియు 21,000+ బుకింగ్స్, తో మా కె యు వి 100 ఇంత తక్కువ సమయంలో ఇంత ప్రజాధరనని పొందగలిగింది. KUV100 ప్రారంభంతో మేము కాంపాక్ట్ కార్లు SUPERIOR కి ప్రత్యామ్నాయంగా SUV లని పరిచయం చేసింది. అందువలన ఈ వాహనం ఎక్కువగా వినియోగదారులని ఆకర్షించగలిగింది. దీనిలో అత్యంత ప్రధాన విషయం ఏమిటంటే ఈ బుకింగ్స్ లో సగం కంటే ఎక్కువగా KUV100 పెట్రోల్ వేరియంట్ కోసం వచ్చాయి. మేము మా వాహనాలని అత్యంత తొందరగా వినియోగదారులకి అందించడానికి మా ఉత్పత్తి సామర్ధ్యాలని ఇంకా పెంచుకుంటాము. ఇక మేము ఆ దిశగా ఎక్కువ దృష్టి సారిస్తాము" అన్నారు.
ఈ 4 వీలర్ వాహనం ఆల్ న్యు FALCON కుటుంబం ఇంజిన్ల ని కలిగి ఉంటుంది. 1.2 లీటర్ G80 పెట్రోల్ వేరియంట్ 82 బిహెచ్పిల శక్తి తో పాటూ 115 ఎన్ఎమ్ల గరిష్ట స్థాయి టార్క్ ని అందిస్తుంది. D75 డీజిల్ పవర్ ప్లాంట్ 77 bhp మరియు 190 ఎన్ఎమ్ల శక్తి స్థాయిలు మరియు టార్క్ ని ఉత్పత్తి చేసే సామర్ద్యం ని కలిగి ఉంటుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈ లైన్ అప్ లో ప్రామాణికంగా వస్తుంది.
మహీంద్రా ఒక అవట్-ఆఫ్- థ బాక్స్ విధానం ద్వారా వెళ్ళింది. కార్ల తయారీదారుడు ఈ కె యు వి 100లో ఈ సారి సమాంతర సీట్లని ప్రవేశపెట్టాడు. ఇటువంటి సీట్లని ఇదివరకు ఎప్పుడూ చూసి ఉండరు. అందువలన కారులో సీటింగ్ సామర్ద్యం ఖచ్చితంగా పెరిగింది. ఈ కారుకి అందించిన ప్రత్యేక వైఖరి వలన ఈ వాహనం అత్యంత ప్రజాదరణ ని పొంది వినియోగ దారులని ఆకర్షించి ఒక మైలురాయిని సాధించగలిగింది.