• login / register

మహీంద్రా మరాజ్జో Vs మహీంద్రా TUV300 ప్లస్: వేరియంట్స్ పోలిక

ప్రచురించబడుట పైన jun 17, 2019 12:13 pm ద్వారా khan mohd. for మహీంద్రా మారాజ్జో

  • 32 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మీరు ఒక MPV కోసం చూస్తున్న ఒక మహీంద్రా విధేయుడు అయ్యుంటే, మీరు రెండిటి మధ్య ఏది కొనుగోలు చేసుకోవాలో తికమక పడతారు. పదండి మీకు మేము సహాయ పడతాము.  

Mahindra Marazzo vs Mahindra TUV300 Plus: Variants Compared

మహీంద్రా సంస్థ మరాజ్జో MPV ని 2018 సెప్టెంబరు 3 వ తేదీన రూ. 9.99 లక్షల(ఎక్స్-షోరూం, డిల్లీ) ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. అది ప్రీమియం MPV గా ఉండినా కూడా, దాని యొక్క తక్కువ వేరియంట్స్ మహీంద్రా యొక్క ఇతర UV, TUV300 ప్లస్ యొక్క అధిక వేరియంట్స్ తో సమానంగా ఉంటాయి. కాబట్టి వాటి వేరియంట్స్ ని సరిపోల్చడం ద్వారా మీ అవసరాలకు ఉత్తమంగా ఏది సరిపోతుందో చూద్దాము. కానీ వాటి లక్షణాలపై మరింత వివరాలను వెల్లడి చేయడానికి ముందు, వారి కొలతలు మరియు పవర్‌ప్లాంట్ ని పరిశీలించండి.

కొలతలు

Mahindra Marazzo vs Mahindra TUV300 Plus: Variants Compared

  •  మరాజ్జో TUV300 ప్లస్ కంటే పొడవైనది మరియు విస్తృతమైనది మాత్రమే కాదు, ఇది 80mm ఎక్కువ వీల్ బేస్ ని కూడా కలిగి ఉంటుంది.
  •  TUV300 ప్లస్ పొడవుగా ఉంటుంది మరియు రెండో వరుస (రెండు బెంచ్ సీట్లు ఒకదానికి ఒకటి ఎదురుగా) వెనుక దాని సీటింగ్ లేఅవుట్ నిటారుగా అన్ని సీట్లు తో మరాజ్జో తో పోలిస్తే మరింత లగేజ్ తీసుకెళ్ళేందుకు మంచి స్పేస్ ని కలిగి ఉంటుంది. అయితే, రెండవ వరుస మరియు వెనుక సీట్లు ఫోల్డ్ చేస్తే, మార్జోజో TUV300 ప్లస్ కంటే ఎక్కువ సామాను స్థలాన్ని అందిస్తుంది.

డీజిల్ ఇంజన్

Mahindra Marazzo vs Mahindra TUV300 Plus: Variants Compared

ధర (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ):

మహీంద్రా మారాజ్జో

మహీంద్రా TUV300 ప్లస్

-

ప్లస్ P4 – రూ. 9.59 లక్షలు

M2 – రూ. 9.99 లక్షలు

ప్లస్ P6 – రూ. 9.95 లక్షలు

M4 - రూ. 10.95 లక్షలు

ప్లస్ P8 – రూ. 10.99 లక్షలు

M6 – రూ. 12.40 లక్షలు

-

M8  - రూ. 13.90 లక్షలు

-

ఈ ధర ట్యాగ్ గనుక చూసినట్లయితే మార్జోజో యొక్క దిగువ రెండు వేరియంట్లు TUV300 ప్లస్ యొక్క టాప్ రెండు వేరియంట్స్ తో పోల్చవచ్చు.

వేరియంట్లు మరియు లక్షణాలు

మోడల్

ధర

మహీంద్రా TUV300 ప్లస్ P6

రూ. 9.59 లక్షలు

మహీంద్రా మార్జోజో M2

రూ. 9.99 లక్షలు

తేడా

రూ.  40,000 (మరాజ్జో చాలా ఖరీదైనది)

సాధారణ లక్షణాలు: టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్, మొట్టమొదటి మరియు రెండవ వరుసలో మొబైల్ చార్జింగ్ పాయింట్స్, మాన్యువల్ A.C, ఫ్రంట్ మరియు వెనుక పవర్ విండోస్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బాగ్స్, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, EBD తో ABS  మరియు బ్రేక్ అసిస్టెంట్, మరియు ECO డ్రైవింగ్ మోడ్ వంటి లక్షణాలు ఉన్నాయి.

TUV 300 ప్లస్ పై మరాజ్జో ఏమిటి అందిస్తుంది: ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ (TUV300 ప్లస్ లో పాత హైడ్రాలిక్ యూనిట్ తో పోలిస్తే), డ్యుయల్ -బ్యారెల్ హెడ్ల్యాంప్స్, రెండవ-వరుస కెప్టెన్ సీట్లు, రెండవ మరియు మూడవ వరుసల కోసం మాన్యువల్ రూఫ్ మౌంటెడ్  ఎయిర్ కండీషనింగ్, ముందు మరియు వెనుక ఆర్మ్రెస్ట్లు, నాలుగు డిస్క్ బ్రేక్స్, ISOFIX చైల్డ్ సీటు యాంకర్స్ మరియు స్పీడ్ అలర్ట్ వ్యవస్థ (80 కిలోమీటర్ల మీద మూడు ధ్వని హెచ్చరికలు).

మరాజ్జో పై TUV300 ప్లస్ ఏమిటి పొందుతుంది: మరాజ్జోలో 7- లేదా 8 సీటర్ ఎంపికలతో పోలిస్తే 9 పెద్దలకు సీటింగ్, మహీంద్రా యొక్క మైక్రో-హైబ్రిడ్ టెక్ ఐడిల్ ఇంజిన్ స్టార్ట్ స్టాప్ తో మరియు బ్రేక్ ఎనర్జీ రీజెనరేషన్ వంటి వాటిని పొందుతుంది.

తీర్పు: TUV300 ప్లస్ కన్నా కొంచెం ఖరీదైనప్పటికీ, మహీంద్రా మారాజ్జో మంచి లక్షణాలతో మా ఓటును పొందుతుంది మరియు ఇది అన్ని ముఖ్యమైన భద్రతా లక్షణాలను ప్యాక్ చేస్తుంది. ఒక 9-సీటర్ గా ఉంటూ, TUV300 ప్లస్ ఆశ్చర్యకరంగా రెండవ మరియు మూడవ వరుసల కోసం వెనుక ఎయిర్ కాన్ వెంట్లని మిస్ అవుతుంది.

మోడల్

ధర

మహీంద్రా TUV300 ప్లస్ P8

రూ.  10.99 లక్షలు

మహీంద్రా మారాజ్జో M4

రూ.  10.95లక్షలు

తేడా

రూ.  4,000 (TUV300 ప్లస్ చాలా ఖరీదైనది)

సాధారణ లక్షణాలు (మునుపటి వేరియంట్స్ లలో): రేర్ వాష్ మరియు వైప్, రేర్ డీఫాగర్(మారాజ్జోలో టైమర్ తో), ఎలక్ట్రికల్ సర్దుబాటు ORVM లు, నాలుగు స్పీకర్లు మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో ఆడియో సిస్టమ్ తో పాటు మహీంద్రా బ్లూ సెన్స్ అప్లికేషన్ మద్దతు మరియు వాయిస్ మెసేజింగ్ సిస్టం, ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు, డ్రైవర్ మరియు సహ ప్రయాణీకుల కోసం ఆర్మ్రెస్ట్, ఫోల్డింగ్ 2 వ వరుస సీటు వంటి లక్షణాలు ఉన్నాయి.

TUV 300 ప్లస్ పై మరాజ్జో ఏమిటి అందిస్తుంది: ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ (TUV300 ప్లస్ లో పాత హైడ్రాలిక్ యూనిట్ తో పోలిస్తే), డ్యుయల్ -బ్యారెల్ హెడ్ల్యాంప్స్, రెండవ-వరుస కెప్టెన్ సీట్లు, రెండవ మరియు మూడవ వరుసల కోసం మాన్యువల్ రూఫ్ మౌంటెడ్  ఎయిర్ కండీషనింగ్, ముందు మరియు వెనుక ఆర్మ్రెస్ట్లు, నాలుగు డిస్క్ బ్రేక్స్, ISOFIX చైల్డ్ సీటు యాంకర్స్ మరియు స్పీడ్ అలర్ట్ వ్యవస్థ (80 కిలోమీటర్ల మీద మూడు ధ్వని హెచ్చరికలు) వంటి లక్షణాలను అందిస్తుంది.

మరాజ్జో పై TUV300 ప్లస్ ఏమిటి పొందుతుంది:

ఫాలో మీ హోం హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, అలాయ్ వీల్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, నావిగేషన్ తో 7-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వెనుక పార్కింగ్ సెన్సార్స్, రెండు అదనపు ట్వీటర్స్, ప్రకాశవంతమైన గ్లోవ్ బాక్స్, రిమోట్ లాక్ మరియు కీలేస్ ఎంట్రీ వంటి వాటిని పొందుతుంది.

తీర్పు:

ఒకేవిధమైన ధర కలిగినటువంటి TUV300 ప్లస్ చక్కగా అమర్చబడి ఉంది, అలాగే మరాజో ఇక్కడ ఇంకా ముందంజలోనే ఉంది, ఎందుకంటే దాని మంచి సీట్లు మరియు రెండవ మరియు మూడవ వరుస ప్రయాణీకులకు ప్రత్యేక ఎయిర్ కండిషనింగ్ యూనిట్ మరియు అది అందించే అధనపు భద్రతా లక్షణాల కారణంగా ముందంజలోనే ఉంది. అంతేకాకుండా, మరాజ్జోపై TUV300 ప్లస్  అందించే అదనపు లక్షణాలను మరాజ్జో లో చాలావరకు మహీంద్రా డీలర్స్ లేదా ఇతర మూడవ పక్ష ఎంపికల నుండి కొనుగోలు తరువాత మార్కెట్ లో పొందవచ్చు.

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన మహీంద్రా మారాజ్జో

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

Ex-showroom Price New Delhi
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?