మహీంద్రా మారాజ్జో యాక్ససరీస్: ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, హెడ్స్ -అప్ డిస్ప్లే & మరిన్ని
మహీంద్రా మారాజ్జో కోసం dinesh ద్వారా జూన్ 19, 2019 11:46 am ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మారాజ్జో యొక్క దిగువ శ్రేణి వేరియంట్లు మేము ఊహించినంతగా లోడ్ చేయబడనందున, కొనుగోలుదారులకు ఇప్పుడు మరిన్ని ఫీచర్లను జోడించుకునే అవకాశం ఉంది
మహీంద్రా నుంచి ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎంపివి, మారాజ్జో ఈ నెల ప్రారంభంలో భారతదేశంలో ప్రవేశపెట్టబడింది, దీని యొక్క ధరలను చూసినట్లయితే రూ .10 లక్షల నుండి మొదలై రూ. 13.90 లక్షల వరకు (ఎక్స్- షోరూమ్ పాన్- ఇండియా)అందుబాటులో ఉన్నాయి. మారాజ్జో యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ చాలా సౌకర్యవంతమైన మరియు భద్రతా లక్షణాలతో వచ్చినప్పటికీ, ఇప్పుడు తక్కువ వేరియంట్ల కోసం ఉపకరణాల యొక్క సుదీర్ఘ జాబితా ఉంది. మహీంద్రా మారాజ్జో యొక్క అనుబంధ జాబితాను పరిశీలిద్దాం.
ఎక్స్టీరియర్
- ఎగ్జిక్యూటివ్ బాడీ కిట్: ముందు మరియు వెనుక బంపర్ స్కర్ట్, సైడ్ స్కర్ట్ మరియు రేర్ స్పాయిలర్ వంటివి ఉన్నాయి
ప్రీమియం బాడీ కిట్: ముందు మరియు వెనుక బంపర్స్ యాడ్ -ఆన్‌లు, వీల్ ఆర్చ్ క్లాడింగ్, సైడ్ మోల్డింగ్, రేర్ స్పాయిలర్ మరియు రూఫ్ రైల్స్ ఉన్నాయఇది కూడా చదవండి: మహీంద్రా మారాజ్జో : చిత్రాలలో
మారాజ్జోకు కొంత బ్లింగ్ జోడించడానికి, మహీంద్రా -తన ఎంపివి కోసం వివిధ క్రోమ్ చేరికలు కూడా అందిస్తోంది. ఇందులో పైన గ్రిల్, లోయర్ గ్రిల్, ఓఆర్‌విఎంలు, హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లాంప్స్, రూఫ్ రైల్స్, డోర్ హ్యాండిల్స్, రేర్ బంపర్ లిప్, రేర్ నంబర్ ప్లేట్ హౌసింగ్, రేర్ రిఫ్లెక్టర్లు మరియు టెయిల్ గేట్ కోసం క్రోమ్ తో అలంకరించి అందించబడ్డాయి.
ఇది కూడా చదవండి: మహీంద్రా మారాజ్జో : 5 అంశాలు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉంది
అందించబడ్డ ఇతర బాహ్య ఉపకరణాలు: రెయిన్ విజర్, షార్క్- ఫిన్ యాంటెన్నా (తక్కువ వేరియంట్ల కోసం), అల్లాయ్స్ (తక్కువ వేరియంట్ల కోసం), సైడ్ స్టెప్, రూఫ్ ర్యాప్స్, ఓఆర్విఎం ల ర్యాప్లు మరియు ముందు అలాగే వెనుక బంపర్ గార్డ్‌లు వంటి అంశాలను అందించడం జరిగింది. అంతేకాకుండా మహీంద్రా, ఇంటిగ్రేటెడ్ రూఫ్ క్యారియర్, హండి రాక్ మరియు తూలే సైకిల్ క్యారియర్ తో సహా వివిధ రకాల రూఫ్ క్యారియర్ కిట్‌లను కూడా మహీంద్రా అందిస్తోంది.
ఇంటీరియర్
- లోపలి భాగంలో, కొనుగోలుదారులు వేర్వేరు సీట్ కవర్లు, స్టీరింగ్ కవర్లు, స్కఫ్ ప్లేట్లు, ఫ్లోర్ మాట్స్, సన్ షేడ్స్ మరియు యాంటీ- స్కిడ్ డాష్ మాట్స్ లను ఎంచుకోవచ్చు.
- ఆఫర్‌లో ఉన్న ఇతర ఉపకరణాల విషయానికి వస్తే కోట్ హ్యాంగర్, మొబైల్ హోల్డర్, కార్ పెర్ఫ్యూమ్, మెమరీ ఫోమ్ కుషన్స్, వాక్యూమ్ క్లీనర్, ట్రాష్ క్యాన్, డ్రింక్ చిల్లర్ అండ్ వార్మర్ మరియు టాబ్లెట్ హోల్డర్
అలాగే చదవండి: మహీంద్రా మారాజ్జో : మనకు నచ్చే 5 అంశాలు
టెక్నాలజీ
ఇప్పటికే అందుబాటులో ఉన్న 7 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కాకుండా, కొనుగోలుదారులు వెనుక సీట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, హెడ్స్- అప్ డిస్ప్లే మరియు లోగో ప్రొజెక్టర్ లాంప్స్‌ను కూడా ఎంచుకోవచ్చు. దిగువ శ్రేణి వేరియంట్‌లను ఎంచుకునే వారు మ్యూజిక్ సిస్టమ్ మరియు రివర్స్ పార్కింగ్ కెమెరాను యాక్ససరీ గా అమర్చవచ్చు
డిసి డిజైన్ ప్యాకేజీ
మారాజ్జో కోసం డిసి డిజైన్ నిర్మించిన బెస్ స్పోక్ క్యాబిన్‌ను కూడా మహీంద్రా అందిస్తోంది. క్యాబిన్ అధిక- నాణ్యత మెటిరియళ్ళ నుండి తయారు చేయబడుతుంది. క్యాబిన్ లో అందించబడిన గాడ్జెట్ లు అలాగే పరికరాలు క్యాబిన్ వాతావరణాన్ని మరియు లగ్జరీ అనుభూతిని ఒక వంతు పైన అందించడానికి ఈ ఉపకరణాలు అన్ని అందించబడ్డాయి. దాని గురించి ఇక్కడ మరింత చదవండి.
ఇవి కూడా చదవండి: 5 సంవత్సరాల / 1,50,000 కిలో మీటర్ల ఎక్స్టెండెడ్ వారంటీ తో వస్తున్న మహీంద్రా మారాజ్జో
మరింత చదవండి: మారాజ్జో డీజిల్
0 out of 0 found this helpful