తదుపరి రాబోయే మహేంద్ర వారి అతిపెద్ద కారు KUV100 ?
మహీంద్రా కెయువి 100 ఎన్ఎక్స్టి కోసం అభిజీత్ ద్వారా డి సెంబర్ 30, 2015 02:57 pm సవరించబడింది
- 21 Views
- 10 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
న్యూ డిల్లీ;
ఇది దాని చివరి ప్రారంభం తో ఎకో స్పోర్ట్, డస్టర్ , క్రెటా, ఎస్-క్రాస్ కంటే తక్కువ మైలేజ్ ని ఇస్తూ కాంపాక్ట్ SUV విభాగంలో తయారీదారు యొక్క ఉనికిని చాటుతుంది. మహీంద్రా జనవరి 15 న KUV100ని మార్కెట్ లోకి తెస్తుంది అని దృవీకరించారు. దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభించారు. ఇది SUV వలె కనిపించే ఒక హాచ్బాక్ సైజు కారు. ఇందులో ఇంకా ఏమి ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసుకుందాం .
భారతీయులు తమ పార్కింగ్ స్థలంలో సరిపోయే కారుని కోరుకుంటూ అదే సమయంలో పక్క వాళ్ళ కారు కంటే పెద్దగా ఉండాలని కోరుకుంటారు. ఈ KUV100 కారు చూడటానికి హాచ్బాక్ లాగా కనిపించట్లేదు. ఈ కారు యొక్క ముందు భాగం లో చూడటానికి ఒక కనుబొమ్మ లాంటి ముగింపు ఉంటుంది. ఇది ముందు డోర్ దగ్గరనుండి విస్తరించి ఉంటుంది. దీని యొక్క హెడ్ల్యాంప్ లు మిరుమిట్లు గొలిపే అగ్రీస్సివ్ లుక్ ని కలిగి ఉండి, మస్కులార్ కార్వింగ్స్ తో ఉన్నటువంటి పొడవయిన DRLs బంపర్ ని కలిగి ఒక చిన్న SUV ని తలపిస్తుంది. పక్క భాగాలని చూసినట్లయితే కారు చుట్టూఒక స్లీక్ బాడీ క్లాడింగ్ ఆడ్ చేయబడి ఉంటుంది. దీని వెనుక చక్రాలు కుడా ముందు చక్రాల ఆర్క్ ని పోలి ఉండి మస్కులర్ లుక్ ని కలిగి ఉంటుంది. కొంతకాలం కింద వచ్చిన ప్రకటన ని గమనిస్తే కారు యొక్క వెనుక భాగం స్పోర్టీ లుక్ ని కలిగి ఉంటుంది. ఈ కారు యొక్క చిన్న డ్రా బ్యాక్ ఏంటంటే దీని వీల్స్ కారు బాడీ తో పోలిస్తే చాలా చిన్నగా ఉన్నాయి . దీనికి గల కారణం ఈ చక్రాలు కంప్యూటర్ తో రెండరింగ్ చేయబడి ఉండటమే కావచ్చు. లోపలి భాగాల గురించి మాట్లాడినట్లయితే ,అంతగా ప్రతేకించి చూడటానికి ఏమి లేవు, చూడటానికి బావుంటుంది అని అనుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం రహస్యంగా కనపడినటువంటి కారు ఫోటో లో డాష్బోర్డ్ మౌంట్ గేర్ లివర్ తో పాటు ముందు వరుసలో మూడు సీట్లు గుర్తించడం జరిగింది. దీనిలోని కొన్ని ఇన్పుట్ డిజైన్ లు కోసం ఇటలీ చెందిన ప్రఖ్యాత డిజైన్ సంస్థ నుండి ఒప్పందం కుదుర్చుకుంది.
తాజా మహీంద్రా KUV100 TVC యొక్క వీడియో ని వీక్షించండి ;
KUV100 యొక్క ఇంజిన్లు కింది విధంగా ఉన్నాయి .
mFalcon D75 - 1.2 లీటర్ 3-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ ని కలిగి ఉండి, 3,750ఆర్పిఎమ్ వద్ద 77bhp శక్తిని , మరియు 1,750-2,250 ఆర్పిఎమ్ వద్ద 190Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.
mFalcon G80 - 1.2 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ని కలిగి ఉండి, 5,500ఆర్పిఎమ్ వద్ద 82bhp శక్తిని , మరియు 3,500rpm వద్ద 114Nm ల టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.
ట్రాన్స్మిషన్ - ప్రారంభ సమయం లో అయితే KUV100 5-స్పీడ్ ంట్ ని కలిగి ఉంటుంది. మహీంద్రా తరువాత దశలలో ఒక ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ని పరిచయం చేసే అవకాశం ఉంది,
కాబట్టి, KUV100 ని రెండు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ల ఎంపికతో అందిస్తున్నారు. డీజిల్ మైలేజ్ 20 kmpl కన్నా ఎక్కువగాను మరియు పెట్రోల్ ఇంజిన్ యొక్క మైలేజ్ 18 kmpl గాను ఉంటుంది అని భావిస్తున్నారు.
ఇది కుడా చదవండి :