జనవరి 6, 2016 న ప్రారంభం కానున్న మహీంద్రా Imperio పికప్
జనవరి 06, 2016 11:08 am nabeel ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ జనవరి కోసం మహీంద్రా అందరి కొరకు ఏదో ఒకటి అందించడానికి ముందుకు వస్తోంది. హాచ్బాక్ విభాగంలో ప్రవేశించే వరుసలో ఉన్న KUV100 తో పాటూ ఇంపీరియో పికప్ చిన్న కమర్షియల్ వాహన విభాగంలోనికి అదనంగా రానున్నది. ఈ తాజా పికప్ భారత వాహన తయారీదారిచే జనవరి 6 , 2016 న ప్రారంభించబడుతుంది. మహీంద్రా ప్రస్తుతం తేలికపాటి వాణిజ్య వాహన విభాగంలో 50% వాటాను కలిగి ఉంది. జీనియో భవిష్యత్తు గురించి ఎలాంటి దృవీకరణ లేనప్పటికీ పుకార్లు ప్రకారం మహీంద్రా రెండు వాహనాల అమ్మకాలను కొనసాగించవచ్చు అని తెలుస్తుంది. ఇంపీరియో వాహనం భారతదేశం లో టాటా జెనాన్ మరియు ఇసుజు డి-మాక్స్ వంటి వాహనాలతో పోటీ పడనున్నది.
పూనే సమీపంలోని మహీంద్రా చకన్ ప్లాంట్లో ఉత్పత్తి అవుతున్న ఈ వాహనం చెన్నైలోని హ్యుందాయి యొక్క పరిశోధన మరియు అభివృద్ధి నుంచి వచ్చింది. ఇంపీరియో వాహనం Genio తో దాని ప్లాట్‌ఫార్మ్ ని పంచుకుంటుంది కానీ చాలా స్టైలింగ్ గా ఉంటుంది. అలాగే, దీని పికప్ రైడ్ మరియు పనితీరు బాగుంటుందని భావిస్తున్నారు. ఇంపీరియో బహుశా జీనియో తో శక్తిని అందించబడే 2.5 లీటర్ ఇంజన్ ని కలిగి ఉంది. ఇదే జరిగితే 74bhp శక్తిని మరియు 220Nm టార్క్ ని అందిస్తుంది.
రాబోయే పికప్ టీజర్ కూడా బయటకి వచ్చింది. దీని ద్వారా వాహనం సులభంగా లోడ్ చేసుకోవడం, ఎయిర్ కండిషనింగ్ మరియు కొత్త స్టైలింగ్ వంటి సౌకర్యాలతో పాటు మంచి పనితీరును అందిస్తుందని తెలుస్తుంది. మహీంద్రా సంస్థ అది ప్రారంభించిన వాహనాల కౌంట్ డౌన్ లక్షణాన్ని కలిగియున్నటువంటి ఒక వెబ్సైట్ ను ఏర్పాటు చేసింది. ప్రారంభం గురించి ఎం అండ్ ఎం లిమిటెడ్, అధ్యక్షుడు మరియు (ఆటోమేటివ్) చీఫ్ ఎగ్జిక్యూటివ్, ప్రవీణ్ షా మాట్లాడుతూ " మేము చిన్న వాణిజ్య వాహనం విభాగంలో మార్కెట్ లీడర్ కనుక ఇంపీరియో చేరిక వలన మేము మరింత వాణిజ్య వాహనం స్పేస్ లో మా నాయకత్వం ఏకీకృతం చేయగలమని నమ్ముతున్నాము." అని తెలిపారు.
టీజర్ వీడియో
ఇంకా చదవండి