మహింద్రా వారు హరిద్వార్ సదుపాయం వద్ద 7 లక్షల యూనిట్ల తయారీ ని దాటారు

సెప్టెంబర్ 30, 2015 09:57 am cardekho ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: మహింద్రా & మహింద్రా వారు 7 లక్షల యూనిట్ల తయారీని దాటి ఒక కొత్త మైలురాయిని అధిగమించారు. ఇది కంపెనీ వారు 5 లక్షల యూనిట్ల స్కార్పియోల తయారీ మార్క్ ని దాటిన కొద్ది కాలంలోనే జరిగింది. నవంబరు 2014 లో ఈ తయారీదారి 6 లక్షల యూనిట్లని తయారు చేయగా, కేవలం మరొక 10 నెలలలోనే ఇంకో లక్ష యూనిట్లను తయారు చేశారు.

Mahindra Cross

మహింద్రా వారి హరిద్వార్ సదుపాయంలో అనేక రకాల ఉత్పత్తుల తయారీ జరుగుతుంది. వీటిలో బొలెరో, స్కార్పియో వంటివి ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో ఈ కంపెనీకి ఉన్న ఒకే ఒక సదుపాయం ఇది. ఇతర సదుపాయాలు చకన్, నాసిక్, జహీరాబాద్, కండివలి మరియూ ఇగతపురి లో ఉన్నాయి. వీటన్నిటిలో ప్రెస్ షాప్, బాడీ షాప్, CED లైన్, పెయింట్ షాప్ మరియూ సమీకరణ సదుపాయాలు కలవు.

మహింద్రా & మహింద్రా కి ప్రెసిడెంట్ మరియూ చీఫ్ ఎగ్జెక్యూటివ్ అయిన మిస్టర్. ప్రవీన్ షా గారు ఈ సందర్భంగా మొత్తం టీం ను పొగడ్తలతో ముంచెత్తారు. "ఇది ఒక అపూర్వ విజయం. మా నిరంతర కృషి కి ఇది నిదర్శనం. ఈ సదుపాయం ఎళ్ళప్పుడూ మైలురాయిలను అధిగమిస్తూ వస్తోంది మరియూ కంపెనీ వారి పేరుని నిలబెడుతోంది," అని అన్నారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

కార్ వార్తలు

  • ట్రెండింగ్ వార్తలు
  • ఇటీవల వార్తలు

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience