• English
  • Login / Register

మహీంద్రా టియువి300 లక్షణాలు & నిర్దేశాలు గురించి తెలుసుకోండి

సెప్టెంబర్ 11, 2015 02:14 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: టియువి300  ఒక గ్రాండ్ ఈవెంట్ లో నిన్న ప్రారంభించబడింది. కారు ఈ సంవత్సరంలో భారీ అంచనాలు కలిగిన కాంపాక్ట్ ఎస్యువి కార్లలో ఇది ఒకటి. ఈ కారు కి ఉదారమైన  ప్రోత్సాహక ప్రచారం జరిగింది మరియు అది బాగా విజయం పొందింది. ఈ కారు రూ.6.9 లక్షల ధర వద్ద (ఎక్స్ - షోరూమ్, పూనే) లో అందుబాటులో ఉంది. ఈ కాంపాక్ట్ ఎస్యువి లో ఎం హాక్ డీజిల్ ఇంజిన్ 2-స్టేజ్ టర్బోచార్జర్ సిస్టమ్ తో వస్తుంది. పోటీ ధర పరిగణలోనికి తీసుకుంటే, ఈ కారు యొక్క లక్షణాలు మరియు నిర్దేశాలు అత్యుత్తమంగా  ఉన్నాయి. కానీ ఇక్కడ కొన్ని అంశాలు మాత్రమే చర్చించడం జరిగింది. 

గురగుర ధ్వని: 

.టియువి బిఎస్4 1493సిసి పవర్ప్లాంట్ తో 3750rpm వద్ద 84bhp శక్తిని మరియు  1500-2250rpm మధ్య 230Nm టార్క్ ని అందిస్తుంది. 
. ఇంజిన్ 5 స్పీడ్ ఎంటి/ఎ ఎంటి గేర్బాక్స్ వ్యవస్థ తో జతచేయబడి ఉంటుంది. 
. కారు డబుల్ విష్బోన్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు దృఢమైన ఆక్సిల్ మల్టీ-లింక్ వెనుక సస్పెన్షన్ లక్షణాన్ని కలిగి ఉంది.  5.35m టర్నింగ్ రేడియస్ ని అందిస్తుంది. 

శైలి: 

. టియువి ని చూసినట్లైతే గనుక  జీప్ చెరోకీ ని గుర్తుకు తెస్తుంది. దీనిలో టి8 మరియు టి6 వేరియంట్లు క్రోమ్ చేరికలు గల ముందరి గ్రిల్ తో వస్తాయి. టి8 లో ప్రత్యేకమైన క్రోమ్ చేరికలతో ఉన్న ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. 
. ఫాగ్ల్యాంప్స్ లానే అలాయ్ వీల్స్ టి8 వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.  
. టి8 వేరియంట్ ఒక స్పేర్ వీల్ తో అమర్చబడి ఉంటుంది మరియు అన్ని మోడల్స్ వినైల్ కవర్ తో అందించబడుతున్నాయి. 
. కారు టి8 మరియు టి8 ఎ ఎంటి వేరియంట్స్ లో ఏ.సి వెంట్లపై సిల్వర్ చేరికలు మరియు క్రోమ్ రింగ్స్ తో ఉన్న ట్విన్ - పాడ్  ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ని కలిగి ఉంటుంది.  
. ఇతర కాంపాక్ట్ ఎస్యువి లా కాకుండా టియువి300 7 సీటర్ (5 + 2) సౌలభ్యం అందిస్తుంది. 


సాంకేతికతలు:

.దీనిలో టి8 వేరియంట్ స్టాటిక్ - బెండింగ్ హెడ్ల్యాంప్స్ మరియు ఇంటిల్లీ పార్క్ రివర్స్ ఎసిస్ట్ తో వస్తున్నాయి
. టీయువి300 ప్రదర్శన స్క్రీన్ తో సమాచార వ్యవస్థ, 2 - డిన్ ఆడియో మరియు బ్లూటూత్, యుఎస్బి మరియు ఆక్స్ కనెక్టివిటీ  వంటి వినోద లక్షణాలను అందిస్తుంది. 
. టీయువి300 యొక్క అన్ని వేరియంట్లు ఎసిఒ మోడ్ తో వస్తాయి కానీ మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ టి8 వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది.  
. దీనిలో టి6 మరియు టి8 వేరియంట్లు కూడా  మహీంద్రా బ్లూ సెన్స్ మొబైల్ యాప్ మరియు వాయిస్ మెసేజింగ్ సిస్టం (విఎం ఎస్) లక్షణాన్ని కూడా కలిగి ఉంది.  

భద్రత:


. టియువి300  బేస్ టి4 మోడల్ మినహాయించి అన్ని వేరియంట్స్ కి ముందరి ఎయిర్బాగ్స్ ని అందిస్తుంది. అవే మోడల్స్ ఇబిడి తో కూడిన ఎబిఎస్ ని కూడా  అందిస్తున్నాయి.
. దీనిలో కొలాప్సబల్ స్టీరింగ్ కాలమ్, డిజిటల్ ఇమ్మొబలైజర్, సీటు బెల్ట్ రిమైండర్  ల్యాంప్ మరియు ఆటో డోర్ లాక్ వంటి భద్రతా లక్షణాలు కూడా అన్ని మోడల్స్ లో    అందుబాటులో ఉన్నాయి. 
. అన్ని టి6 మరియు టి8 వేరియంట్లు యాంటీ తెఫ్ట్ హెచ్చరిక వ్యవస్థతో వస్తున్నాయి. 
. అన్ని వేరియంట్స్లో కూడా ఈ భద్రతా లక్షణాలన్నీ చూస్తుంటే, మహీంద్ర సంస్థ ప్రాయాణికుల భద్రతపై ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Mahindra TUV 3OO

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience