ఆన్‌లైన్‌లో చక్కర్లుకొడుతున్న 2024 Hyundai Creta N లైన్ చిత్రాలు
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ కోసం rohit ద్వారా జనవరి 30, 2024 01:16 pm ప్రచురించబడింది
- 84 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
స్పై షాట్లలో నవీకరించిన SUV యొక్క స్పోర్టియర్ లుక్స్ కనిపిస్తాయి, దీని ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ లో రెడ్ హైలైట్స్ చేయబడ్డాయి.
-
క్రెటా N లైన్ ఇటీవల విడుదల అయిన ఫేస్‌లిఫ్ట్ క్రెటా ఆధారంగా రూపొందించబడుతుంది.
-
ఇందులో రెడ్ కలర్ స్కర్ట్స్, N లైన్ బ్యాడ్జీలు, 18 అంగుళాల పెద్ద అల్లాయ్ వీల్స్ ఉండనున్నాయి.
-
క్యాబిన్ లోపల, ఇది ఆల్-బ్లాక్ కలర్ థీమ్తో రెడ్ ఇన్సర్ట్స్ మరియు కాంట్రాస్ట్ రెడ్ స్టిచింగ్ పొందుతుంది.
-
క్రెటా ఫీచర్ల జాబితాలో డ్యూయల్ 10.25 అంగుళాల డిస్ప్లే, ADAS ఉన్నాయి.
-
1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ MT మరియు 7-స్పీడ్ DCTతో అందించే అవకాశం ఉంది.
-
క్రెటా N లైన్ త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. ఈ వాహనం ధర రూ.17.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.
ఫేస్‌లిఫ్ట్ హ్యుందాయ్ క్రెటా విడుదల తరువాత, హ్యుందాయ్ యొక్క టాప్ సెల్లింగ్ SUV కారు యొక్క N లైన్ వెర్షన్ త్వరలో భారతదేశంలో విడుదల కావచ్చని చర్చలు జరిగాయి. ఇప్పుడు హ్యుందాయ్ క్రెటా N లైన్ యొక్క కొన్ని కొత్త చిత్రాలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి, ఇవి TVC (టెలివిజన్ కమర్షియల్) షూట్ లో భాగమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
చిత్రాలలో ఏమి కనిపిస్తుంది?
హ్యుందాయ్ i20 మరియు వెన్యూ యొక్క ప్రస్తుత N లైన్ వెర్షన్లు ప్రామాణిక మోడల్ తో పోలిస్తే ఎటువంటి డిజైన్ నవీకరణలు పొందవు, అయితే హ్యుందాయ్ రెగ్యులర్ మోడల్ తో పోలిస్తే క్రెటా N లైన్ డిజైన్ లో కొన్ని మార్పులు చేశారు. సాధారణ క్రెటాతో పోలిస్తే, క్రెటా N లైన్ ముందు భాగంలో స్ప్లిట్ LED హెడ్లైట్ సెటప్ పొందుతుంది మరియు హెడ్లైట్లు LED DRL స్ట్రిప్కు కనెక్ట్ చేయబడతాయి. ఇది కాకుండా, ఇది మాడిఫైడ్ చిన్న గ్రిల్ మరియు ముందు భాగంలో వెడల్పాటి బంపర్ ను పొందుతుంది.
సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, రెడ్ స్కర్ట్ తో పెద్ద 18-అంగుళాల N-లైన్ స్పెసిఫిక్ అల్లాయ్ వీల్స్ (రెడ్ బ్రేక్ కాలిపర్స్ తో) ఉన్నాయి. వెనుక భాగానికి సంబంధించిన సమాచారం ఇప్పటికే వెల్లడైనప్పటికి, ఇందులో మోడిఫైడ్ బంపర్ ను మాత్రమే లభిస్తుంది. స్పోర్టీ SUVకి ఎక్స్టీరియర్ 'N లైన్ ' బ్యాడ్జింగ్ ఇవ్వొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇంటీరియర్ వివరాలు
తాజాగా విడుదల అయిన ఫొటోల్లోని ప్రధాన హైలైట్స్ లో క్యాబిన్ థీమ్ ఒకటి. ఇతర N లైన్ మోడళ్ల మాదిరిగానే, హ్యుందాయ్ క్రెటా N లైన్ లోని క్యాబిన్ లోపల ఆల్-బ్లాక్ కలర్ థీమ్ లభిస్తుంది. ఇంటీరియర్ లో, ఇది సెంట్రల్ ఇన్ఫోటైన్ మెంట్ డిస్ ప్లే మరియు డ్యాష్ బోర్డ్ చుట్టూ రెడ్ హైలైట్స్, గేర్ లివర్ మరియు అప్ హోల్ స్టరీపై కాంట్రాస్ట్ రెడ్ స్టిచింగ్ ను పొందుతుంది. హ్యుందాయ్ రాబోయే క్రెటా N లైన్ లో N-లైన్ నిర్దిష్ట స్టీరింగ్ వీల్ ను కూడా అందించనున్నారు.
ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి?
హ్యుందాయ్ క్రెటా N లైన్ రెగ్యులర్ క్రెటా SUV యొక్క టాప్-స్పెక్ వేరియంట్ ఆధారంగా రూపొందించబడుతుంది. డ్యూయల్ 10.25 అంగుళాల డిస్ప్లేలు (ఒకటి ఇన్స్ట్రుమెంటేషన్ కోసం, మరొకటి ఇన్ఫోటైన్మెంట్ కోసం), డ్యూయల్ జోన్ AC, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో సహా ప్రామాణిక మోడల్ నుండి అనేక ఫీచర్లను పొందుతుంది.
ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ తో ఆటో హోల్డ్, అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
పవర్ట్రెయిన్ ఎంపికలు
2024 క్రెటా N లైన్ లో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (160 PS/ 253 Nm) ప్రామాణికంగా ఉంటుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలలో 7-స్పీడ్ DCT (డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్) తో 6-స్పీడ్ మాన్యువల్ ఉన్నాయి. N లైన్ వెర్షన్ కొత్త సస్పెన్షన్ సెటప్ మరియు సాధారణ క్రెటా కంటే పదునైన హ్యాండ్లింగ్ కోసం రెస్పాన్సివ్ స్టీరింగ్ వీల్ ను పొందుతుందని భావిస్తున్నారు. ఇది కాకుండా, ఇందులో ప్రత్యేక ఎగ్జాస్ట్ సెటప్ కూడా ఇవ్వవచ్చు.
ఇది కూడా చదవండి: 2024 హ్యుందాయ్ క్రెటా VS స్కోడా కుషాక్ VS వోక్స్వాగన్ టైగూన్ VS హోండా ఎలివేట్ VS MG ఆస్టర్ VS సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్: స్పెసిఫికేషన్ పోలిక
ఆశించిన విడుదల మరియు ధర
హ్యుందాయ్ క్రెటా N లైన్ త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. ఈ వాహనం ధర రూ.17.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుందని అంచనా. సెగన్నెట్లో, ఇది నేరుగా కియా సెల్టోస్ GTX+ మరియు X-లైన్తో పోటీపడుతుంది. ఇది స్కోడా కుషాక్, వోక్స్వాగన్ టైగన్ GT లైన్ మరియు MG ఆస్టర్ కంటే స్పోర్టియర్ ఎంపిక.
మరింత చదవండి : హ్యుందాయ్ క్రెటా ఆన్ రోడ్ ధర
0 out of 0 found this helpful